నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, December 25, 2018

నా కొత్త కథ " అయిదు శాజరాక్ ల తర్వాత"

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో డిసెంబర్ 9 వ తేదీ ప్రచురితమైన నా కథ " అయిదు శాజరాక్ ల తర్వాత" ఇక్కడ చదవండి.Monday, December 04, 2017

సంచయనం

ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన నా కథ " సంచయనం".

http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635


Thursday, September 24, 2015

తన్హాయి ప్రేమభరిత కావ్యమా? మానసిక విశ్లేషణకి విశ్వరూపమా?
నిజానికి హైటెక్ యుగంలో బ్రతుకుతున్న ఓ యద్దనపూడి హీరోయిన్ కనిపించింది నాకు కల్హారలో . ఆ భావాలు , ఆలోచనలు ,ఆత్మాభిమానం, ఆత్మ సంఘర్షణ నిస్సందేహంగా ఓ తరం ముందువే . టెక్నాలజీ పట్టాల మీద పరుగులు పెడుతున్న నేటి తరానికి అంత ఆలోచనకి సమయం లేదు . అలాగని వాళ్లు ఆలోచించడం లేదని కూడా అనలేం . వాళ్లు కూడా ప్రేమ మత్తు ఉన్న కాసేపూ అంతటి తీవ్రమైన భావాల్నీ కలిగి ఉండటం దగ్గరనించి పరిశీలిస్తే గమనించవచ్చు . ఎటొచ్చీ కల్హారకీ , కౌశిక్ కీ ఉన్నంత బాధ ఉండకపోవచ్చు . అతి కొద్ది మందిలో ఉండనూవచ్చు . ఈ తరం భగ్న ప్రేమికుల మనసుల్ని, ఎండిపోయిన భావన పూర్తిగా బీటలు వార్చక ముందే కొత్త నీరొచ్చి ముంచెత్తుతోంది. ఈ రచనలో మాత్రం ఒక ఐడియల్ కండిషన్ లో ఉండే అన్ని కోణాల్లోంచీ చక్కని విశ్లేషణ చేసారు రచయిత్రి. .రచయిత్రి భవానీ ఫణి తన బ్లాగు పదంగా పదిలమై లో తన్హాయి నవల మీద రాసిన విశ్లేషణ ఇక్కడ చదవండి. థాంక్స్ భవానీ గారు !

http://padamgapadilamai.blogspot.in/2015/09/blog-post_24.html

 
 
Real Time Web Analytics