నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, June 11, 2010

ఈ దుర్యోధన, దుశ్శాసన దుర్వీనీత లోకం లో.....


రకరకాల హడావిడులతో దాదాపు నెలన్నర రోజులుగా పేపర్లు, బ్లాగ్ లు ( దాదాపుగా) అన్నింటికి కొంత దూరంగా వుండి హఠాత్తుగా ఇవాళ బుద్ధి పొరపాటై పేపర్లు ఓపెన్ చేసి చూస్తే ఏముంది?

ప్రపంచం మారుతోంది, మారుతోంది అభివృద్ధి దిశగా సాగుతోంది లాంటి వూకదంపుడు ఉపన్యాసాలు విని విని తుప్పెక్కిపోయిన చెవులు, కళ్ళు ఒక్కసారి ఇలాటి సందర్భాల్లో తెరుచుకొని తీవ్ర ఆవేశాన్ని, కోపాన్ని తెచ్చిపెడతాయి. పేదవాడి కోపం లాగా మనంలాంటి మామూలు వాళ్ళ కోపాలు మనకే చేటు అనుకోండి.

నాకు కోపం, అసహ్యం లాంటి అనేకానేక ఫీలింగ్స్ తెచ్చిపెట్టిన రెండు వార్తలు ఇవీ...

పోలీసులు, రాజకీయ నాయకులు ఇద్దరినీ కలిపో, విడివిడిగానో తిట్టడానికి , మామూలుగా కాదు, బాగా తిట్టడానికి నాకు కొన్ని కొత్త తిట్లు, కొత్త బూతుభాష కావాలనిపించింది. మగవాళ్లను తిట్టడానికి కూడా పరోక్షంగా ఆడవాళ్ళనే టార్గెట్ చేసి తిట్టే బాస్టర్డ్స్, లంజముండ లాంటి తిట్లు కాకుండా ఎవరైనా కొత్త తిట్లను,బూతుల్ని కనిపెడితే బావుండు. వొట్టి పనికిమాలిన వెధవలు లాంటివి, జంధ్యాల లాంటి హాస్యపూరిత తిట్లు వీళ్లకు పనికిరావు. ఇంకొంచెం స్ట్రాంగ్ గా కావాలి. ఎవరికైనా తడితే చెప్పండి.

మొదటి వార్తా కథనం : డేట్ లైన్ : భారతదేశం ( సోర్స్ : ఆంధ్ర జ్యోతి)

పోలీసు వ్యవస్థ మన దేశం లో ఇంకా ఇలాగే ప్రవర్తిస్తోందని వార్తాకథనాలు చదివినప్పుడల్లా రక్తం కుతకుత ఉడికిపోతుంటుంది. ఇలాంటప్పుడు మాత్రం ఇలాంటి వెధవల్ని ముందు ఎవరైనా కాల్చి పడేస్తే బావుండు అని హింసను ప్రోత్సహించాలనిపిస్తుంది, తప్పని తెలిసినా.....

కొడుకు ముందే తల్లి బట్టలూడదీయించి..
ఢిల్లీ ఠాణాలో దారుణం


న్యూఢిల్లీ: పోలీసు కర్కశత్వానికి ఇది పరాకాష్ఠ... 12 ఏళ్ల కొడుకు ముందే ఓ తల్లిని బట్టలు విప్పాలని ఆ బాలుడితోనే శృంగారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. పశ్చిమ ఢిల్లీ పోలీస్ పోస్టు వద్ద పోలీసు అధికారులు తనను బట్టలు విప్పాలని బలవంతం చేశారంటూ మాయాపురి బస్తీ నివాసి మయూరి (పేరు మార్చాం) ఆరోపించింది.

దొంగతనం కేసులో పట్టుబడిన తన కుమారులు ఇద్దరిని విడిపించుకునేందుకు ఆమె తన భర్తతో కలిసి పోలీసుల వద్దకు వెళ్లింది. 'మా ఇద్దరినీ ఒక గదిలోకి తీసుకెళ్లారు. ఆతర్వాత ఓ కానిస్టేబుల్ వచ్చి నా భర్తను, చిన్న కుమారుడిని బయటికి పంపి, తర్వాత నన్ను, నా కుమారుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు' అని ఆమె వివరించింది. అయితే, వారు నేరారోపణను అంగీకరించలేదు.

'ఓ కానిస్టేబుల్ నన్ను బట్టలూడదీయాలని ఆదేశించాడు. అందుకు నిరాకరిం చడంతో నన్ను కొట్టి బలవంతంగా బట్టలు విప్పించారు. మరో పోలీస్ నా కొడుకుతో శృంగారం చేయమన్నాడు. నేను వద్దని వేడుకోవడంతో తనతో శృంగారంలో పాల్గొనమన్నాడు. మేమిద్దం ఏడుస్తూ బతిమలాడాం' అని చెప్పింది. దీనిపై పోలీసు కమిషనర్‌కు ఆమె ఫిర్యాదు చేయడంతో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.
రెండో వార్తా కథనం: డేట్ లైన్ : వాషింగ్టన్

నిక్కీ హేలీ పై సరికొత్త దుమారం!

http://www.time.com/time/politics/article/0,8599,1995597,00.html?xid=rss-topstories

సౌత్ కెరొలినా గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా నిక్కీ హేలీ చరిత్ర తొలి భారతీయ సంతతి మహిళగా చరిత్ర సృష్టించబోతొందని ఎదురుచూస్తుంటే ప్రత్యర్ధులు ఆమెపై వ్యక్తిగత అంశాలతో, ముఖ్యంగా శీలానికి సంబంధించి బురద జల్లే ఆరోపణలు చేయడం చూస్తుంటే రాజకీయాలు అంటేనే బురద బురద అని మరోసారి అర్ధమవుతోంది. రాజకీయాల్లో స్త్రీలు, పురుషులు అని తేడా ఏమీ లేదు.ఎవరిమీదైనా సరే, ప్రత్యర్ధులకు ముందు దొరికే అంశం శీలం. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఆడవాళ్ళని మానసికంగానైనా, శారీరకంగానైనా,ఇంకేరకంగానైనా ఎదురుదెబ్బ తీయాలనుకుంటే ముందు జల్లే బురద వారి వ్యక్తిత్వం పై, వారి శీలం పై.
నిక్కీ హేలీ కి ఇద్దరు భర్తలని మొదట్లో ఒక దుమారం లేవదీశారు. ఇప్పుడేమో ఆమె సన్నిహిత స్నేహితుడు బయటకు వచ్చి మేమిద్దరూ ఒక రాత్రి హోటల్ లో గడిపాం అని స్టేట్ మెంట్ ఇచ్చాడట...సో, వ్హాట్! అనాలనిపిస్తుంది నాకైతే...కాకపోతే ఎవరూ నా అభిప్రాయం అడగలేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నానన్నమాట....

11 వ్యాఖ్యలు:

శరత్ కాలమ్ said...

మీ నిస్పృహలో నేనూ పాలుపంచుకుంటున్నాను.

Kathi Mahesh Kumar said...

What are you expecting really?

దేశాలకూ,సంస్కృతులకూ తేడా లేకుండా ఉండే ప్రముఖమైన అణచివేత మోడల్ పురుషస్వామ్యం.దాన్ని హింసాత్మకంగా మగాళ్ళు వాడితే, సౌమ్యంగా మహిళలు perpetuate చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడో లేదా విమర్శలు వచ్చినప్పుడో మాట్లాడుకోవడం తప్పించి, everybody want to adhere to these "rules" because its convenient that way.

ఘటనను నేనూ ఖండిస్తున్నాను. లింగబేధంలో సమూలమైన మార్పులురానిదే ఇలాంటివి మళ్ళీమళ్ళీమళ్ళీ జరుగుతాయని విచారిస్తున్నాను.

Anonymous said...

Mr.Katti
your condemnation is ok. What I am not able to appreciate is , your blog has been labelled as Adult/restricted content,why? You managed some kinda reservation here too? :P

Kathi Mahesh Kumar said...

@అనామకుడు:Yes. My blog is for mature adults. నెలతక్కువ amateurish వెధవలకి కాదు.

ఆ.సౌమ్య said...

ఇలాంటివేమీ కొత్తకాదండీ. రంగనాయకమ్మగారూ ఐదుగురిని పెళ్ళి చేసుకున్నారని ఆమెను, ఆమె రచనలను వ్యతిరేకించినవాళ్ళని చూసాను. వారే కొ.కు ని వేనోళ్ళ పొగడడమూ చూసాను. మరి కొ.కు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ళకి OK అన్నమాట.

అలాగే S.P. శైలజ భర్తని వదిలేసింది (నిజానిజాలు దేవుడికెరుక) కాబట్టి ఆవిడ టి.వి లో వచ్చే సంగీత కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా పనికిరాదని వాదించినవాళ్లని చూసాను.

మా యూనివర్శిటీలో ఎలక్షన్లు, పోస్టులు పురుషులసొత్తు. పొరపాటున ఎవరైనా అమ్మాయి ధైర్యం చేసి ఎలక్షన్లలో నిలుచుందో ఆ రాత్రికి రాతే ఆమె సత్ప్రవర్తన లేనిదని, ఎంతోమందితో పడుకుందని బురదజల్లుతూ పాంప్లేట్లు పంచిపెట్టడమూ చూసాను.

Anonymous said...

"రంగనాయకమ్మగారూ ఐదుగురిని పెళ్ళి చేసుకున్నారని"!!
ఏమిటీ పుకారు? ఏమిటీ పైత్యం? ఐదుగురేనా? పిచ్చా, వెర్రా?

Anonymous said...

సౌమ్య గారూ,

కొ. కు. కి చిన్న వయసులోనే మొదటి భార్య చనిపోయారు. కొన్నాళ్ళకి ఆయన రెండో పెళ్ళి చేసు కున్నారు. కొంత కాలానికి రెండో భార్య కూడా చనిపోయారు. ఇదంతా ఆయన చిన్న వయసులోనే జరిగింది. అప్పుడు ఇంకొంత కాలానికి ఆయన మూడో పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ తోనే జీవితమంతా గడిపారు. అవిడ ఇప్పటికీ వున్నారు. ఇదీ నేను తెలుసుకున్న విషయం. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. విషయాలు తెలియజేయడం కోసమ్ రాస్తున్నాను.

మీరు, "రంగనాయకమ్మగారూ ఐదుగురిని పెళ్ళి చేసుకున్నారని ఆమెను, ఆమె రచనలను వ్యతిరేకించినవాళ్ళని చూసాను" అని రాశారు. మీ ఉద్దేశ్యం అర్థం కాలేదు. రంగనాయకమ్మ గారు ఐదుగురిని పెళ్ళి చేసుకున్నారని మీరు కూడా నమ్ముతున్నాట్టా ఈ మాటల అర్థం. కొంచెం వివరించండి. ఎందుకంటే అలాంటి అర్థం వచ్చే అవకాశం వుంది మీ మాటల్లో. రంగనాయకమ్మ గారు మొదటి భర్తని వదిలేసిన కొంత కాలం నించీ బాపూజీ గారితో సహచర్యంలో వున్నారు. ఈ విషయాలన్నీ "గమనం" అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా వివరంగా వున్నాయి. ఈ "ఐదుగురు" అనే మాట ఎక్కణ్ణించీ వస్తోందీ? చాలా అభ్యంతరకరంగా వుంది ఈ పదం.

- ప్రసాద్

ఆ.సౌమ్య said...

@ ప్రసాద్
అయ్యో నా ఉద్దేశ్యం రంగనయకమ్మగారు ఐదుగురిని పెళ్ళి చేసుకున్నరని కాదండీ. అలాంటి చెత్త పుకార్లు పట్టుకుని ఆమె రచనలని తిరస్కరించారు అని. రంగనాయకమ్మగారికి నేను అభిమానిని. ఆవిడ గురించి కారుకూతలెలా కూస్తానండీ? ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది ఆడ,మగ మధ్య విభేదాలు. ఒకవేళ ఆవిడ అలా చేసుకున్న కూడా ఆవిడ రచనలని తిరస్కరించాల్సిన అవసరమేమిటీ? ఆవిడ పెళ్ళిళ్ళు, వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఆమె రచనలని జడ్జి చేస్తామా? అదే పని ఒక మగవాడు చేస్తే ఆ విధంగా చూడమా అన్నదే పాయింటు. గ్రహించగలరు.

రంగనయకమ్మగారు బాపూజీ గారితో సాహచర్యంలో ఉన్నారన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. అసలు ఐదుగురి పెళ్ళి చేసుకోవడం అన్న పుకారు ఎవరు పుట్టించారోకానీ నేను చాలా చోట్ల చాలా మంది నోట విన్నను. విన్నప్పుడలా నిజాలు నిర్ధారిస్తూనే ఉన్నాను. అలా అన్నవాళ్ళతో "అలా కాదు, లేదు" అని వాదిస్తూనే ఉన్నాను.

సుజాత వేల్పూరి said...

సౌమ్యా,
ప్రజా జీవితంతో సంబంధం ఉన్న వాళ్లను ముఖ్యంగా స్త్రీలను ఇటువంటి పుకార్లతో ముడిపెట్టడం ఎప్పుడూ ఉన్నదే! స్త్రీని కూలదొయ్యాలంటే శీలం మీద నింద వేయడం ఒక తిరుగు లేని ఆయుధం!

రంగనాయకమ్మ గారు "స్త్రీ స్వేచ్ఛ" సంకలనంలో 'స్త్రీలను అవమానించే మాటలు వాడటం ప్రజా పంథాయా?"అని ఒక వ్యాసం రాశారు.వీలైతే చదవండి.

తెలుగు వెబ్ మీడియా said...

రంగనాయకమ్మ గారు అయిదు పెళ్ళిళ్ళు చేసుకున్నారని ఎవరూ అనలేదు. ఆమె తన మొదటి భర్తని వదిలేది తన కంటే 9 ఏళ్ళు చిన్నవాడైన బి.ఆర్.బాపూజీ అనే వ్యక్తితో కలిసి ఉండడం వల్ల జన సాహితీ అనే సహిత్య సంస్థ సభ్యులు ఆమె గురించి చెత్తగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ సంస్థ సభ్యుల వ్యవహారం బయటపడిన తరువాత వాళ్ళు రంగనాయకమ్మ గారు మరియు బాపూజీ ఇన్ఫార్మర్లని, తమ సంస్థని ప్రభుత్వానికి పట్టివ్వడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించి వీరిని సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇన్ని రోజులు నేను ఊర్లో లేకపోవడం వల్ల కల్పన గారి బ్లాగ్ చదవలేదు. రంగనాయకమ్మ గారి గురించి నిజనిజాలు తెలియకుండా వ్రాయడం బాగాలేదు. జన సహితీ సంస్థ సభ్యులు తన గురించి, బాపూజీ గురించి ఎంత చెత్తగా ప్రచారం చేశారో రంగనాయకమ్మ గారు "జన సాహితితో మా విభేధాలు" అనే పుస్తకంలో వ్రాసారు. ఆమె అయిదు పెళ్ళిళ్ళు చేసుకున్నారని మాత్రం ఎవరూ అనలేదు.

ఆ.సౌమ్య said...

@ సుజాత గారూ
అవునండీ, శీలం ఒక్కటే కాదా వాళ్ళు వాడగలిగించినూ, వాడేదీనూ.
ఓహ్ "స్త్రీ స్వేచ్చ" సంకలనం చూసాను గాని చదవలేదు. తప్పకుండా చదువుతానండీ. Thanks !

 
Real Time Web Analytics