హేపీ థాంక్స్ గివింగ్!
ఒక పక్క recession. ఎవరికి ఉద్యోగం పోతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి . అయినా సరే, అమెరికా అంతా Thanksgiving పండుగ కళ కనిపిస్తోంది. Black Friday సేల్స్ తో షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి.
క్రిస్మస్ లాంటి పండుగల్ని అన్నీ దేశాల్లో జరుపుకుంటారు కానీ థాంక్స్ గివింగ్ మాత్రం ఒక్క అమెరికా , కెనడాల్లో మాత్రమే జరుపుకుంటారు. నాకైతే ఇది మన సంక్రాంతి పండుగ లాంటిదే అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అయినా, థాంక్స్ గివింగ్ అయినా కూడా పంట చేతికొచ్చినప్పుడు చేసుకునే పండుగలే...కాకపోతే, థాంక్స్ గివింగ్ కు సంబంధించి పిలిగ్రింస్ కథ వేరుగా వుంటుంది.
థాంక్స్ గివింగ్ అంటే టర్కీ, పంప్కిన్ పై, క్రాన్ బెర్రి సాస్, బ్లాక్ ఫ్రైడే సేల్స్ మాత్రమే కాదు అందులో అంతర్లీనం గా వుండే స్పిరిట్ మాత్రం గొప్పది. ఏడాది మొత్తం లో ఇది స్నేహపూరిత వాతావరణాన్ని తెస్తుంది. ఎంతెంత దూరాల నుండో కుటుంబ సభ్యులతో కలిసి థాంక్స్ గివింగ్ జరుపుకోవటానికి వెళ్తారు. ప్రధానం గా ఇది కుటుంబంతో కలిసి జరుపుకునేదే అయినా స్నేహితుల్ని కూడా ఆహ్వానిస్తారు. అందరు కలిసి పెద్ద విందు చేసుకుంటారు. ఈ వేడుకల్లో ప్రధానమైనది థాంక్స్ తెలుపుకోవటం.
మనం కూడా మన జీవితాలకు సంబంధించి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఈ జీవితాన్ని ఇచ్చి మనల్ని పెంచి పెద్ద చేసి కనీసం ఈ మాత్రమైనా తీర్చిదిద్దిన తల్లితండ్రులకు, చదువు అంటే డిగ్రీలే కాకుండా నిజమైన విజ్ఞానాన్ని అందించిన ఎందరో గురువులకు పాదాభివందనాలు.స్నేహం అనే పూలతోట లో ఎన్నెనో సీతాకోకచిలుకలు...ఏ రంగులో వున్నా అందంగా కనిపిస్తాయి. సీతాకోకచిలుకలు లేని పూలతోట, స్నేహితుల్లేని జీవితం వుంటుందా? ఇన్నేళ్ళ జీవితంలో అలా మొదటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో స్నేహాలు, ఎందరెందరో స్నేహితులు...అందరికీ అభిమాన మకరందాలు ఇవిగో! అందుకోండి!!
ప్రేమ అనే మధురిమ లో అన్నిరకాల బంధాల్ని చవిచూపించిన సహచరుడికి...రోజూ నవ్విస్తూ కొత్త కాంతిని, కోటి ఆశల్ని మోసుకొచ్చే మా చిన్ను లోని పసితనానికి.... not just thanks, but something more....
జీవితం అంటే రకరకాల కోణాల్ని చూపించి, అర్ధమయ్యేలా అనుక్షణం పక్కన వుండే దీపస్థంబం లాంటి పుస్తకాలకి, రచయతలకు ధన్యవాదాలు చెప్పటానికి అక్షరాలు సరిపోవు.
చివరిగా ఈ బ్లాగ్ రూపం లో నేనేమి రాసినా....రాయకపోయినా రోజూ వచ్చి చూసిp వెళ్ళిపోయే పాఠకులకు కొత్త బ్లాగ్
ద్వారా మరో సారి సాదర స్వాగతం. ఎప్పటిలాగానే మీ అభిమానాన్ని, ఆదరణ ని కోరుకుంటూ....
నిజానికి ఇది మొదట చెప్పాల్సిన థాంక్స్ కానీ చివరకు ఎందుకు చెప్తున్నానంటే special గాబట్టి. అందమైన ఈ సృష్టినీ సృష్టించి ఏ రూపంలో నైనా, ఏ పేరుతోనైనా వుండగలిగే ఆ భగవంతుడికి మన థాంక్స్ అక్కర్లేదు కానీ చెప్పటం మన కనీస ధర్మం అనుకుంటాను.
హేపీ థాంక్స్ గివింగ్!
ముఖపుస్తకంలో పునఃప్రవేశం
-
ఫేస్బుక్ లో అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయవ్యవహారాలు పరికించడానికి
తెరిచిన నాపేజీ చూడండి మీకు ఆవిషయాలు మీరు అనుసరిస్తుంటేనే.
4 hours ago
7 వ్యాఖ్యలు:
ముందు గా నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు. తరువాత మీకు కూడా హ్యాపీ థ్యాన్క్స్ గివింగ్. అంటే అన్నానని బాధ పడతారు కాని కల్పన మీ వైపు అసలు అమెరికా లో అందాలు పండుగ హడావుడు లు చూడాలంటే మా నార్త్ ఈస్ట్ వైపే. మీ వైపు కంటే మా వైపు బాగుంటుంది.. వె వె వె(వెక్కిరిస్తున్నా ) :-)
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు. ఏంటి పాత ఇంటి ఓనర్ సతాయిస్తున్నాడా? నాలుగు దులిపేసి రావొద్దా?
ఐనా ధాంక్స్ చెప్పాలంటే సంవత్సరంలో ఒకరోజు మాత్రమేనా.ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్తాముగా??
మీ కొత్త ఇల్లు బాగుందండి . శుభాకాంక్షలు .
@భావన. మీరన్నది నిజమే. మా కౌ బాయ్, కౌ గర్ల్ అందాలు మీ దగ్గర లేవు కదా...హిహిహి (నవ్వుతున్నానన్నమాట...)
@ప్రవీణ్. దేని అందం దానిదే అనుకుంటాను.
@జ్యోతి, పాత ఇంటి వోనర్ పాపం మంచివాడు. మనల్ని భరించాడు గా. థాంక్స్ ఎప్పుడైనా చెప్పవచ్చు. కాని అలా చెప్పటానికి ఇది ఒక మంచిరోజు.
@ మాలా కుమార్ గారు మా ఇంటికి ఇలా క్రమం తప్పకుండా వస్తారని, వస్తూనే వుంటారని...
Yemto ee godava ee blagotaallo okka mukka arthamayite ottanukondi - anta daggaragane vunnatanipistundi - yedi chetikandadu
అనానిమస్ గారు, మీ బాధ ఏమిటో నాకు కూడా అర్ధమై కానట్టు వుందండీ. యనీ హౌ థాంక్స్.
Kalpana garu,
chala bagaa raasaaru.
Thanks,
Lalitha.
Post a Comment