నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, July 16, 2012

గౌహతీ దుశ్చర్య సాక్షిగా ......మేరా భారత్ మహాన్!“భారత దేశం నా మాతృదేశం. భారతీయులందరూ నా సహోదరులు. “ 

చిన్నప్పుడు స్కూల్లో చదివిన ప్రతిజ్న ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే వుంది. 

అనుక్షణం నా దేశం గొప్పతనం , నా “ సహోదరులకు”  స్త్రీజాతి పట్ల వున్న ఆదరాభిమానాలు , స్త్రీ ని దేవత గా కొలిచే నా దేశ సంస్కృతి గురించి  ప్రతి రోజూ ఎవరో ఒకరు నాకు  ఉద్బోధ చేస్తూనే  ఉన్నారు.  

గత వారం గౌహతి లో జరిగిన సంఘటన ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అది తెలిసాక ఎంత మంది తల్లితండ్రులు తమ ఆడపిల్లలను సాయంత్రాలు బయటకు వెళ్లద్దని మరింత కట్టడి చేస్తున్నారో నాకు తెలియదు. 

గౌహతి లో ఓ పదిహేదేళ్ళ అమ్మాయి తన స్నేహితులలతో కలిసి రెస్టారెంట్  కమ్ పబ్ లోకి వెళ్ళి గడిపి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి తో పాటు ఆమె స్నేహితులు కూడా వున్నారు. ఓ అమ్మాయి అర్థరాత్రి అబ్బాయిలతో కలిసి పబ్ నుంచి బయటకు రావడాన్ని అక్కడున్న ఓ ఓ గుంపు చూసి  తట్టుకోలేకపోయింది. దేశ ఔన్నత్యం దిగజారుతోందని  ఆ మూక కు ఆవేశమొచ్చింది. ఆ అమ్మాయి పొట్టి స్కర్ట్ వేసుకుందని, అర్థ రాత్రి తాగి తందనాలాడుతోంది కాబట్టి ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నారు. అందరూ కలిసి ఆమె చుట్టూ ఓ గుంపు లా , ఓ వలయం లా ఏర్పడి ఆమె ను కొట్టి ఆ తర్వాత ఆమె వొంటి మీద వున్న ఆ కొద్ది పాటి దుస్తులను కూడా తీసేసి ఆనందించారు. ఆమె ను ఎక్కడెక్కడో తాకి ఆనందించారు. ఆమె ను నడి రోడ్డు మీద లాక్కెళ్లారు. ఈ పనులన్నీ చేసింది ఓ 20 మంది తో కూడిన గుంపు. కానీ దీన్ని చూసిన ఆనందించినవారు వంద సంఖ్య లో వున్నారు. ఎక్కడ అరక్షణం కళ్ళు తిప్పితే ఎంత మంచి సీన్ మిస్ అవుతామో అన్నట్లు కళ్లార్పకుండా చూశారు. రద్దీ గా ఉండే రోడ్డు మీద ఈ దుర్ఘటన చూస్తూ కూడా ఎవరూ ఆగి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.  సహాయం చేయమని ఆ అమ్మాయి రోడ్డు మీద పరుగెత్తినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ సమయం లో అటు వైపు వస్తున్న మరో జర్నలిస్ట్ కారు ఆపి పోలీసులకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ని అల్లరి మూకల నుంచి కాపాడే ప్రయత్నం చేశాడు. 

అల్లరి మూకల  గుంపు లో ఒక  జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ “ ని అతనితో సహా అనేక మంది   కెమెరాలతో చిత్రీకరించారు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు. న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేశారు. ఒక జర్నలిస్ట్ ఆ అమ్మాయి మీద దాడి ని ప్రోత్సహిస్తే మరో జర్నలిస్ట్  వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ దురాగతానికి అడ్డుకట్ట వేసి ఆ అమ్మాయి ని కాపాడారు. 

ఈ మొత్తం సంఘటన ను ప్రత్యక్ష్యంగా చూసి, వీడియో తీసి, తన వంతు భాగస్వామ్యం వహించిన  జర్నలిస్ట్ తన చానెల్ లో Drunk girl in the city” అనే శీర్షికతో న్యూస్ ప్రసారం చేశాడు. అది చూసి మిగతా పత్రికలు, ఛానెల్స్ కూడా ఆ తరహా వార్తలే వినిపించాయి. . ఒకటిన్నర రోజు తర్వాత  అసలు విషయం బయటకు వచ్చాక, యూ ట్యూబ్ లో వీడియో లు కూడా అందరూ చూసి ఆనందించాక అప్పుడు అందరూ రంగం లోకి దిగారు. అసలేం జరిగిందో బయటకు వచ్చింది. నిందితుల కోసం వెతుకులాట మొదలయింది. ధర్నాలు, రాస్తారోకోలు జరిగుతున్నాయి. మొదట ఈ వార్త ను ప్రసారం చేసిన న్యూస్ చానెల్ కొంత మాట మార్చింది. నేటి యువతరం ముఖ్యంగా అమ్మాయిలు ఎంత చెడిపోతున్నారో, అసభ్యకరమైన దుస్తులు వేసుకొని అర్థ రాత్రి వరకు పబ్ ల వెంట ఎలా తిరుగుతున్నారో  , అలా తిరిగితే ఏం జరుగుతుందో హెచ్చరికలు మొదలు పెట్టింది. ఒక న్యూస్ చానల్ ఎడిటర్ కామెంట్ ఏమిటంటే “Major chunk of girls visiting pubs/bars are prostitutes”.
ఈ వీడియో ని చూస్తే ఏం జరిగిందో ఎవరికైనా అర్థమవుతుంది.
ఆ అమ్మాయిని రక్షించిన జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ ని ఇక్కడ చదవండి.
http://news.biharprabha.com/2012/07/meet-the-man-who-saved-guwahati-girl-from-molestation/

ఆడపిల్లల స్కర్ట్ లు ఎంత పొడవు  ఉండాలో కాదు నిర్ణయించాల్సింది. కొందరు మగవాళ్ళు మృగాల్లా కాకుండా మామూలు మనుషుల్లా ప్రవర్తించేలా ఎవరైనా వారికి శిక్షణ ఇవ్వండి.
అది జరిగితే , నిస్సందేహంగా నా దేశం గొప్పదే!
16 వ్యాఖ్యలు:

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు said...

Leave about other things
I have very small question going and drinking in below 18 హర్షించ దాగిన విషయమా?

Kalpana Rentala said...

18 ఏళ్ళు కూడా నిండని యువతీ యువకులు ఎవరైనా తాగటం మంచిది కాదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

శరత్ 'కాలమ్' said...

మీతో ఏకీభవిస్తున్నాను.

Praveen Mandangi said...

ఫణీంద్ర గారు, మీ వాదన విచిత్రంగా ఉంది. ఒక మగవాడు తాగిన మత్తులో ఉండడాన్ని అవకాశంగా తీసుకుని ఒక హోమోసెక్సువల్ అతని బట్టలు విప్పి ఆనందించాడనుకోండి, అప్పుడు తాగినవాడిదే తప్పు అని ఆ హోమోసెక్సువల్‌ని జస్టిఫై చెయ్యగలమా? ఆడవాళ్ళ విషయంలోనే ఇలాంటి జస్టిఫికేషన్స్ ఎందుకు ఇస్తున్నట్టు?

lalithag said...

ఈ వార్తలో ఈ వివరాలు ఇప్పుడే తెలిశాయి. ఇంతవరకూ ఈ వార్తని నేను వేరేలా అర్థం చేసుకున్నాను. అవతలి గుంపు కూడా ఇంకేదో మత్తులో ఉండి చేసిన నిర్వాకం అనుకున్నాను. వీడియో చూడగలిగే ధైర్యం లేదు నాకు. కావాలని తీసినదే ఐనా, తెలియచెప్పడం కోసం తీసినది ఐనా. అమ్మాయి తాగడం తప్పా ఒప్పా అన్నదే ఇలాంటి విషయాలలో ముఖ్యాంశంగా ఆలోచించే వారికి, ఆ గుంపు తాగలేదని ఏ అనుమానం లేకుండా తెలుసా? ఐతే చెయ్యకూడని పనులు, చట్టబద్ధం కాని పనులు, అశ్లీలమైన పనులు చేసే వారికందరికీ ఇదే శిక్ష విధించడానికి ఆ గుంపు కంకణం కట్టుకుని పని చేస్తూ ఉండాలా ఇంతవరకూ? లేక ఆ గొప్ప ఆశయం వైపు ఇది మొదటి అడుగా? లేక ఆ అమ్మాయి సిగ్గుతో చచ్చిపోతుంది, ఎవరికీ చెప్పుకోలేదు కాబట్టి అక్కడ తమ ప్రతాపం చూపించారా? ఆ అమ్మాయి సంగతేమో కానీ చూసిన వారు ఆ గుంపుదే తప్పంటుంటే తప్పయ్యిందా? ఏమిటో ప్రశ్నలు. సమాధానాలు ఆశించడం లేదు. ఆలోచిస్తున్నానంతే.

Anonymous said...

*అది తెలిసాక ఎంత మంది తల్లితండ్రులు తమ ఆడపిల్లలను సాయంత్రాలు బయటకు వెళ్లద్దని మరింత కట్టడి చేస్తున్నారో నాకు తెలియదు.*
ఈ వాక్యం చదివి భారతదేశం మీ అమాయకత్వానికి నవ్వొచ్చింది. మీరేమనుకొంట్టున్నారు, మీకాలం నాటి ఇండియానా ఇప్పుడు ఉండేది? ఇటువంటి చిన్న చిన్న సంఘటనలకి ఆడపిల్లలను సాయంత్రాలు బయటకు వెళ్లద్దని తల్లితండ్రులు కట్టడి చేయటానికి. మాదేశం లో పిల్లలు అమ్మానాన్న మాటలు వినటం ఎప్పుడో పోయింది. అదేకాక భాతదేశంలో తల్లిదండృలకి పెద్ద పెద్ద కలలు ఉన్నాయి.ఇటువంటి చిన్న చిన్న సంఘటనలకి వారు అదరరు బెదరరు. మీడీయా యాగి చేసి రేటింగ్ పెంచుకొంట్టుందంతే! మీరేమి అమేరికాలో వుంట్టూ అనవసరంగా ఆందోళన పడకండి.

Anonymous said...

Giving details of the incident, DGP J N Choudhury told The Indian Express, “According to information available with me, this girl had gone to the bar to celebrate the birthday of another girl, and was accompanied by three young men. They had a couple of drinks each and were about to make payment when the birthday girl discovered she was not carrying her ATM card. This led to an argument among them following which the bar manager threw them out.”

“While the birthday girl and two of the men left the place, this girl got into a physical fight with the other man outside the bar, attracting the attention of some people hanging around the place. While one or two persons tried to separate them and break the quarrel, some ‘lumpen elements’ took advantage of the situation, with one of them even trying to pull down the undergarments of the girl who was wearing a skirt,” Choudhury said. “The assault continued from about 9.45 pm to 10.00 pm when the police arrived after an employee of a hotel nearby called up the nearest Bhangagarh police station.”

“An off-duty Deputy SP, who happened to pass by around that time, stopped and tried to intervene and save the girl, but being not in uniform, the miscreants did not pay any heed to him. The police finally rescued the girl,” he said.

Anonymous said...

1. I never saw Christian Basti area, but I think this place is not a holy peaceful place. So, how people (male & female whatever) go there too at night in a bar?
2. What are these boys & girls doing at that odd hours and odd place? Interestingly, it is not a restaurant, rather a bar. So, was it too necessary to celebrate a so called "birthday" there at night (not evening)?
3. Those girls and guys are so close and bosom that finally they involved into brawl and fight for liquor payment !!! Is it friendship? Huh !!!
4. When people see that some girls and guys are fighting and arguing with each other openly in front of a bar after drinks at around at night then naturally it makes suspicion about their identity. Interestingly, suppose if it reveals that those people are antisocials/drug dealers/terrorists then the same people who are showing sympathy for the girl or talking about morality will ask openly that where were the local people or why the local people were inactive, etc, etc.
5. Mahatma Gandhi once said "the day a woman can walk freely on the roads, that day we can say that India achieved independence." Very true, but did Gandhiji used to support liquor or did he support the fight done openly in front of a bar for a liquor payment?
6. Statically it is found that many crimes like drug deal/weapon deal/human trafficking are triggered from this kind of bars.
7. Why the girl and her family refused to meet a delegation of the Assam State Commission for Women when visited their home for an inquiry? Why they are silent?
8. Other females were also passing by the bar, but why those people targeted particularly this girl, may be the smell of liquor coming out from her mouth was a vital cause.
9. Who knows that those people molested the girl thought that finally the police wont do anything, may be those people are irritated or disturbed due to this bar culture, may be it is a result of mass-frustration due to poor unsecured administration.
10. But finally, this issue should be judged very carefully by the court because it is a matter of molestation. One more thing, I think, many people do not know the real fact ... they are just simply reading only the headlines, watching the video and commenting, so it is better let us know the real fact and then we should comment.

Anonymous said...

Local Guwahati television channels are now insinuating that the victim of the molestation isn’t a minor schoolgirl as she had claimed in the moments after her traumatic experience, but a married woman with a daughter.

Anonymous said...

The Managing Editor of Newslive, Syed Zarir Hussain Explains how they got informed about the Molestation that night and the whole story thereafter. For any clarification you can reach him at zarirhussain@yahoo.com.

My head hangs in shame as I try to piece together one of the ugliest stories in my more than two decades of journalistic career – the horrific story of a young girl being virtually ‘gang-raped’ (molestation would be an understatement) by a bunch of ‘beasts’ (they cannot be called human beings) on the streets of Assam’s main city of Guwahati.
July 9. Time around 9.30 p.m. Location – the busy Guwahati-Shillong Road (GS Road) near Christian Basti in downtown Guwahati. A phone call was received at our news desk from one of our off-duty reporters, Gaurav Jyoti Neog, asking for a camera unit, and in the same vein asking one of the copy-editors to inform the police, saying there was a brawl near the Income Tax Office.
Gaurav was shooting the incident with his cell phone while talking from another handset to the news desk (the reporter talking to the news desk asking for a camera unit was audible).
Night duty reporter Dibya Bordoloi and cameraperson Jugal rushed to the spot in less than 10 to 15 minutes, as the incident took place barely 200 metres away from the News Live studios.
Two young girls apparently had some altercation with some people inside the Club Mint Bar where they came to attend a birthday party. The scene shifted from the pub premises to the streets. It was at this point that Gaurav saw one of the girls slapping a man (filmed on his mobile handset) and soon a large crowd of people arrived and went berserk.

The girl who slapped somehow managed to escape, while the other girl was caught by the milling crowd and then began the horrific and shocking incident. By then cameraperson Jugal and night duty reporter Dibya Bordoloi also arrived.
The two reporters did try to rescue and pacify the mob of around 30-odd people (cameraperson Jugal’s tape has evidence of how our two reporters tried to save the girl, asking people not to beat her.). But our three News Live crew were outnumbered by the violent beastly mob.

Kalpana Rentala said...

నిజానికి అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో మనమేవ్వరూ చూడలేదు. మనకు మీడియా నే ఆధారం. అయితే ఒక్కో చానెల్ లో, ఒక్కో పేపర్ లో ఒక్కో రకంగా వచ్చింది. వస్తోంది. ఇంకా రకరకాల కొత్త కథనాలు కూడా వస్తున్నాయి. నేను ఒక మహిళా సంస్థ వాళ్ళు చెప్పిన విషయాన్ని తీసుకున్నాను. ఇవాళ వచ్చిన వార్తల ప్రకారం ఇదంతా ఒక టీవీ చానెల్ వాళ్ళు కావాలని క్రియేట్ చేశారని...అలాగే ఆ జర్నలిస్ట్ ఆ అమ్మాయి కి సహాయం చేయకుందా కేవలం తన కేమారా తో రికార్డ్ చేశాడని...జాతీయ మహిళా సంస్థ నివేదిక ప్రాకారం ఆ అమ్మాయి శరీరం మీద సిగేరేట్ తో కాల్చిన వాతలు కూడా వున్నాయత. ఆ అమ్మాయి ఇద్దరితో వచ్చిందా, ముగ్గురితో వచ్చిందా? లేక మరీ ఎక్కువ తాగి ఉందా? నిజంగానే పొట్టి స్కర్ట్ వేసుకుందా? ఇలాంటి విషయాలు ఒకటో , ఆరో తప్పో, వొప్పో కావచ్చు. కానీ అల్లరి మూకలు చేసిన పనులు మాత్రం వాస్తవం. రాత్రి 10 కూడా కాని సమయం లో బిజీ గా వున్న రోడ్డు మీద ఇలాంటివి జరిగితే ఎవరూ ఆపటానికి ప్రయత్నం చేయలేదు అన్నది స్పష్టం. ఆపె ప్రయత్నం చేసి ఒకరిద్దరు విఫలమైనట్లు కూడా వార్తా కథనాలు. మన చుట్టూ ఇలాంటి సంఘటనలు జరుగుతునంప్పుడు సినిమా ల్లో చూసినట్లు చూస్తూ నిలబడటమో, లేదా మనకెందుకులే లేనిపోని గొడవ అని వెళ్లిపోవటమో వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. సంఘటనను కేవలం ఒక వార్తా గా చూసి ఆ ఫుటేజీ ని ఎంత తొందరగా చూపిద్దామా? అని ఒక న్యూస్ చానెల్ ఆదుర్దాపడితే, మరో జర్నలిస్ట్ ఆ అమ్మాయి ని రక్షించాడు. ఇద్దరూ మీడియా వాళ్ళు. ఈ గొడవ లో మీడియా రకరకాల కథనాలు, వార్తలు ప్రసారం చేసింది అన్నది వాస్తవం. ఇవన్నీ ఇవాల్టి మీడియా పరిస్తితి ని స్పష్టం చేస్తున్నాయి.
ఆడవాళ్ళు అర్థరాత్రుళ్లు పబ్ లకు వెళ్ళి పార్టీలు చేసుకోవచ్చా? లేదా? స్త్రీల వస్త్రధారనే వారి మీద లైంగిక దాడులకు కారణమా? కాదా? వీటిని మాట్లాడే ముందు స్త్రీల మీద ( ఎలాంటి వస్త్రాలు వేసుకున్న సరే, ఏ సమయం లోనైనా సరే) దాడులు చేసే హక్కు లు ఎవరిచ్చారు? పైగా ఏ సమాజం ఇలాంటి వాటిని ఇంకా సమర్దిస్తోంది? అన్నది కూడా ఆలోచించాలి.
ఇక్కడ ఎవరో కామెంట్ పెట్టారు///ఆడపిల్లలను ఇవాళ తల్లితండ్రులు ఏ మాత్రంకట్టడి చేయడం లేదు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా సరే, కాబట్టి నన్ను నిశ్చింత గా ఉండమని...ఇలాంటి ఉచిత సలహాలకు ధన్యవాదాలు.

Kalpana Rentala said...

అన్నింటికంటే బాధాకరమైనదేమిటంటే...మహిళా కమీషన్ సభ్యురాలు బాధితురాలి పేరు ను ప్రకటించి ఆ అమ్మాయి ఎవరో మరింత అందరికి తెలిసేలా చేయటం...విచారించాల్సిన మరో విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధితురాలిని ఓదార్చి ఆర్థైక సహాయం అందచేస్తామని చెప్పటం...ఇలాంటి వాటికి ( రేప్ లాంటి వాటిల్లో కూడా) ఆర్థక సహాయం ఏ రకంగా ఉపయోపడుతుందో ...ఆ చట్టాలేమిటో ...? అత్యాచారం జరిగితే ఆర్థిక సహాయం, రేప్ జరిగితే నిందితుడు పెళ్లి చేసుకుంటే కేసు లేకుండా చేయటం..ఇలాంటి చట్టాలు చేసిన వాళ్ళకు నమోనమః

Anonymous said...

*ఆడపిల్లలను ఇవాళ తల్లితండ్రులు ఏ మాత్రంకట్టడి చేయడం లేదు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా సరే, ...ఇలాంటి ఉచిత సలహాలకు ధన్యవాదాలు.*
మీకు సలహాలు ఇచ్చేటంతటి వారు ఎవరు లేరు. నేను చెప్పింది ఇటువంటి సంఘటనలు జరిగినా ఆడపిల్లల స్వేచ్చని తల్లిదండృలు ఎమీ హరించటంలేదు. మీరు అమేరికాలో వుంట్టూ అనవసరంగా ఆందోళన చెందకండి అని మాత్రమే!

Praveen Mandangi said...

అత్యాచారానికి గురైన స్త్రీలకి ఆర్థిక సహాయం చేసే చట్టం ఒకప్పుడు మధ్య ప్రదేశ్‌లో ఉండేది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకి చెందిన స్త్రీలు డబ్బుల కోసం కావాలని అత్యాచారం జరిగినట్టు తప్పుడు కంప్లెయింట్‌లు ఇవ్వడం వల్ల ఆ చట్టాన్ని రద్దు చేశారు.

Kalpana Rentala said...

అనానిమస్ గారు,మీరు మాములుగానే రాసి ఉంటే సారీ. ఈ పోస్ట్ మీద చాలానే వెటకారపు కామెంట్లు వచ్చాయి లెండి. మీరు కూడా అదే టోన్ తో రాశారనుకున్నాను. అందుకే అలా సమాధానమిచ్చాను.

Praveen Mandangi said...

And also read this: http://teluguvartalu.com/2012/07/30/%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%82-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%95%E0%B1%81%E0%B0%B2-%E0%B0%9A%E0%B1%87%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-2/

 
Real Time Web Analytics