నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Friday, August 27, 2010

తెలంగాణా ఉద్యమ గొంతుక మధుప్రియ !





బాల గాయని, వర్ధమాన రచయిత్రి మధుప్రియ గురించి ఇప్పటికే మీలో చాలా మందికి తెలిసే వుంటుంది. నాకు మాత్రం ఇవాళే తెలిసింది. ఆ అమ్మాయి గురించి ఒక స్నేహితురాలు చెప్పగానే యూట్యూబ్ లో వెతికితే ఆ అమ్మాయికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన “ ఆడపిల్లనమ్మా” పాట, అలాగే ఆ అమ్మాయితో ఒక టీవీ ఛానెల్ లో వచ్చిన ఇంటర్వ్యూ , తెలంగాణ ఉద్యమం లో పాల్గొంటూ ఆ అమ్మాయి పాడిన పాటలు అన్నీ దొరికాయి. వరస పెట్టి అన్నీ చూసాను.
ఈ ఇంటర్వ్యూలు ఎప్పుడూ వచ్చాయో నాకు తెలియదు కానీ అప్పుడు మధుప్రియ ఎనిమిదో క్లాస్ చదువుతోందట. అప్పుడు 12 ఏళ్ళున్న మధుప్రియ, తను నాలుగో క్లాస్ లో వున్నపుడు ఈ ఆడపిల్లనమ్మా పాట ని తానే సొంతంగా రాసుకొని పాడిందట. పైగా ఈ పాటకు స్ఫూర్తి మధుప్రియ సొంత జీవితమేనట. నిజంగా ఆడపిల్లనమ్మా పాట మొదటిసారి వింటున్నప్పుడు కళ్లమ్మట నీళ్ళు వచ్చేశాయి. ఆ అమ్మాయి పాట ముందు, ఆ వచన రచన ముందూ నేను సగం జీవితం గడిపాక రాసిన “ నేను కనిపించే పదం” కవిత నిజం గా చిన్నబోతూ కనిపించింది.
ఈ నాలుగు మాటలు మధుప్రియ గురించి నా లాగే ఇప్పటివరకూ తెలియని వారి కోసమే...
మధుప్రియ గురించి ఆమె మాటల్లోనే ఈ ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకోండి.
ఉద్యమ కుటుంబ నేపధ్యం నుంచి వచ్చిన మధుప్రియ కలం నుండి, గళం నుండి మరిన్ని పాటలు రావాలని మనస్ఫూర్తి గా కోరుకుంటూ....నాలాగే ఇప్పటికీ మధుప్రియ గురించి తెలియని వారి కోసం ఈ వీడీయోలు...

Sunday, December 20, 2009

తెలంగాణ పై అమెరికా రచయతల అభిప్రాయాలు!

రాష్ట్రంలో ప్రస్తుతం రగులుతున్న ప్రత్యెక తెలంగాణా అంశం పై కొందరు రచయతల అభిప్రాయలు ఆంధ్రజ్యోతి వివిధ కోసం సేకరించాము. అవి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు, సోమవారం ప్రచురితమయ్యాయి. అవి ఇక్కడ మళ్ళీ మన బ్లాగ్ మిత్రుల కోసం...ఇక్కడ




 
Real Time Web Analytics