మైదానం మీద రఘురామరాజు పోస్ట్ మోడర్నిజం ఆధారంగా చేసిన ప్రతిపాదనల మీద నా అభిప్రాయాలు వ్యాసం గా రాసి రెండు భాగాలు గా అందించాను. మైదానం పై సర్రియలిజం ఆధారం గా మహేష్ కొన్ని ప్రతిపాదనలు చేసారు. అయితే అవి కామెంట్ల రూపం లో వుండటం వల్ల వాటిల్లోంచి ముఖ్యమైన వాటిని, వాటి మీద నాకున్న ప్రశ్నలు అనండి, లేదా సందేహాలు అనండి ఇక్కడ పెట్టాను. మొత్తం చర్చ అంతా కామెంట్ల రూపం లో వుండకుండా...మహేష్ , మీరు కూడా మీ ప్రశ్నల్ని మీ బ్లాగ్ లో పోస్ట్ లాగ పెడితే ఇక్కడ మాట్లాడటం ఇష్టం లేని అనేకమంది అక్కడ మాట్లాడే అవకాశం వుంది.
మహేష్ తన కామెంట్ లో అన్న మాటల మీద నాకు వచ్చిన సందేహాలు ఇవి. అయితే ఇవన్నీ పాపం కామెంట్ పెట్టిన పాపానికి మహేష్ సమాధానం చెప్పాలని కాదు నేను అడుగుతున్నది. ఈ పాయింట్లతో ఆలోచిస్తే ఇంకో కోణం ఏమైనా మనకు కనిపిస్తుందా అని మాత్రమే...మీరు ఇప్పటికే సర్రియలిజం ద్వారా కొంత విశ్లేషణ చేసానన్నారు కాబట్టి మీకే ఈ ప్రశ్నలన్నీ. మీకు అర్ధం అయితె, ఇక్కడ చెపితే ఒక కొత్త కోణం లో మైదానాన్ని చూడవచ్చు.
మహేష్ అభిప్రాయాలు ఇవి:
"నావరకూ, రాజేశ్వరి చేసింది న్యాయమా,అన్యాయమా,అపవిత్రమా లాంటి భౌతిక ప్రశ్నలు మైదానం విశ్లేషణలో అప్రస్తుతాలు. రాజేస్వరిద్వారా చలం సమాజానికి కొన్ని ప్రశ్నలు సంధించి, ఛాలెంజ్ విసిరాడు. సమాజం ఇలాగే ప్రవర్తిస్తే ఎందరో రాజేశ్వరిలకు మనోలోకాలే భావప్రాప్తి జగత్తులౌతాయని వార్నింగ్ ఇచ్చాడు.సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (ఫ్రగ్మెంతెద్ చొన్స్చిఔస్నెస్స్)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు.ఒక వ్యక్తి వ్యక్తిగా బ్రతకలేనినాడు, తన వాంఛల్నీ,కోరికల్నీ,ఆకాంక్షల్నీ అణగదొక్కిననాడు సామాజిక పతనం ఆరంభమవుతుందని బలంగా నమ్మినవాడు చలం. రాజేశ్వరి విషయంలో కూడా అదే చెప్పాడు.పురుషులకు కనీసం ఎలుగెత్తి అరిచే స్వతంత్రమన్నా ఉంది.ఠెయ్ హవె అ వెంత్ ఫొర్ థైర్ ఫ్రుస్త్రతిఒన్. కానీ స్త్రీకి మైదానం సమయానికి అదికూడా లేదు.కాబట్టి ఆ చెప్పుకోలేని, పోరాడలేని,అసహాయమైన సప్రెషన్ లోంచి రాజేశ్వరి ఒక ఊహాజనిత మైదానాన్ని సృష్టించింది.అందులో తన ప్రేమవాంఛ, మాతృకాంక్షల ఆపూర్తికై తపించిందని నాకనిపిస్తుంది. వాటికి ప్రతీకలే అమీర్,మీరా.అదొక ప్రయత్నం. అదొక మనోజనిత కాంక్ష.అదొక కాల్పనిక వాస్తవం. భౌతికంగా కాకపోయినా, మానసికమైన "నిజం". అందుకే రాజేశ్వరిని ఈ కాల్పనిక వాస్తవంలోకి వెళ్ళడానికి ఏర్పడ్డ పరిస్థితి/కారణాలు ఆ లోకంలో తను చేసిన ప్రయత్నం ముఖ్యమౌతాయిగానీ వాటి ఫలితం, ఆ ఫలితాల మీద మన "అభిప్రాయం" కాదు "
నా ప్రశ్నలు ఇవి:
మనం రాజేశ్వరి ప్రవర్తన గురించి మాట్లడనప్పుడు ఇక మనం మైదానం లో ఏ అంశాల గురించి మాట్లాడుకోవాలి? రాజేశ్వరి ద్వారా చలం సమాజానికి సంధించిన ప్రశ్నలు ఏవేమిటి (మనకు మరింత క్లియర్ గా అర్ధం కావటానికి )? అందులో ముఖ్యంగా పురుషులకు? మైదానం లో వున్న పురుష పాత్రలు రాజేశ్వరి భర్త, అమీర్, మీర్ వీరిలో చలం చూపించిన అంశాలు ఏమిటి? మనం మైదానం అంటే ఎప్పుడు రాజేశ్వరి కి ఇచ్చిన ప్రాధాన్యత అమీర్, మీర్ లకు ఎందుకు ఇవ్వం? మగవాళ్ళు అలా ప్రవర్తించటం కొత్త కాదు అనుకోవటమా? లేకా వారి ప్రవర్తన కు ఒక ఆమోద ముద్ర అప్పటికీ, ఇప్పటికీ వుందా? అమీర్, రాజేశ్వరి లొ అనుబంధం కంటే, మీర్, రాజేశ్వరి ల అనుబంధం ఎందుకు చాలా మందికి చికాకు తెప్పిస్తుంది? అందులో రాజేశ్వరి పాత్ర ఏమిటి? మీర్ పాత్ర ఏమిటి? సన్సారాలు, దాంపత్యాలు ఇలా ఏడవటంలో పురుషుల పాత్ర, స్త్రీల పాత్ర ఏమేమిటి? మైదానంలో స్త్రీలలో మాత్రమే మీరు చెప్పిన ఫ్రగ్మెంతెద్ చొన్స్చిఔస్నెస్స్ కనిపిస్తుందా? అమీర్, మీర్ ల్లో కూడా అలాంటిదేమైనా వుందా? రాజేశ్వరి మాత్రమే కోరికల్ని అణుచుకుందా? మీర్, అమీర్ మాటేమితి? వాళ్ళది నైతిక పతనం అని ఎవరు ఎందుకు మాట్లడరు? తన సుప్రెస్సిఒన్ లో నుంచి రాజేశ్వరి మానసిక ప్రపంచం గా మైదానాన్ని సృష్టించుకుంటే అమీర్, మీర్ పెర్ఫెక్ట్ గా వుండాలి కదా..తన వూహజనిత ప్రపంచంలో కూడా మగవాడిని రాజేశ్వరి అలాగె వూహించుకుందా?
నాకైతే అప్పటికీ , ఇప్పటికీ ఒకటే మాట. ఎందులోంచి చూసినా మనకు ప్రశ్నలే తప్ప సమాధానాలు కనిపించవు. రాజేశ్వరి తను అలా ప్రవర్తించాలనుకుందో అలా ప్రవర్తించింది . ఒక దార్శనికుడైన రచయత గా చలం దాన్ని వీక్షించాడు.. సృజన చేశాడు. చాలా మంది మగవాళ్ళు, రాజేశ్వరి లాగా స్త్రీలు మైదానంలోకి తమతో వచ్చేయాలని కోరుకుంటారు. అది చలం పైకి చెప్పటమే కాకుండా మరో అడుగు ముందుకు వేసి అలాంటప్పుడు కూడా ఆ మైదానం లో మగవాళ్ళ ప్రవర్తన, ఆడవాళ్ళ వాంఛలు ఎలా వుంటాయో చలం వూహించి బైటపెట్టేసాడు అనుకుంటాను. అందుకే నాకు మైదానాన్ని ఏ థియరీ తో చూసినా ఒక్కటి కూడా సమగ్రంగా అర్ధం చేసుకోవటానికి ఉపకరించనట్లు అనిపించదు.
ముఖపుస్తకంలో పునఃప్రవేశం
-
ఫేస్బుక్ లో అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయవ్యవహారాలు పరికించడానికి
తెరిచిన నాపేజీ చూడండి మీకు ఆవిషయాలు మీరు అనుసరిస్తుంటేనే.
8 hours ago
12 వ్యాఖ్యలు:
రాజేశ్వరి అమీర్ దగ్గరకి వెళ్ళడాన్ని అర్థం చేసుకోని వాళ్ళు ఆమె మీరా దగ్గరకి వెళ్ళడాన్ని అర్థం చేసుకునే అవకాశం లేదు. చలం గారు వ్రాసిన ఇతర రచనలు చదివిన తరువాత మైదానం నవల చదివినవాళ్ళు కొంత వరకు అర్థం చేసుకునే అవకాశం ఉంది.
హ్మ్మ్... మీ expectation లోనే కొంచెం లొసుగుందనుకుంటాను. సాహిత్యం అనుభవించడానికి. ఆ అనుభవానికి హేతువు ఆసరం లేదు. కానీ,అనుభవాన్ని legitimize చేసి (ఇతరులకు) చెప్పడానికి లిటరరీ థియరీలు అవసరం అవుతాయి.థియరీలు సమగ్ర సాహిత్యాన్ని ‘కొన్ని’మూసల్లోపోసి, "ఇలా అర్థంచేసుకుంటే సరిపోతుందేమో" అనిచెప్పే limited సాధనాలు. వాటిద్వారా ‘నా అనుభవాన్ని అర్థంచేసుకుంటాను’ అనుకోవడం అంత ప్రోత్సాహనీయం కాదు.
ఇక మీ ప్రశ్నల విషయానికి వస్తే...
1)రాజేశ్వరి "ప్రవర్తన" చర్చా విషయమైతే అది తప్పా-ఒప్పా అనే జడ్జిమెంటుకు కూర్చోవాలి. తప్పన్నా ఒప్పన్నా రెండూ తప్పే అవుతాయి. ఎందుకంటే, తప్పంటే ప్రాపంచిక నైతికకోణం ఆధారంగా చేసే బేరీజు. ఒప్పు అంటే మరో ప్రాపంచిక వ్యక్తివాద అభ్యుదయ పంథాను అనుసరించి చేసే బేరీజు. నా దృష్టిలో రాజేశ్వరి ఈ రెంటికీ అతీతమైనది.
రాజేశ్వరి ఒక స్త్రీకాదు. స్త్రీత్వానికి ప్రతీక.She represents primordial instincts of woman.ముఖ్యంగా ప్రేమవాంఛ, మాతృకాంక్షల కలగలుపు రాజేశ్వరి.
2)మైదానం ద్వారా సమాజానికి చలం సంధించిన ప్రశ్నలు ఏమిటి అనేది. నావరకూ మైదానం నవల మొదటిపేజీలో రాజేశ్వరి అంత:సంభాషణే చలం ప్రశ్నలు.
అమీర్ (ప్రేమవాంఛ), మీరా(మాతృకాంక్ష)ల్ని అనుభవించిన తరువాత చుట్టూవున్న ప్రజలు పురుషులేనా, అసలు మనుషులేనా? అని ప్రశ్నిస్తుంది రాజేశ్వరి. Suppressed sexuality,(lack of)reproductive rights గురించి ఎంత విలువైన ప్రశ్నలవి! ఇప్పటికీ ప్రపంచం మొత్తం సంధిగ్ధంలో పడికొట్టుకుంటున్న ప్రశ్నలు కదా అవి!! ఇంత సూటిగా,ఇంత ఘాఢంగా వాటి స్పృహైనా లేని కాలంలో ఈ పితృస్వామ్య/పురుషాధిక్య సమాజంలో ప్రశ్నించిన చలం దార్శనికుడో,ఋషో కాదంటే ఎలా నమ్మేది?
3)రాజెస్వరి భర్త ఒక సాంప్రదాయ పురుషుడికి ప్రతీక. ఉద్యోగం చెయ్యడం, డబ్బుసంపాదించడం,స్త్రీద్వారా అవసరాల్ని తీర్చుకోవడంతప్ప స్త్రీని ప్రేమించడం,కాంక్షించడం తెలీని/రాని ఒక సగటు మగాడు. రాజేశ్వరిలో నిద్రాణమైన స్త్రీత్వపు వాంఛకు అమీర్ ప్రతీక. మాతృకాంక్షకు మీరా ప్రతీక.
4)కాల్పనిక జగత్తు perfect గా ఉండాలనే నియమం ఏదీలేదు. కల్పన నిజానికి ఒక కొనసాగింపు మాత్రమే.తెలిసినంతలో మనం కోరుకునే నిజాలకు కొనసాగింపుగా కల్పన సాగుతుంది. కానీ ఒక స్థాయిదాటాక మన imagination ఆగిపోతుంది. కల్పనలో నిజాన్ని-నిజంలో కల్పననీ వెతుకుతూ మనసు తికమక పడుతుంది.
అదే సర్రియలిజం. ఆ టెక్నిక్ కున్న బలమే అది.ఆ తికమకలోంచీ ఊహాజనిత సమాధానాలు కాక "నిజం"తో మరింత లోతైన అనుబంధం ఏర్పడుతుంది, నిజం ఉనికి మరింతగా బహిర్గతమౌతుంది.
5)అమీర్,మీరాలు perfect beings కాదు.
అమీర్ లో చలనహిత పురుషవాంఛను చలం ఆవిష్కరించాడు.రాజేశ్వరితో ఉంటూకూడా తోళ్ళసాయిబు కూతుర్ని ఆశించడం అందుకే.రాజేశ్వరి గర్భందాలిస్తే క్రూరుడయ్యేది అందుకే. దాన్ని నైతిక పతనం అంటే ప్రాపంచిక విలువలకు గౌరవమిచ్చినట్లేకదా! రాజేశ్వరికి అతీతమైన నైతికత అమీర్ కు ఎందుకు ఆపాదించాలి? ‘అమీర్ని ప్రేమించడం స్త్రీలకు సహజం’ అని రాజేశ్వరికే అనిపించినప్పుడు అమీర్ నైతికత మనకెందుకు?
మీరా మాతృకాంక్షకు ప్రతీక. రాజేశ్వరికి కొడుకు-తమ్ముడు-ప్రేమికుడు-రక్షకుడు అన్నీ మీరానే. మీరాను రాజేశ్వరి తన సౌందర్యంతో లాలిస్తుంది. కఠినత్వంతో శాసిస్తుంది. ప్రేమతో అక్కునచేర్చుకుంటుంది.ఈ process లో మీరాలోని పురుషవాంఛ పురుడుపోసుకుంటుంది. ఆ వాంఛకు కారకురాలు,ప్రోత్సాహకురాలూ రాజేశ్వరే.
ఈ సంబంధం కొందరికి చికాకు కలిగించేది కేవలం "feeling of guilt" కారణంగా. మీరా-రాజేశ్వరిల సంబందం incestuous బంధంగా కనిపించడం వలన.అది కేవలం ఆ చదువరుల projection అంతే.
ఇవినా సమాధానాలు కావు. మీ ప్రశ్నలకు నేను జోడించిన మరికొన్ని ప్రశ్నలు మాత్రమే.
అమీర్ తనకి ఆడది కావాలనుకున్నాడు కానీ ఆమె పిల్లల బాధ్యత అవసరం లేదనుకున్నాడు. ఇలాంటి హిపోక్రైట్స్ నిజ జీవితంలో చాలా మంది ఉన్నారు. అప్పట్లో చలం గారు ఈ హిపోక్రిసీని విమర్శించడం గొప్పే. ఇప్పుడు కూడా అలాంటి హిపోక్రిటిక్ తత్వం నుంచి బయటపడేలేని వాళ్ళు ఉన్నారు.
@భావన, నాకు తెలిసి కామెంట్ ఇ ఫాంట్ సైజ్ పెంచే ఆప్షన్ ఎక్కడా కనిపించలేదు. కాకపోతే మీరు పోస్ట్ కామెంట్ క్లిక్ చేస్తే మాత్రం కామెంట్లు అన్నీ కొంచెం పెద్దగానే కనిపిస్తున్నాయి. I will try to do whatever I can in this regard. Sorry for the inconvenience.
@ప్రవీణ్, మహేష్ మాట్లాడే సాహిత్య విమర్శ వేరు, మీరు మాట్లాడుతోంది వేరు. Please cooperate for the smoothful discussion without any side tracks.
@ మహేష్, మీ కామెంట్ చదివాను. కొంచెం అర్ధం చేసుకొని నెమ్మదిగా మీకు రిప్లై పెడతాను.
@భా.రా.రె. అసలే ప్రశ్నలతో వుంటే మళ్ళీ ప్రశ్నా నా? అది యే మైదానమైనా కావచ్చు. వూహాజనిత కాల్పనిక లోకం అంటారు మహేష్. మీరు మైదానం మొత్తం మీద మీ అభిప్రాయం చెప్పవచ్చు కదా...విసర్జకాలంటే నే పట్టించుకోకూడదని కదా....
మహేష్ వ్రాసారు
>>>>>
3)రాజెస్వరి భర్త ఒక సాంప్రదాయ పురుషుడికి ప్రతీక. ఉద్యోగం చెయ్యడం, డబ్బుసంపాదించడం,స్త్రీద్వారా అవసరాల్ని తీర్చుకోవడంతప్ప స్త్రీని ప్రేమించడం,కాంక్షించడం తెలీని/రాని ఒక సగటు మగాడు. రాజేశ్వరిలో నిద్రాణమైన స్త్రీత్వపు వాంఛకు అమీర్ ప్రతీక. మాతృకాంక్షకు మీరా ప్రతీక.
>>>>>
ఇవి వైరుధ్యాలే కదా. స్త్రీ-పురుష సంబంధాలలో వైరుధ్యాలు ఉండకూడదనే కదా చలం కోరుకున్నాడు. మైదానం నవలలో చలం డిస్టినేషన్ చూపించకపోయి ఉండొచ్చు కానీ వైరుధ్యాల గురించి అర్థమయ్యేలా చెప్పాడు.
మహేష్ వ్రాసారు
>>>>>
5)అమీర్,మీరాలు perfect beings కాదు.
అమీర్ లో చలనహిత పురుషవాంఛను చలం ఆవిష్కరించాడు.రాజేశ్వరితో ఉంటూకూడా తోళ్ళసాయిబు కూతుర్ని ఆశించడం అందుకే.రాజేశ్వరి గర్భందాలిస్తే క్రూరుడయ్యేది అందుకే. దాన్ని నైతిక పతనం అంటే ప్రాపంచిక విలువలకు గౌరవమిచ్చినట్లేకదా! రాజేశ్వరికి అతీతమైన నైతికత అమీర్ కు ఎందుకు ఆపాదించాలి? ‘అమీర్ని ప్రేమించడం స్త్రీలకు సహజం’ అని రాజేశ్వరికే అనిపించినప్పుడు అమీర్ నైతికత మనకెందుకు?
>>>>>
సంప్రదాయ సమాజంలో ఒక స్త్రీ తెలిసి భార్య ఉన్న వ్యక్తికి రెండవ భార్యగా వెళ్ళినప్పుడు స్త్రీవాదులు విమర్శిస్తారు కదా. ఇది సంప్రదాయపు అవతలి (out of tradition) కథ అయినా అమీర్ రాజేశ్వరి ఉండగా వేరే స్త్రీని కోరుకోవడాన్ని తప్పు పట్టాలి. రాజేశ్వరికి జెలసీ లేకపోవచ్చు. కానీ తన భర్త లేదా ప్రియుడు అలా చేస్తే అర్థం చేసుకునే తత్వం అందరి స్త్రీలకి ఉండదు కనుక ఈ విషయంలో పురుషుడిని విమర్శించాలి. అది అమీర్ అయినా సరే. రాజేశ్వరి మొదట అనుకున్నా అనుకోకపోయినా అమీర్ రాజేశ్వరికి చెయ్యాలనుకున్నది ద్రోహమే.
మహేష్,
ఎందుకు రాజేశ్వరి అతీతమైంది? ఆమె స్త్రీ కాబట్టా? ఏ స్త్రీ వూహించని విధంగా, ఆమాట కొస్తే ఏ పురుషుడు కూడా వూహించని విధంగా చేసింది కాబట్టా? మనం మైదానాన్ని వూహాజనితం గా తీసుకుంటే , కేవలం కాల్పనికత ( అది చలం ది కానివ్వండి, రాజేశ్వరి ది కానివ్వండి) అనుకుంటే రాజేశ్వరి నే కాదు, అమీర్ ని మాత్రం మనం ఎందుకు తప్పు పట్టడం? ఎవరిది తప్పొప్పొలు కాకుండా ఎవరి వాంఛలు, ఆలోచనలు , కాంక్షలు వారివి అని సరిపెట్టుకుంటున్నామా? లేదు. రాజేశ్వరి ది తప్పు కాదంటున్నాము కాని, రాజేశ్వరి అమీర్ ని ప్రేమించినంతగా , అమీర్ రాజేశ్వరి ని ప్రేమించలేదని అనిపిస్తుంది. చలం ఉద్దేశం కూడా అదేనంటారా? కథ రాజేశ్వరి వైపు నుంచి చెప్పటం వల్ల మనకు అలా అనిపిస్తుందా? ఒక వేళ ఇదే కథ ని చలం అమీర్ వైపు నుండి చెప్పాడని వూహించి చూడండి. అప్పుడు చలం ఎలా రాసి వుండే వాడో.... Oh!man! Chalam IS, WAS great through maidaanam. మైదానం అర్ధం చేసుకుందామనుకున్నప్పుడల్లా ఎప్పటికప్పుడు కొత్త ప్రశ్నలు...
"ఇంత సూటిగా,ఇంత ఘాఢంగా వాటి స్పృహైనా లేని కాలంలో ఈ పితృస్వామ్య/పురుషాధిక్య సమాజంలో ప్రశ్నించిన చలం దార్శనికుడో,ఋషో కాదంటే ఎలా నమ్మేది?"
నేను 100 శాతం అంగీకరిస్తాను ఈ మాటతో.
మీ ప్రశ్నలకు, నా ప్రశ్నలు, నా ప్రశ్నలకు మీ అదనపు ప్రశ్నలు, వీటన్నింటికి మరిన్ని ప్రశ్నలు...థాంక్స్ మహేష్. మీరు ఓపికగా లోతైన విశ్లేషణ చేసినందుకు...
రాజేశ్వరి is a symbol of decent against all societal norms.అలాంటప్పుడు తను వాటన్నిటికీ అతీతం కాకుండా ఎలా ఉంటుంది? నాకైతే రాజేశ్వరిది తప్పా ఒప్పా అనేది అసలు చర్చా విషయమే కాదు.
రాజేశ్వరి ప్రేమించినంతగా అమీర్ తిరిగి రాజేశ్వరిని ఎందుకు ప్రేమించాలి? రాజేశ్వరి unconditional ప్రేమని అమీరుకిచ్చింది. మరి...అంతే ప్రేమని ఆశిస్తే అది "అలవికాని ప్రేమ" ఎలా అవుతుంది?
అమీర్, మీరాల పాత్రల కంటే రాజేశ్వరి పాత్ర పై ఎక్కువ విమర్శ ఎందుకు వచ్చింది అని మీ ప్రశ్న. చలం అమీర్ ని గొప్ప ప్రేమికుడిలా చూపించలేదు. అమీర్, మీరాల కంటే రాజేశ్వరిలో ప్రేమ, నిజాయితీ ఎక్కువ ఉన్నట్టు చూపించాడు.
hot discussion...
I also bought chalam books sthree, maidaanam, vishaadam, some more 5 books now reading all those...
I will join u people after 5 more days...keep continue it...
నేను మహేష్ తో అన్నిటి లోను 100% ఏకీభవిస్తున్నా.. నేను అలానే అనుకుంటా చలం గురించి.. ఇది అంతా కొందరికి సమజం దాని evolution లోని భాగం లోని జరగవలసిన మార్పులు జరిగిన మార్పులు లేక జరగబోతున్న మార్పు లు గా కొందరికి కనిపిస్తే, పని లేని తల తిక్క తనం గా కొందరికి అనిపిన్చవచ్చు. మూలాలను ప్రశ్నిస్తే అందరు ఒప్పుకోరు కదా.. అసలు మైదానాన్ని అర్ధం చేసుకోవటమేమి లేదు మెదడు తో అనుభవిన్చండి. అంతే..
చలం గారు వ్రాసిన పుస్తకాలు చాలా ఉండగా ఒక్క మైదానం గురించి చర్చించి చలం గారిని అంచనా వెయ్యడం ఎందుకు? మైదానం గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీరా రాజేశ్వరిని దీదీ అని పిలవడం ఏమిటి? అని. మీరా రాజేశ్వరిని దీదీ అని పిలిచిన మాట నిజమే కానీ రాజేశ్వరి మీరాకి నిజంగా అక్క కాదు కనుక రాజేశ్వరి మీరాని పొందడం తప్పు కాదు. నిజమైన బయలాజికల్ రిలేషన్స్ ని గౌరవిస్తే చాలు. కేవలం వరస పిలుపులని నిజమైన బంధుత్వాలు అనుకోవలసిన పని లేదు. ఈ విషయం కూడా అర్థం కాని వాళ్ళకి మొత్తం మైదానం ఎలా అర్థమవుతుంది? రాజేశ్వరికి మాతృ ప్రేమ కావాలి, ప్రియుని ప్రేమ కూడా కావాలి. ఎటువంటి బంధుత్వం లేని మీరాని తమ్ముడి గానో, కొడుకు గానో భావించడం వల్ల ప్రయోజనం ఉండదు అనుకుని అతన్ని శారీరకంగా అనుభవించింది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది?
Post a Comment