నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, January 22, 2022

అమెరికా జీవితాన్ని ఒడిసి పట్టుకున్న కల్పన కథలు - ప్రసూన బాలాంత్రపు


ఈ వేళ రెండు పుస్తకాలు పూర్తి చేసాను .... - Prasuna Balantrapu | Facebook



ఈ వేళ రెండు పుస్తకాలు పూర్తి చేసాను . కథల పుస్తకాలతో నాకు ఉన్న గొడవ ఏమిటంటే వెంట వెంటనే చదవను . ఒక్కో కథ చదివాక గాప్ తో రెండొది . అందుకే కొంచం ఆలస్యమవుతుంది .
ఇవ్వాళ పూర్తి చేసిన రెండూ పుస్తకాలు -- అయిదో గోడ, సమాంతరాలు .
ముందు అయిదో గోడ. కల్పన రెంటాల గారి కథల పుస్తకం . అది ముందు ఎందుకంటే అది ముందు మొదలు పెట్టాను .
మొదటి కథ ' అయిదు శాజరాక్ ల తర్వాత ' . ఇది చదవగానే , ఆలోచన సార్వజనీకం అయినా కథ నేపధ్యం , వస్తువు రెండు అమెరికన్ స్త్రీలవే అనిపించింది . కల్పన అమెరికన్ లైఫ్ బాగా ఒడిసిపట్టుకున్నారు అనుకున్నాను .
ఇక రెండొ కథ 'క్రైం సీన్ '. ఇది రేప్ కి గురి అయిన శ్రియ కథ . ఆ విషయం కేస్ పెట్టడానికి సగటు భారతీయ తండ్రిలా ఆలోచించే తండ్రి , న్యాయం కోసం పోరాటం లో ఆమెకి అండగా నిలబడే తల్లి , తమ్ముడు . మారుతున్న కాలానికి ప్రతీక . ఇది ఏ దేశం లోనైనా ఇలాగే జరుగుతుంది .
నాకు నచ్చిన కథ అయిదో గోడ . స్త్రీ మళ్ళి తోడు కావాలి అనుకుంటే మన సమాజం అర్థం చేసుకోలేదు . ఎంతో సహజం గా ఉంది . ఇది పూర్తిగా మన భారత దేశ సమస్య . అలాగే పిల్లలు పై వత్తిడి తెచ్చి తమ కలలు వారు పండించుకోవాలనే ఒక తల్లి , అవస్థ పడే పిల్ల వాడి కథ హోం రన్ .వివాహంలోని మరో పార్శ్వం స్లీపింగ్ పిల్ . ఈ కథ చదివితే మన దేశంలో మారేజ్ కౌన్సిలింగ్ ఎంత అవసరమో అని అనిపిస్తుంది . ఆ ముగ్గురు కథ కూడా స్త్రీ మెనోపాజ్ విషయం . నా ఆలొచన మరింత బలం చేకూరుతొంది .
టు డాలర్స్ ప్లీజ్ -- అడుక్కొవడం అన్నీ దేశాలలో వేరే వేరే రూపాల్లో ఉంటుంది . ఆర్థిక అసమానత్వం హద్దులు దాటితే వచ్చే పరిస్థితి ఇది
టింకూ ఇన్ టెక్సాస్ -- పిల్లల మనస్తత్వం పై చాలా మంచి కథ . పిల్లల తల్లులు , తండ్రులు చదవాలి .
ఎండ మావులు , ఇట్స్ నాట్ ఒకే -- రెండు కథలు ఏ దేశమైనా ఆడవారు ఎదుర్కొనే సమస్యలు ఒకటే అనిపిస్తాయి . అమ్మ కో ఉత్తరం -- అమెరిక జీవితం ఒక చిన్న పేరాలో ఒక పెద్ద చిత్రం గీసేసారు
.
ఇక చివరి మూడు కథలు మనస్సుని కదిలించాయి . లెస్బియన్. గే కథలని , వారి మానసిక సంఘర్షణని ఎంతో సున్నితంగా మన ముందు వుంచారు . జీవితాని ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప ఇలా రాయలేరు. పరిశీలించడం విమర్శనాత్మకంగా కాకుండ , జడ్జ్ చెయ్యకుండా మన ముందు ఉంచడంతో కల్పన గారు ఉత్తమ కథకుల జాబితాలో తన స్థానం సుస్థిర పరచుకున్నారు . కథ చిక్కగా , నిండుగా ఉండడం ఆమె ప్రత్యేకత .
తన తీసుకున్న అంశాల పై ఎన్నో చర్చలు జరిగాయి . జరగాలి కూడా ! సంఘర్షణ అనేది అప్పుడే పూర్తిగా ఫలవంతమవుతుంది . మార్పు అనే ఫలితం వస్తుంది . అందరూ ఒక సారి కాదు , కొన్ని కథలు రెండు మూడు సార్లు చదవాలి .అభినందనలు

May be an image of text that says 'Organisation (DRDO) said అయిదో గోడ కల్పనారెంటాల'

0 వ్యాఖ్యలు:

 
Real Time Web Analytics