నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, July 28, 2010

ఈ ఇల్లొక నిశ్శబ్ద నది!

దీవారోం సే మిల్ కర్ రోనా...ఇప్పుడు మా ఇల్లొక నిశ్శబ్ద నది లా వుంది. అఫ్సర్ మాడిసన్ లో వున్నాడు. మా అనిందు ఫ్రెండ్స్ తో కలిసి కాలిఫోర్నియా వెళ్ళాడు. ఆహా, ఇంట్లో ఎవరూ వుండరు. నేనొక్కదాన్నే. హాయి గా పుస్తకాలు చదువు కోవచ్చు. రాసుకోవచ్చు. రోజూ వంట చేయాల్సిన పని లేదు. ఏదో ఒకటి చేసుకొని తినేయచ్చు. మరీ ముఖ్యం గా నా నవల పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఈ విలువైన ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో రెండు, మూడు నెలలుగా కలలు కన్నాను.


తీరా ఆ సమయం వచ్చేసరికి... నన్ను వదిలి మా బాబు దూరం గా ఒక పదిరోజులు వెళ్ళే సమయం వచ్చేసరికి...దృశ్యం మొత్తం మారిపోయింది. వాడు అలా నా బుగ్గ మీద ముద్దు పెట్టి నన్ను గట్టి గా పట్టుకొని బై చెప్పి వెళుతుంటే నాకు ఏడుపు ఆగలేదు. కారు కదిలి వెళ్లిపోయాక ఇంట్లో కి వస్తే అది ఇల్లు లా కాక ఒక దిగులు గూడు లా అనిపించింది. రేపు వాడు పెద్దఅయి కాలేజీకని దూరంగా వెళ్లిపోతే అమ్మో, అప్పుడు ఇలా వుంటుందా అని అనుభవం లోకి వచ్చి కన్నీళ్ళు ఆగలేదు.


నాలుగు రోజులు గా ఇల్లు మొత్తం ఒక భయకర నిశ్శబ్దమైంది.కీ బోర్డ్ శబ్దాలు, పుస్తకం లో పేజీలు తిప్పే చిన్న శబ్దాలు, అప్పుడప్పుడూ మోగే టెలిఫోన్ రింగ్ లు.. వింటున్న కొద్దీ మనసు ని మెలిపెట్టే కొన్ని పాటలు...
నా ఒంటరితనాన్ని గుర్తించి మేమున్నాము కదా అని పలకరించబోయి ఆగిపోతున్న కల్హార, కౌశిక్ లు..

దీవారోం సే మిల్ కర్ రోనా...

గోడలతో కలిసి దుఃఖించటమంటే ఏమిటో కొంచెం తెలిసినట్లనిపించింది.

11 వ్యాఖ్యలు:

భాను said...

మద్యలో పలకరించే మేమున్నాం కదండీ కల్పనాజీ,

Kalpana Rentala said...

అవునండీ, మీరంతా వున్నారు. థాంక్ యు.

Sharath Sahithi said...

కల్పనా గారు, నేను ఇంటర్ లో ఉన్నప్పుడు మా అమ్మకి నా స్నేహితులు గాని నా లైఫ్ స్టైల్ గాని అస్సలు నచ్చేవి కాదు. నేను చెడిపోతున్నానేమో అని ఒకటే బెంగ పెట్టుకునేది. దాంతో మేమిద్దరం బద్ద శత్రువులమయిపొయాం. ఆ తర్వాత ఇంజనీరింగ్ కి వేరె ఊరికి వెళ్ళిపొయాక ఇద్దరికీ తెలిసొచ్చి తెగ మిస్స్ అయ్యేవాళ్ళం. మీ టపా చూసాక మళ్ళీ అదే గుర్తొచ్చింది. మీ పిల్లల వయసెంతో తెలీదు కాని, బవిష్యత్తులో "Empty Nest Syndrome" మీరు బారిన పడకుండా ఉండటానికి ఇదొక అవకాశంగా తీస్కొండి.

Kalpana Rentala said...

శరత్ మీరన్నది నిజమే. మా బాబు ఇంకా చిన్నపిల్లాదే ( నా కళ్లకే కాదు...వయస్సు కూడా) ఆరో క్లాస్. అందుకే నేను మిస్ అవుతాను అనిపించినా పోనీలీ వాడి ఆనందాన్ని ఎందుకు పోగొట్టడం అని పంపాను. ఆ సిండ్రోమ్ అనివార్యమేమో....

మధురవాణి said...

ఏం చెప్పాలో తెలీట్లేదు :( :( కానీ, బెంగ పెట్టుకోకండి. ఎంతలో వచ్చేస్తారు :)

శరత్ 'కాలమ్' said...

నా పరిస్థితి కూడా మీలాగే వుంది. మా వాళ్లంతా ఇండియా వెళ్ళారు. ఇంకో నెలకి గానీ రారు.

ఆ.సౌమ్య said...

ఏం బాధపడకండి మేమున్నాగా. ఈ ఖాళీ రోజుల్లో మీ కవితాగానం చేసెయ్యండి పూర్తిగా. కాలక్షేపంగానూ ఉంటుంది , టైం కూడా తెలీదు ఒకసారి మొదలెడితే. మీ అనిందు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నడని తలుచుకుంటే మీకూ మనసుకి హాయిగా ఉంటుంది.

Anonymous said...

enti kalpana, memantha vunnamu kada..

ilaa bore koduthundi ani post chesthe alaa replies icchi meeku bore kotte time lekunda cheyyadaaniki....

Indira.

సావిరహే said...

జీవితం లో ఏదో ఒకరోజు అలంటి ఒంటితనం ఎవరికైనా వస్తుంది అండి ,నిజం చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు అల ఒంటరి గ వున్నవాళ్ళు ఎంతో మంది ,వాళ్ళ కంటే మీరే నయం కదా
ఇది కేవలం ఒక చిన్న వియోగం మాత్రమె ,దాని లోనే మనకు మన వాళ్ళ విలువ తెలిసోచ్చేది.మీ టైం ని చక్కగా ఉపయోగించుకోండి , చేయాల్సినవి ఇప్పుడే ప్రణాళిక పూర్తిచేయండి మీరనుకున్నట్టుగ
అల్ ది బెస్ట్

జ్యోతి said...

కల్పన,,
ఇంట్లో మాత్రమే మీరు ఒంటరిగా ఉన్నారు కాని ఇక్కడ మీ చుట్టూ, మీ మేలు కోరే మిత్రులు ఎందమంది ఉన్నారు?? ఒక్కసారి అందరిని తలుచుకోండి. రోజులు ఇట్టే గడిచిపోతాయి..

Kalpana Rentala said...

@మధురవాణి,జ్యోతి,ఇందిర, సౌమ్య, సావిరహే.
నాలుగు మంచి మాటలు చెప్పి, మీరంతా నాకు తోడుగా వున్నారని చెప్పి నా దిగులు ని ఎగరగొట్టేశారు.

ఇంత మంది స్నేహితులను వుంచుకొని కూడా బాధపడితే బావుండదు కదా...నా ఒరిజినల్ గెటప్ లోకి అంటే నవ్వుల నావ లోకి వచ్చేస్తా...

కామెంట్ పెట్టిన వారందిరికీ పేరు పేరున మరో సారి ధన్యవాదాలు.

 
Real Time Web Analytics