రకరకాల హడావిడులతో దాదాపు నెలన్నర రోజులుగా పేపర్లు, బ్లాగ్ లు ( దాదాపుగా) అన్నింటికి కొంత దూరంగా వుండి హఠాత్తుగా ఇవాళ బుద్ధి పొరపాటై పేపర్లు ఓపెన్ చేసి చూస్తే ఏముంది?
ప్రపంచం మారుతోంది, మారుతోంది అభివృద్ధి దిశగా సాగుతోంది లాంటి వూకదంపుడు ఉపన్యాసాలు విని విని తుప్పెక్కిపోయిన చెవులు, కళ్ళు ఒక్కసారి ఇలాటి సందర్భాల్లో తెరుచుకొని తీవ్ర ఆవేశాన్ని, కోపాన్ని తెచ్చిపెడతాయి. పేదవాడి కోపం లాగా మనంలాంటి మామూలు వాళ్ళ కోపాలు మనకే చేటు అనుకోండి.
నాకు కోపం, అసహ్యం లాంటి అనేకానేక ఫీలింగ్స్ తెచ్చిపెట్టిన రెండు వార్తలు ఇవీ...
పోలీసులు, రాజకీయ నాయకులు ఇద్దరినీ కలిపో, విడివిడిగానో తిట్టడానికి , మామూలుగా కాదు, బాగా తిట్టడానికి నాకు కొన్ని కొత్త తిట్లు, కొత్త బూతుభాష కావాలనిపించింది. మగవాళ్లను తిట్టడానికి కూడా పరోక్షంగా ఆడవాళ్ళనే టార్గెట్ చేసి తిట్టే బాస్టర్డ్స్, లంజముండ లాంటి తిట్లు కాకుండా ఎవరైనా కొత్త తిట్లను,బూతుల్ని కనిపెడితే బావుండు. వొట్టి పనికిమాలిన వెధవలు లాంటివి, జంధ్యాల లాంటి హాస్యపూరిత తిట్లు వీళ్లకు పనికిరావు. ఇంకొంచెం స్ట్రాంగ్ గా కావాలి. ఎవరికైనా తడితే చెప్పండి.
మొదటి వార్తా కథనం : డేట్ లైన్ : భారతదేశం ( సోర్స్ : ఆంధ్ర జ్యోతి)
పోలీసు వ్యవస్థ మన దేశం లో ఇంకా ఇలాగే ప్రవర్తిస్తోందని వార్తాకథనాలు చదివినప్పుడల్లా రక్తం కుతకుత ఉడికిపోతుంటుంది. ఇలాంటప్పుడు మాత్రం ఇలాంటి వెధవల్ని ముందు ఎవరైనా కాల్చి పడేస్తే బావుండు అని హింసను ప్రోత్సహించాలనిపిస్తుంది, తప్పని తెలిసినా.....
కొడుకు ముందే తల్లి బట్టలూడదీయించి..
ఢిల్లీ ఠాణాలో దారుణం

న్యూఢిల్లీ: పోలీసు కర్కశత్వానికి ఇది పరాకాష్ఠ... 12 ఏళ్ల కొడుకు ముందే ఓ తల్లిని బట్టలు విప్పాలని ఆ బాలుడితోనే శృంగారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. పశ్చిమ ఢిల్లీ పోలీస్ పోస్టు వద్ద పోలీసు అధికారులు తనను బట్టలు విప్పాలని బలవంతం చేశారంటూ మాయాపురి బస్తీ నివాసి మయూరి (పేరు మార్చాం) ఆరోపించింది.
దొంగతనం కేసులో పట్టుబడిన తన కుమారులు ఇద్దరిని విడిపించుకునేందుకు ఆమె తన భర్తతో కలిసి పోలీసుల వద్దకు వెళ్లింది. 'మా ఇద్దరినీ ఒక గదిలోకి తీసుకెళ్లారు. ఆతర్వాత ఓ కానిస్టేబుల్ వచ్చి నా భర్తను, చిన్న కుమారుడిని బయటికి పంపి, తర్వాత నన్ను, నా కుమారుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు' అని ఆమె వివరించింది. అయితే, వారు నేరారోపణను అంగీకరించలేదు.
'ఓ కానిస్టేబుల్ నన్ను బట్టలూడదీయాలని ఆదేశించాడు. అందుకు నిరాకరిం చడంతో నన్ను కొట్టి బలవంతంగా బట్టలు విప్పించారు. మరో పోలీస్ నా కొడుకుతో శృంగారం చేయమన్నాడు. నేను వద్దని వేడుకోవడంతో తనతో శృంగారంలో పాల్గొనమన్నాడు. మేమిద్దం ఏడుస్తూ బతిమలాడాం' అని చెప్పింది. దీనిపై పోలీసు కమిషనర్కు ఆమె ఫిర్యాదు చేయడంతో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.
రెండో వార్తా కథనం: డేట్ లైన్ : వాషింగ్టన్
నిక్కీ హేలీ పై సరికొత్త దుమారం!
http://www.time.com/time/politics/article/0,8599,1995597,00.html?xid=rss-topstories
సౌత్ కెరొలినా గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా నిక్కీ హేలీ చరిత్ర తొలి భారతీయ సంతతి మహిళగా చరిత్ర సృష్టించబోతొందని ఎదురుచూస్తుంటే ప్రత్యర్ధులు ఆమెపై వ్యక్తిగత అంశాలతో, ముఖ్యంగా శీలానికి సంబంధించి బురద జల్లే ఆరోపణలు చేయడం చూస్తుంటే రాజకీయాలు అంటేనే బురద బురద అని మరోసారి అర్ధమవుతోంది. రాజకీయాల్లో స్త్రీలు, పురుషులు అని తేడా ఏమీ లేదు.ఎవరిమీదైనా సరే, ప్రత్యర్ధులకు ముందు దొరికే అంశం శీలం. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఆడవాళ్ళని మానసికంగానైనా, శారీరకంగానైనా,ఇంకేరకంగానైనా ఎదురుదెబ్బ తీయాలనుకుంటే ముందు జల్లే బురద వారి వ్యక్తిత్వం పై, వారి శీలం పై.
నిక్కీ హేలీ కి ఇద్దరు భర్తలని మొదట్లో ఒక దుమారం లేవదీశారు. ఇప్పుడేమో ఆమె సన్నిహిత స్నేహితుడు బయటకు వచ్చి మేమిద్దరూ ఒక రాత్రి హోటల్ లో గడిపాం అని స్టేట్ మెంట్ ఇచ్చాడట...సో, వ్హాట్! అనాలనిపిస్తుంది నాకైతే...కాకపోతే ఎవరూ నా అభిప్రాయం అడగలేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నానన్నమాట....