Jyothi P is with Geeta Vellanki and 5 others.
"అయిదో గోడ" కల్పనా రెంటాల గారి కథా సంకలనం. ఇందులో మొత్తం 15 కథలున్నాయి. అన్నీ స్త్రీ కోణంలో రాయబడిన కథలు. స్త్రీ జీవితంలో
ఎదుర్కొంటున్న వివక్ష, స్త్రీ జీవితంలోని అంతర్మధనం, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి స్త్రీ చేయవలసిన, చేస్తున్న, చేయదగ్గ పోరాటాన్ని స్త్రీ కోణంలో
విశ్లేషించిన కథలివి. ఈ కథలలో కామన్ పాయింట్ కథా వాతావరణం అమెరికాది. పాత్రలు
భారతీయ స్త్రీలే కాని ప్రవాసంలో జీవిస్తున్న పాత్రలు. కాని సమస్యలన్నీ తరతరాలుగా
స్త్రీలు ఎదుర్కుంటూన్నవే. అయితే కొత్త కోణంలో ఆలోచించమని ప్రేరేపించే కథలివి. తమ
కోణంలోంచి సమస్యను చూడమని చెప్తాయి పాత్రలన్నీ. అంటే ఆధునిక స్త్రీ కోణంలో స్త్రీ
జీవితాన్ని, జీవన మార్గాన్ని ఆవిష్కరించిన కథలు.
1, అయిదు శాజరాక్ ల
తర్వాత! - సృష్టి అనే భారతీయ యువతి ఒంటరిగా తనను తాను తెలుసుకోవడానికి చేసిన
ప్రయాణం ఈ కథ. కొన్నాళ్ళు ప్రేమించి కలిసి ఉన్న ప్రియుడు లావుగా ఉన్నావని ప్రిజిడ్
గా ఉన్నావని అవమానించి బంధం తెంపుకుని పోతే ఆ బాధతో ఒంటరిగా ప్రయాణం చేస్తూ లోగన్
అనే వ్యక్తితో సంభాషిస్తూ, కాసేపు ఎప్పుడూ గడపని జీవితాన్ని
ఆస్వాదిస్తూ తనను తాను తెలుసుకునే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. హరికేన్
విద్వంసాన్ని అనుభవించిన ఊరులో కథ నడిపించి నిన్న, రేపు కన్నా నేటిలో జీవించడమే ఉత్తమమైన పని అనే సందేశంతో ముగిసే కథ
ఇది.
2. క్రైమ్ సీన్ -
రేప్ జరిగిన తరువాత రేప్ విక్టిం తనకు న్యాయం జరగడం కోసం వ్యవస్థతో పోరాడాలని
నిశ్చయించుకుంటుంది. ఎన్ని ప్రయాసలకైనా ఓర్చుకుని కోర్టుకు వెళ్ళాలని
నిశ్చయించుకోవడం, ఆమెకు బాసటగా తల్లి, అన్న నిలవడం కథ. తండ్రి సగటు భారతీయుడిగా పరువు గురించి భయపడడం
కనిపిస్తుంది.
౩. అయిదో గోడ -
భర్త చనిపోయిన తరువాత తోడు కావాలి అని పేపర్లో ప్రకటించిన స్త్రీ కథ ఇది. ఇది కథలో
వచ్చే కథ. శ్రీవిద్య అనే ఒక రచయిత్రి పాత్రను కల్పన గారు సృష్టించి ఆమెతో ఈ కథ
రాయిస్తారు. స్త్రీ వాద దృష్టికోణంలో కథలు రాసే రచయిత్రులు కూడా కొన్ని
సరిహద్దులలో నిలబడే సమస్యను చూస్తారని, సమాజం నిర్దేశించిన నియమాలకు వాళ్ళే తెలియకుండా లోబడిపోయి ఉంటారని
చెప్పిన కథ ఇది. మనకు మనం ఏర్పరుచుకునే గోడలను చూసుకొమ్మని చెప్పిన కథ ఇది. స్త్రీ
వాదాన్ని ప్రస్తావించే రచయిత్రుల కిచ్చే సందేశంగా కూడా తీసుకోవచ్చు ఈ కథను.
4. హోమ్ రన్ - తన
పిల్లలు అన్నిటిలో ముందుండాలి అని తపించి పోయిన ఒక తల్లి మన మూలాలను పిల్లలకు
ఎరుకపరచడమే నిజమైన విజయం అని తెలుసుకున్న కథ.
5. స్లీపింగ్ పిల్ -
మారిటల్ రేప్ ని సంవత్సరాలుగా భరిస్తున్న ఒక స్త్రీ కథ ఇది. ఆమె శరీరం గురించి ఏ
మాత్రం ఆలోచించని భర్త ఆమెతో సెక్స్ ను తన హక్కుగా భావించడం, అతని అధికారం క్రింద ఆమె ప్రతి దినం నలిగిపోవడం ఎందరో స్త్రీల
జీవితానికి ప్రతిబింబం.
6. ఆ ముగ్గురూ ! -
ఆఫీసులో పని చేస్తున్న తోటి స్త్రీల పర్సనల్ జీవితాలలోకి తొంగి చూస్తూ నిరంతం
అశాంతికి గురయ్యే ఉద్యోగినుల కథ. ఇతరుల జీవిత కథల పై అనవసర ఆసక్తి కనబరిచే గుణం
ప్రపంచంలో అన్నీ చోట్లా మామూలే.
7. ఈస్ట్రోజన్ పిల్
- స్త్రీ శరీరంలో వచ్చే మార్పులను చులకనగా చూసే సమాజాన్ని ప్రశ్నించే కథ ఇది.
ప్రతి నెలసరి స్త్రీకి ఎన్ని భయాలను తీసుకొస్తుందే ఆమెకు శారీరికంగా, మానసికంగా ఎంత ఇబ్బంది కలగజేస్తుందో చెప్పిన కథ ఇది.
8. టూ డాలర్స్
ప్లీజ్ - ట్రైన్ ప్రయాణంలొ చిల్లర అడుక్కుంటున్న ఒక స్త్రీని చూసినప్పుడు సానుభూతి
కన్నా అనుమానమే డామినేట్ చేస్తుంది ఇందులోని యువతికి. ఆమెకు సహయపడాలని ముందు
అనిపించినా, చివర్లో వద్దని నిర్ణయించుకోడం కథ
ముగింపు. మనిషి మనసులోని దయ, వివేకంల మధ్య
సంఘర్షణను ఈ కథలో చూస్తాం.
9. టింకూ ఇన్
టెక్సాస్ - కొందరు పసి పిల్లలు తాము ఆడుకునే బొమ్మలను తమ స్నేహితులుగా అనుకోవడం
అనేది ఎక్కువగా అమెరికాలో కనిపించే విషయం. అయితే ఈ ఇమాజెనరీ స్నెహితుడిని పిల్లలు
తమ జీవితంలో ఒక భాగం చేసుకోవడం అక్కడ సహజమని ఎడ్యుకేట్ చేసే కథ ఇది. విభిన్న
సంస్కృతిలో పెరిగవలసి వచ్చినప్పుడు కొన్ని సాంస్కృతిక అలవాట్లను ఒప్పుకోవలసిన
అవసరాన్ని వివరించే కథ.
10. ఎండమావులు - లివింగ్ టూగెదర్ లో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ఒక
యువతి కథ.
11. ఇట్శ్ నాట్ ఓకే - డొమెస్టిక్ వయొలెన్స్ ను ఎదిరించి పదిహేను
సంవత్సరాల తరువాత ఆ జీవితం నుండి బైట పడిన ఓ స్త్రీ కథ.
12. అమ్మకో ఉత్తరం - అమెరికా జీవితంలోని సౌకర్యాలను అనుభవిస్తూ, తల్లిని మిస్ అవుతూ అమెకు తన సౌకర్యాలను వివరిస్తూ ఉత్తరం
రాస్తుంది ఓ కూతురు. ఉత్తరం అంతా తన సౌకర్యవంతమైన జీవితాన్ని వివరిస్తున్నా ఆమెలో
అంతర్లీనంగా ఉన్న ఒంటరితనం బైట పడుతూ ఉంటుంది. రచయిత్రీ శైలి ఈ కథలో బావుంటుంది.
పదాల అర్ధం ఒకటైతే between the lines message కూడా మనకు అర్ధం అవుతూ ఉంటుంది.
13. ది కప్లెట్ - ఒక లెస్బియన్ కపుల్ కథ ఇది. ఒక ఇండియన్ అమ్మాయి, మెక్సికన్ అమ్మాయి కలిసి జీవిస్తుంటారు. తన సెక్ష్యువల్ ఐడేంటిటీ ఇతరులకు
తెలియకూడదని ఇండియన్ అమ్మాయి అనుకోవడం ఆమెలోని ఆ ద్వంద్వాన్ని మెక్సికన్ యువతి
ప్రశ్నించడం కథావస్తువు.
14. సంచయనం - ఒక గే కపుల్ కథ. తన తండ్రితో అనుబంధానికి తపించిన ఒక
యువకుడు, తాను గే అని తెలుసుకుని తండ్రి తనను
దూరం చేసినా, ఆయన భాద్యతను చివరి రోజుల్లో తానే
తీసుకుని తాను పేంచుకున్న కొడుకికి తాత ప్రేమను పంచమని అర్ధించడం ఆలోచన
కలిగిస్తుంది.
15. కోట్ హేంగర్ - అబార్షన్ ప్రయత్నం చేసి జైలు పాలైన ఒక స్త్రీ
స్థితిని అర్ధం చేసుకొమ్మని, ఆమె కోణంలో ఆమె
పరిస్థితిని విశ్లేషించమని చెప్పిన కథ.
రచయిత్రి శైలి
బావుంటుంది. అన్ని కథలలో చర్చించిన సమస్యలు సార్వత్రికమైనవే. కాని కథలలోని స్త్రీ
పాత్రలన్నీ ప్రవాస భారతీయులవి. వారి జీవనం, అక్కడి సంస్కృతి, పెద్దగా ఇందులో
రెఫ్లెక్ట్ అవ్వవు. మన దేశంలోని మెట్రో నగరాలలొ ఇప్పుడు అన్ని వర్గాల స్త్రీలలో
కనిపించే సమస్యలే ఇవి. అక్కడి వాతావరణ నేపద్యంలో రచయిత్రి రచన చేయడం వారికి
అలవాటయిన పరిస్థితుల మధ్య కధను నడపడానికి అనుకూలత కోసం మాత్రమే అనుకోవచ్చు.ఈ కథలలో
అమెరికన్ థాట్, లైఫ్, కల్చర్ పెద్దగా కనపడవు. అందుకని ప్రవాస భారతీయ కథలనే దృష్టితో కాక, కేవలం స్త్రీవాద దృక్కోణంలో రాసిన కథలుగా ఇవి చూడాలి.
"అయిదో గోడ" కథ హైదరాబాద్ నేపద్యంలో సాగుతుంది.
"స్లీపింగ్ పిల్" "ఈస్ట్రోజన్ పిల్" కథలలో ప్రాంతం
ప్రస్తావనకు రాదు కాని, కథలు చదువుతుంటే ఇవి అమెరికన్
నేపద్యంలోనివి కాదు అనిపిస్తుంది. ఈ మూడు కథలు కాకుండా మిగతా 12 కథలలోని పాత్రలన్నీ ప్రవాస భారతీయులే. ఇందులో ప్రస్తావించిన
సమస్యలు మాత్రం, ప్రపంచంలో అందరి స్త్రీలవి. మరీ
ముఖ్యంగా భారత స్త్రీలందరివీ. సొ ఇవి మనందరి కథలు......
9 Comments6 Shares
Comments
Geeta Vellanki అవును మనందరి కథలు
o 1d
Ramadevi
Balaboina అన్ని కథలనూ
చక్కగా విశ్లేషించారు.
ప్రాంతమేదైనా బాధలకు కొదవే లేదు
స్త్రీకి...
o 1d
o 1d
SV
Sivasubrahmaniam అద్భుత విశ్లేషణ
o 23h
Jr Kumar Bagundi
o 21h
Ezra Sastry Excellent!! విశ్లేషణ....
ఇరువురికి అభినందనలు
o 20h
o 16h
Afsar Mohammed Thankyou so much,
Jyothi gaaru, it's a honor...
o 9h
0 వ్యాఖ్యలు:
Post a Comment