నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, December 12, 2012

అసంపూర్ణ వాక్యం !



అసంపూర్ణ శూన్య పదాలతో
వాక్యం ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది
సత్యమో , అసత్యమో!

ప్రతి వాక్యానికి కొన్ని అర్థాలు, మరికొన్ని అపార్థాలు

లోపలి భావం ముసుగు ధరించి
కొత్త వాక్యమవుతుంది 


వాక్యం తరువాత వాక్యం తో
సిద్ధమైన ఓ కవిత్వ వేదిక

ఆ తర్వాత
ఒక్కో వాక్యం వీడ్కోలు పలికివెళ్లిపోతుంది
కుప్పకూలిపోతున్న  వేదిక ను
వెనుతిరిగైనా చూడకుండా!



ఎన్ని కవితలు పుట్టినా
పదాల మధ్య ఖాళీ
మనసుల మధ్య అంతరం
ఎవరికి అర్థమయ్యేను?
( కవిత్వ శూన్య భాష గురించి...)

సెప్టెంబర్ 26, 2012










4 వ్యాఖ్యలు:

teresa said...

Beautiful!

THARKAM said...

అలాగని అసంపూర్తిగా వదిలేయలేం కదా?

Padmarpita said...

ఎన్ని కవితలు పుట్టినా
పదాల మధ్య ఖాళీ
మనసుల మధ్య అంతరం
ఎవరికి అర్థమయ్యేను?
Superb lines.

Kalpana Rentala said...

@teresa, Thank you.

Tharkam, అవును వదిలేయలేం కాబట్టే రాస్తూ ఉంటాము.:-)
పద్మార్పిత, థాంక్స్. ఎలా ఉన్నారు?

 
Real Time Web Analytics