నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label కథల సంపుటి. Show all posts
Showing posts with label కథల సంపుటి. Show all posts

Thursday, November 25, 2021

రాసే వరకు మనశ్శాంతి లేదు.. రాసినా మనశ్శాంతి రాదు

 'అయిదో గోడ' పుస్తకం గురించి ఆంద్రజ్యోతి వివిధ లో ' పలకరింపు' శీర్షికన కథారచయిత్రి, కొత్తావకాయ బ్లాగర్ పేరుతో ప్రసిద్ధులైన సుస్మిత గారు అడిగిన ప్రశ్నలకు  నా సమాధానాలు 


ఫేస్బుక్ అక్షరం పేజీ లో 


కొత్తావకాయ గారి ఫేస్బుక్ పేజీ లో 



Wednesday, October 27, 2021

అయిదో గోడ ఓ ఘనీభవ పర్వతం - కాత్యాయనీ విద్మహే

 


సాంస్కృతిక భావజాల సంబంధమైన అయిదో గోడను బద్దలు కొట్టటం కష్టం. ఎందుకంటే అది అనేక వేల సంవత్సరాల కాలం మీద నిర్మించబడుతూ , ప్రచారం చేయబడుతూ ఎప్పటికప్పుడు  రకరకాల పద్ధతులలో సామాజిక సమ్మతిని కూడగట్టుకొని ఘనీభవించిన పర్వతం. ఆ పర్వతాన్ని బద్దలుకొట్టే ప్రయత్నంలో భాగంగా వచ్చినవే కల్పన కథలు. వాటికి ప్రతినిధి కథ అయిదో గోడ. కల్పన కథల తలుపులు తెరిచే  తాళం చెవి ఈ కథ.  

పుట్టుకతో వచ్చే లింగభేదం వల్ల శరీరం ఆడదీ కావచ్చు మగదీ కావచ్చు. కానీ ఆ శరీరాన్ని నిర్వచించి , నియంత్రించే భావజాలం మాత్రం సామాజిక నిర్మితం. లింగ వివక్ష ఉన్న సమాజాలలో  అది సహజంగా పురుష సాపేక్షతలో రూపం తీసుకొంటూ ఉంటుంది. ఫలితం  శరీరం ఒక వాస్తవం కాగా దాని చుట్టూ అల్లబడిన మాయావరణం లో బందీలుగా స్త్రీలు హింసకు గురి అవుతుంటారు. దాని  గురించిన ఎరుకగా,  అభివ్యక్తీ కరణగా స్త్రీవాద సాహిత్యం కొత్త వస్తువుతో మొదలైంది. శరీరం , బహిష్టు రక్తస్రావంసంభోగ సంతోష విషాదాలుగర్భంఅబార్షన్   అన్నీ కవితా వస్తువులయ్యాయి.  అవే కల్పనకు  కథా వస్తువులైనా వాటిని ఆమె నిర్వహించిన తీరు విలక్షణం.

 

కాత్యాయనీ విద్మహే 

ప్రముఖ స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు


 

 

 

 

 

 

 






Friday, October 22, 2021

నీలాంబరి- చల్లని రాగం- చక్కని కథలు



Tuesday, October 19, 2021

వైవిధ్యమైన కల్పన కథలు - నిడదవోలు మాలతి

 



    కల్పనా రెంటాలకి నాపరిచయం అఖ్ఱర్లేదు. నాలుగు దశాబ్దాలుగా కవితలు, కథలు, నవల, విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్న రచయిత్రి. పాత్రికేయురాలు. ఈకథలన్నీ విశేషాదరణ పొందినకథలు. ఇతివృత్తాలలో వైవిధ్యం ఉంది. సంఘర్షణ ఉంది. వివాదాస్పదమైన అంశాలు, స్త్రీలసమస్యలు, అమెరికా జీవనసరళి  - ఏ అంశం తీసుకున్నా అనేకకోణాలు పరిశీలించి అవిష్కరించినట్టు కనిపిస్తుంది.

    అసలు అపరక్రియలే తగ్గిపోతున్న ఈరోజులలో అందులో ఒకభాగమైన సంచయనంగురించి ఇంత వివరంగా ఆవిష్కరించినకథ ఇదొక్కటేనేమో. అమ్మకో ఉత్తరం. తల్లి అమెరికా రావడానికి ఏర్పాట్లు చేస్తానంటూనే అమెరికాసౌకర్యాలు వర్ణించడంలో రచయిత్రి ప్రతిభ కనిపిస్తుంది. ఇందులో చక్కని వ్యంగ్యం ఉంది. ఏకథ తీసుకున్నా కథాంశాలలో ఆమె తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది.


     
తెలుగుభాషమీద మంచిపట్టు గల కల్పన తెలుగుసంస్కృతికి సంబంధించిన ఇతివృత్తాలతో జానుతెలుగులో ఇంకా ఇంకా మంచికథలు రాయగలరనీ ఆశిస్తూ, శుభాకాంక్షలతో

                                                                                    - నిడదవోలు మాలతి

ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు 


 
Real Time Web Analytics