నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Wednesday, October 27, 2021

అయిదో గోడ ఓ ఘనీభవ పర్వతం - కాత్యాయనీ విద్మహే

 


సాంస్కృతిక భావజాల సంబంధమైన అయిదో గోడను బద్దలు కొట్టటం కష్టం. ఎందుకంటే అది అనేక వేల సంవత్సరాల కాలం మీద నిర్మించబడుతూ , ప్రచారం చేయబడుతూ ఎప్పటికప్పుడు  రకరకాల పద్ధతులలో సామాజిక సమ్మతిని కూడగట్టుకొని ఘనీభవించిన పర్వతం. ఆ పర్వతాన్ని బద్దలుకొట్టే ప్రయత్నంలో భాగంగా వచ్చినవే కల్పన కథలు. వాటికి ప్రతినిధి కథ అయిదో గోడ. కల్పన కథల తలుపులు తెరిచే  తాళం చెవి ఈ కథ.  

పుట్టుకతో వచ్చే లింగభేదం వల్ల శరీరం ఆడదీ కావచ్చు మగదీ కావచ్చు. కానీ ఆ శరీరాన్ని నిర్వచించి , నియంత్రించే భావజాలం మాత్రం సామాజిక నిర్మితం. లింగ వివక్ష ఉన్న సమాజాలలో  అది సహజంగా పురుష సాపేక్షతలో రూపం తీసుకొంటూ ఉంటుంది. ఫలితం  శరీరం ఒక వాస్తవం కాగా దాని చుట్టూ అల్లబడిన మాయావరణం లో బందీలుగా స్త్రీలు హింసకు గురి అవుతుంటారు. దాని  గురించిన ఎరుకగా,  అభివ్యక్తీ కరణగా స్త్రీవాద సాహిత్యం కొత్త వస్తువుతో మొదలైంది. శరీరం , బహిష్టు రక్తస్రావం, సంభోగ సంతోష విషాదాలు, గర్భం, అబార్షన్   అన్నీ కవితా వస్తువులయ్యాయి.  అవే కల్పనకు  కథా వస్తువులైనా వాటిని ఆమె నిర్వహించిన తీరు విలక్షణం.

 

కాత్యాయనీ విద్మహే 

ప్రముఖ స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు


 

 

 

 

 

 

 






Friday, October 22, 2021

నీలాంబరి- చల్లని రాగం- చక్కని కథలు



Monday, October 18, 2021

చదివించే గుణమున్న కథలు

 


 
Real Time Web Analytics