నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, August 17, 2012స్వరం మార్చిన ఒక మాట

 
నీతో మాట్లాడలేక....
పెదవి ఒంపుల నుంచి
ఓ వెల్లువై రాబోతున్న
మాటల జల్లు
ఓ వలయం లా వెనక్కు తిరిగి
గుండెలోతుల్లో జారిపోయింది.

ఎవరెవరి కళ్ల మీదుగానో
జారిపోతున్న నిన్ను చూడలేక .....
కనుపాపల చీకటి కొసల నుంచి
జాలువారే ఓ నీటి చుక్క
కళ్లెదుట కాలిపోతున్న కలల్ని చూసి
అలలు లేని సముద్రమై
లోపల్లోపల ఎండిపోయింది.

మాటలు లేని పగళ్ళు,
నిద్ర లేని రాత్రుళ్లు
స్పర్శ  లేని సహజీవనాలు
ప్రేమ లేని అనుబంధాలు
శాంతినివ్వని యుద్ధాలు

ఈ జీవితం ఓ అసంపూర్తి మరణం !
అందుకోసమే ఎదురుచూపులు!!

ఆగస్ట్ 17, 2012   
కల్పనారెంటాల

 
Real Time Web Analytics