నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, August 17, 2012స్వరం మార్చిన ఒక మాట

 
నీతో మాట్లాడలేక....
పెదవి ఒంపుల నుంచి
ఓ వెల్లువై రాబోతున్న
మాటల జల్లు
ఓ వలయం లా వెనక్కు తిరిగి
గుండెలోతుల్లో జారిపోయింది.

ఎవరెవరి కళ్ల మీదుగానో
జారిపోతున్న నిన్ను చూడలేక .....
కనుపాపల చీకటి కొసల నుంచి
జాలువారే ఓ నీటి చుక్క
కళ్లెదుట కాలిపోతున్న కలల్ని చూసి
అలలు లేని సముద్రమై
లోపల్లోపల ఎండిపోయింది.

మాటలు లేని పగళ్ళు,
నిద్ర లేని రాత్రుళ్లు
స్పర్శ  లేని సహజీవనాలు
ప్రేమ లేని అనుబంధాలు
శాంతినివ్వని యుద్ధాలు

ఈ జీవితం ఓ అసంపూర్తి మరణం !
అందుకోసమే ఎదురుచూపులు!!

ఆగస్ట్ 17, 2012   
కల్పనారెంటాల

14 వ్యాఖ్యలు:

teresa said...

Beautiful expression kalpana!

వనజవనమాలి said...

చాలా వేదనగా ఉంది..

కొన్ని సమయాలలో ఉన్న మానసిక పరిస్థితి..కి ఈ కవిత అద్దం పట్టింది.

ఈ జీవితం ఓ అసంపూర్తి మరణం !
అందుకోసమే ఎదురుచూపులు!!

Kalpana Rentala said...

తెరెసా, నచ్చినందుకు థాంక్స్.
వనజా, ఒక స్నేహితురాలి కోసం ఈ మధ్య కొన్ని కవితలు రాశాను.అందులో ఇదొకటి.

the tree said...

nice one.

Anonymous said...

కల్పనా,
చాలా ఖేదం, దుఖ్ఖం కనిపిస్తుంది మీ కవితలో. కానీ కల్పనా, జీవితం ఒక అసంపూర్తి మరణం కాదు. జీవితం ఒక గొప్ప అనుభవాల వలయం. ఆ అనుభవాలకి, మనం బ్రతికి, నిర్వచించుకునే ఈ సంఘం లో మంచి చెడూ అనే టాగ్స్ వుంటాయి కానీ. బతుకనేది ఒక అద్భుతవైన అనుభవం. అది కష్టవైనా, సుఖమైనా, దాని కొనసాగింపు కోసం మన ఎదురు చూపులు వుండాలి కానీ దాని మరణం కోసం కాదు. ఒక వెరీ పెసిమిస్టిక్ ఎక్సెప్రెషన్. నాకసల నచ్చలేదు.
-కిరణ్

జ్యోతిర్మయి said...

వేదనా పూరితమైన భావం. ఆ ఉధృతి తగ్గాక ప్రంపంచం మునుపెన్నడూ లేని అ౦ద౦తో కనిపిస్తుంది. ఆ అనుభవాన్ని వ్యక్తీకరించడం మరచిపోకండి.

సుజాత said...

కొన్ని పెసిమిస్టిక్ గా ఉన్నా, అవి జీవన వాస్తవ చిత్రాలు.
కల్పనా, కవిత చాలా చేదుగా ఉన్నా, వేదనలోని తీపిని పంచేలా ఉంది

Anonymous said...

జ్యోతీర్మయి, సుజాతా గార్లకి,

మీరు తెలుగు వారే, ఏ నెల్లూరు లోనో, హైదరాబాదులోనో, బెజవాడ లోనో, మరో ఊర్లోనో మీరు తిరింగి వుంటారు. నాకు నక్స లైట్ ఫిలోసఫీ నచ్చదు, కానీ ఆ గోడల మీద వారు వ్రాసిన ఈ రెండు వాక్యాలు మాత్రం కళ్ళకద్దుకుంటాను. "జీన హై తో మర్నా సీకో, కదం, కదం పర్ లడ్నా సీకో." మర్నా సీకో అంటే చనిపొమ్మంటం కాదు, చావులో, అంటే బతుకులో (బతికితేనే కదా చావుండేది) వుండే ఆ కష్టాన్ని అర్థం చేసుకోమని, ""కదం, కదం పర్ లడ్నా సీకో," అంటే ఆ బతుకుని, అది ఎంత కష్టవైనా కానీ బతకడం నేర్చుకోమని.

బతకాలండీ, బతకడవే ఒక మహా గొప్ప అనుభవం. బతుకులో కష్టాలు లేవని కాదు, కానీ బతకడవే ఒక గొప్ప అనుభవం. ఎన్ని కనీళ్ళు కారినా సరే, ఎంత ఏడుపు వచ్చినా సరే బతకడవే ఒక గొప్ప అనుభవం.
-ravikiran timmireddy

Kalpana Rentala said...

జ్యోతిర్మయి గారు,తప్పకుండా...కాకపోతే....ఆ వేదన సామాజికమైనది. కాబట్టి వేదన తగ్గటం అంటూ ఉండదు. వేదన తో పాటు తీపి అనుభవాల గురించి కూడా రాస్తాను .
సుజాత...సరిగ్గా చెప్పారు. వేదన లోని తీపి....కవిత ఎసెన్స్ పట్టుకున్నారు. థాంక్స్.

కిరణ్, బిజీ గా ఉందటం తో మీకు సమాధానం ఆలస్యం గా ఇస్తున్నాను. ఏమీ అనుకోకండి.
ఇక మీరన్న దానికి...ఈ జీవితం ఓ అసంపూర్తి మరణం అన్న వాక్యం లో ( నేను రాసిన ఉద్దేశ్యం లో) బోలెడు తాత్త్వికత ఉంది. అదొక పెసిమిస్టిక్ స్టేట్మెంట్ మాత్రం కాదు. జీవితానికి మరణం ముగింపు కాదు. ఒక కొనసాగింపు. మరణం తో కూడా జీవితం పరిపూర్ణం కాదు ఎందుకంతే అది కొనసాగింపు కాబట్టి. కాబట్టి జీవితం ఓ అసంపూర్తి మరణమే అనుకుంటాను. ఎదురుచూపులు ఎందుకంతే మరణం తర్వాత వచ్చే కొత్త జీవితం లేదా పునర్జన్మ కోసం. వేదన, సుఖం, ఇతర అనుభూతులు, ఉద్వేగాలు ఇవేమీ మరణం తో ఆగిపోవు. కొన్ని స్మృతులుగా ఆత్మ ను అంటిపెట్టుకొని ఉంటాంయి అంటారు. దాన్ని నేను నమ్ముతాను...
కవిత్వం గురించి ఇంత వాచ్యంగా చెప్పటం నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ తప్పలేదు. :-))

మరో విషయం...జీవితమంటే నిరంతరం పాజిటివ్ గా మాత్రమే ఉండాలన్నది అత్యాశ. పెసిమిజం లేకపోతే పాజిటివ్ కి ఆ శక్తి ఉండదు. ఏమంటారు?

the tree said...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

spandana said...

ఇవాళే "తన్హాయి" పూర్తిచేశాను. ఇక్కడ మీ కవిత చూస్తే కౌశిక్ నుంచి విడిపోయిన కల్హార మానసిక వేదనకు ఇది సరిగ్గా కుదురుతుందనిపిస్తోంది. (ఇంకా నేను తన్హా మూడ్‌లోనే వున్నందువల్లేమొ!)

తన్హాయి రెండో భాగం గానీ రాస్తున్నారా? చదవడానికి నేను సిద్దం.

-- ప్రసాద్
http://blog.charasala.com

Kalpana Rentala said...

ప్రసాద్ గారు,
అహహ...లేదండి...మరో నవల రాయాలని ప్రయత్నం. కానీ తన్హాయీ రెండో భాగం మాత్రం కాకపోవచ్చు...చూద్దాము...
ఇక ఈ కవిత బహుశా మీరు ఇంకా తన్హాయీ చదివిన మూడ్ లో ఉండటం వల్ల అలా అనిపించిందేమో...కానీ ఈ కవిత కింద వున్న కామెంట్లు చదివితే నేను కవిత రాసిన సందర్భం కూడా అర్థమవుతుంది. ఇది ఒక స్నేహితురాలికోసం రాసిన కవితా. ఆమె వేదన కు నా అక్షర సహానుభూతి ఇది.

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

bhuvanachandra said...

chaalaa...chaalaa....baagundi....chadivaaka konni''chukkalu''kallallonchi raali gunde..meeda aavirayyayi....vedana kannaa manchi snehitudevaru...

bhuvanachandra said...

chaalaa...chaalaa....baagundi....chadivaaka konni''chukkalu''kallallonchi raali gunde..meeda aavirayyayi....vedana kannaa manchi snehitudevaru...

 
Real Time Web Analytics