కథా రచయత గా జాన్సన్ చోరగుడి ఎన్ని కథలు రాసారో నాకు లెక్క తెలియదు కాని ఆయన రాసిన ఒక కడలూర్ వెళ్ళాలి నీలిమ కోసం ( పేరు తప్పై ఉండవచ్చు....ఇలాగే ఏదో వుంటుంది ) అనేది మాత్రం మంచి కథ. అదే నేను చదివిన ఆయన మొదటి కథ.. ఆ తర్వాత ఏవో కొన్ని కథలు చూసాను కానీ పెద్దగా గుర్తుండిపోయినవి నాకు తక్కువే. ఈ కథ మొన్న ఆదివారం ( డిసెంబర్ ఇరవై ) సాక్షి ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది. మొదటి సారి చదువుతున్నప్పుడే సరిగా అర్ధం కాలేదు. మళ్ళీ నెమ్మదిగా చదివే ప్రయత్నం చేశాను. కథ ముక్కలు ముక్కలుగా అర్ధమైంది. మొత్తంగా కథ మాత్రం అర్ధం కాలేదు. కథ పేరు కి కధ కి సంబంధం అసలు అర్ధం కాలేదు. మూడో సారి పట్టు విడవకుండా మళ్ళీ చూద్దామని వెళితే కథ కి వేసిన బొమ్మ కనిపించింది. అది పరీక్ష గా చూస్తే జరగలేదు కి ఒక పక్కన ఆ మీటింగ్ అని కనిపించింది . కూడబలుక్కొని చూస్తే ఆ మీటింగ్ జరగలేదు. అమ్మయ్య కథ పేరైనా అర్ధమైంది అనుకున్నాను. నాకు కథలు రాయటం రాదని తెలుసు, చదవటం కూడా రాదేమో అని ఈ కథ చదివాక అనిపించింది. మీకేవరికైనా ఈ కథ అర్ధం అయితే ఇక్కడ రాయరా?నేను కూడా అర్ధం చేసుకుంటాను.
ఈ కథ ఇక్కడ చదవండి.
అమెరికాచరిత్రలో ఒక దుర్దినం
-
నాయకుడు అంటే సామాన్యజనాలకు, తుఫానుసమయంలో దుర్భరఅగ్నిశిఖలలో చిక్కుకుని
సర్వస్వం పోగొట్టుకున్న దురదృష్టజీవులకు తగినసహాయం అందించవలసిన మానవుడు
కావాలి. ఒట్టిమాట...
1 day ago
39 వ్యాఖ్యలు:
అస్సలు అర్ధం అవలెదు. ఎందుకంటే మీరిచ్చిన లింక్ క్లిక్ చేస్తే తెలుగు లిపి లో కాకుండా ఇంకేదో 'భాష' లో ఉంది కాబట్టి !!
హరేఫలే గారు,
నేను చెక్ చేసి చూసాను. నాకైతే లింక్ చెక్ చేసి చూస్తే తెలుగు భాష లోనే అక్షరాలు కనిపిస్తున్నాయి. పోనీ మీరు సాక్షి లోకి వెళ్ళి చూసినా ఆ కథ కనిపిస్తుంది. అలా చదివి మీ అభిప్రాయం చెప్పండి.
కల్పన
sakshi lo font ni download chesukovalandi..
font help ni chudagalaru..
జాన్సన్ గారు రాసిన కథ"కడలూరు వెళ్ళాలిఒక నీలిమ కోసం "ఇప్పుడు తలచిన గుండె తడి అయ్యి కదిపెస్తుంది . గుర్తు చేసినందుకు దన్యవాదములు .జరగని మీటింగ్ ఇంకోసారి ప్రశాంతంగా చదివితే అర్ధం కావచ్చేమో .
సంతొష్, మీరు చెప్పినట్లు ఎవరి కంప్యూట మీద వాళ్ళు ఆ ఫాంట్ డౌన్ లోడ్ చేసుకోవాలేమో?
చిన్ని, అవును. కడలూరు వెళ్ళాలి గుండె తడి వున్న కథ.ఈ కథ మీకు అర్ధమైతె మరి కాస్త వివరించి చెప్పవచ్చు కదా... ప్లీజ్ ...
హరెఫలె గారు, ఫాంట్ డౌన్ లోడ్ చేసుకొని కథ చదివి అటే పారిపోకండే...ఇక్కడకు వచ్చి మీ అభిప్రాయం చెప్తారా?
"గే"ల మీద ఆయనకి కొన్ని అభిప్రాయాలున్నాయి. కథ రాయాలానుకున్నారు పాపం. ఏం రాయాలో తెలియక మరి కొన్ని అభిప్రాయాలు పోగేసి నాలుగు పాత్రల్ని పోగేసి వాటితో పలికించారు.
ఇక మీ ప్రశ్న రెటోరిక్ అయి ఉండాలనుకుంటాను.
శ్రీనివాస్, మీకు అర్ధమైనదాని ప్రకారం ఈ కధ " గే " ల గురించి.అంతేనా? కధ మొదట్లో మిత్ర, ప్రసన్న ల సంభాషణ మీకేమైనా అర్ధం అయిందా? ఇలా అడగటానికి కారణం ఒక కథ ఇంత గందరగోళం గా వుంటే ఏ రీడర్ కి అయినా కథ ఎలా అర్ధం అవుతుంది అని...ఈ కథ మొత్తం గా ఒక్కరైనా అర్ధం అయింది అని ఒకరైనా వివరిస్తే ధన్యవాదాలు.
అంతా చదివాక ఆ మధ్యన ఒక స్నేహితుడు పుల్ల విరుపుగా అన్న మాట గుర్తొచ్చింది .. కథతో సరిపోయే చోట కవిత రాయడమెందుకు, వ్యాసంతో పోయేదానికి కథ రాయడమెందుకు? అని.
ఆమాటకొస్తే ఈ మధ్యన తెలుగులో సీరియస్ కథలంటూ వస్తున్నవి చాలా మట్టుకి వ్యాసాలకి ఫిక్షను రూపాలే కాబట్టి కేవలం ఆ కారణంగా ఈ "కథ"ని నిందించాల్సిన పని లేదనుకుంటా.
అసలు కథలోకొస్తే .. నాకర్థమైంది ఇది - కథ గే ల గురించి కాదు. గే ల రక్షణ గురించి భారత ప్రభుత్వం చట్టాలు చేసిందనే సత్యం ఎంత హాస్యాస్పదమో చెప్పడం రచయిత ముఖ్యోద్దేశం. అందుకనే జరగాల్సిన మీటింగ్ జరగలేదు. ఇక కథ మొదట్లో మిత్ర-ప్రసన్నల సంభాషణ, మధ్యలో అనుక్షణికం నవలనించి శ్రీపతి పాత్ర మనోభావాలు, చివర్లో నారింజ రంగులో ఉదయిస్తున్న చంద్రుడు .. ఇవన్నీ ఎందుకంటారా? మరి రచయిత తను ఎంత "కూల్" వో పాథకులకి నిరూపించేదెలా? :)
ఏంటో అంతా గందర గోళం గా వుంది. ఐతే ఏంటి ఇప్పుడు (బుర్ర గోక్కుంటున్నా)
కొత్తపాళీ, రచయత కూల్ అనిపించుకోవటానికి చెప్పినా, ఎంతో కొంత కథ కి సంబంధం వుండాలి కదా.. ఆ సంబంధం నాకు కనిపించలేదు. కొంచెం అంటూ అర్ధమైతే ఇంకొంచెం లోతుగా ఆలోచించవచ్చు. ఇప్పుడొస్తున్న కథలకు దీన్ని సంకేతం గా చూపించటం నా వుద్దేశం కాదు. ఇప్పుడు కథలు ఎలా వుంటున్నాయో మాట్లాడటానికి, నేను ఇప్పటికే కొన్ని కథల్ని ఎన్నుకున్నాను. ఇది అందులోది కాదు. పూర్తిగా వేరే తాను లో ముక్క. కడలూర్ వెళ్ళాలి లాంటి కథ రాసిన రచయత ఈ కథ ఇలా రాయటం ఎలా జరిగింది, ఎందుకు ఇలా రాశాడు అని నా ఆలోచన. నేనేమైనా మిస్ అయ్యనేమో, మీ ఎవరికైనా అర్ధమైతే చెప్తారని నా తపన. అంతే తప్ప ఇందులో రచయత మీద ఏవో నిందారోపణలు చేయటం నా వుద్దేశం ఎంత మాత్రం కాదు. నిజంగా రచయతే వచ్చి ఈ కథ నేను ఇలా రాశాను అని చెపితే నా నెత్తి మీద పాలు పోసినట్లు అవుతుంది.
చిన్నీ, మీ దగ్గర జాన్సన్ గారి ఫోన్ నెంబర్ వుంటే ఇవ్వండి. ఒక సారి ఇంటర్వ్యూ చేసేద్దాము పనిలో పనిగా. ఏమంటారు?
భావనా, రండి. అదే నేనొక్కదాన్నే నా బుర్ర ఎందుకు గోక్కోవటం అని మీ అందరి కి కూడా పని పెట్టాను. అసలే జుట్టు తక్కువ. ఇంకా ఎక్కువ ఎక్కడ ఆలోచించి ఆ కాస్త పోగొట్టుకుంటాము చెప్పండి?
కల్పన
ఇప్పుడంత పెద్ద కథ చదివి విశ్లేషణ చేసి వ్రాసేంత ఓపిక లెదు కానీ, రోజూ ఓ పేరా చదివి అర్థమైతే మళ్లీ తిరిగొస్తానండి
కల్పన,
సరే ఈ కధ కోసం ఇంత తిప్పలు పడుతున్నావుకదా అని ధైర్యం చేసి చదివా.. ఐనా కధ అంటే ఒకే టాపిక్ లేదా రెండు మూడు టాపిక్ లు మాత్రమే మాట్లాడాలని లేదుగా. ఒ పది విషయాలు కలిపి ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుకున్నారనిపించింది నాకైతే సగంకంటే ఎక్కువ కధ చదివాక. నాటైపు సమాధానం అంటే ..చట్నీస్ లేదా మినర్వా హోటల్ కి వెళ్లి సౌత్ లేదా నార్త్ ఇండియన్ ధాళీ (భోజనం) తెప్పించుకుంటాము. అందులో ఒక్కో వంటకం రుచి చేసి ఎలా ఉందని మాట్లాడుకుంటాము కదా.. ఇది అలాగే అనిపించింది. ఐతే నా బుర్ర గట్టిదన్నమాట. ఈమాత్రం ప్రయత్నించగలిగా.. :)
జ్యోతిగారి ఎనాలజీ బావుందిగానీ, థాలీ తింటే అందులో ఏ వంటకానికా వంటకం రుచిగా ఉండి మనకి తృప్తి కలిగిస్తుంది, జాన్సన్ గారి కథలో మాట్లాడ జూసిన పదివిషయాలు అలాంటి తృప్తిని కలిగించట్లేదు .. అదే అసలు గొడవ.
కల్పన గారూ, ఆయన్నో ఆయన రచనల్నో అనాల్సినవేవో నేనే అన్నాను. మీరా రచయితని ఏదో అన్నారని నేను అనలేదండీ.
కడలూరెళ్ళాలి కథ గురించి కూడా ఒక ముక్క చెబుతా .. మీరూ ఆలోచించండి. కథనం వేపు చూస్తే, అదీ ఈ కథలాగానే గందరగోళంగా ఉంటుంది. కడలూరు కథని ఒక మిత్రులగుంపులో చర్చించినప్పుడు చాలా మందే విసుకున్నారు ఆ అతుకుల బొంత లాంటి కథనాన్ని. చాలా మందికి (తెలివైనవాళ్ళే, కథలు చదవడం అలవాటున్న వాళ్ళే) ఆ కథ కూడా అర్ధం కాలేదు. ఒక ఉప్పెనలో తన కుటుంబాన్ని కోల్పోయిన ఒక మగవాడు అదే ఉప్పెనలో అనాథయిన ఒక పాపని తన కూతురిగా స్వీకరించాలి అనుకునే వస్తువు మీకు నచ్చడంతో .. కొంతవరకూ ఆ ఊహ మీ అనుభవంలోది కావడంలో మీకా కథ మంచి కథగా గుర్తుండి పోయింది.. అని నా అనుమానం. గందరగోళం అతుకులబొంత కథనం మాత్రం రెంటిలోనూ సమానమే.
@కొత్తపాళీ, కడలూర్ వెళ్ళాలి కథనం గందరగోళం గా వుందన్న వాదనతో నేను కూడా అంగీకరిస్తాను. అయితే అందులో ఒక ఎలిమెంట్ వుంది. దాని ముందు కొంత గందరగోళాన్ని పాఠకుడు సహించగలడేమో...
@జ్యోతి, అనాలజీ బావుంది. పది రకాల కూరలు విడివిడిగా తినటానికి ఓకె కాని కలగలిపి తినేస్తే అబ్బే...ఏం బాగుండదు.
@భా.రా.రె..చక్కగా రోజుకొక పేరా చదివి, నమిలి మింగి, జీర్ణం చేసుకొని, అప్పుడు ఇక ఇక్కడకొచ్చి విరగదీయండి.
నేను కథ చదవలేదు కానీ ఈవ్యాఖ్యలు ఆసక్తికరంగానే వున్నాయి. కల్ననా, అసలు మంచి కథ అంటే ఎలా వుండాలి?
@ మాలతి గారు, అబ్బా, ఆశ, దోశ, అప్పడం.. నా చేత చెప్పిద్దామనే ....మంచి కథ అంటూ తెలిస్తే నేను ఆ మంచి కథ ఏదో రాసుకునేదాన్ని కదా...నచ్చిన కథలు, నచ్చని కథలు, అర్ధం అయిన కథలు, అర్ధం కాని కథలు ఇలా విభజించుకోవాలి మనం. మరీ ముఖ్యం గా '80 ల తర్వాత వస్తున్న కొత్త ప్రయోగపు కథల్ని. ఏమంటారు?
నేను మీడియాలో యాంకర్ టైప్ లో తెగ ఇంటర్వ్యూలు చేసిన దాన్ని. ప్రశ్నలు అడగటం తప్ప, సమాధానాలు చెప్పటం తెలియక్కరలేదు...అబ్బా..అర్ధం చేసుకోరు...(స్వర్ణ కమలం లో భానుప్రియ ని ఇక్కడ గుర్తు చేసుకోవాలని మనవి)
"అయితే అందులో ఒక ఎలిమెంట్ వుంది"
ఆ మాత్రం ఎలిమెంట్ ఈ కథలోనూ ఉంది. ఆ ఎలిమెంటేవిటో నా మొదటి వ్యాఖ్యలో చెప్పాను.
@ కొత్తపాళి,
" కథ గే ల గురించి కాదు. గే ల రక్షణ గురించి భారత ప్రభుత్వం చట్టాలు చేసిందనే సత్యం ఎంత హాస్యాస్పదమో చెప్పడం రచయిత ముఖ్యోద్దేశం. అందుకనే జరగాల్సిన మీటింగ్ జరగలేదు."
మీరు చెప్పిన ఎలిమెంట్ ఇదే కదా.
కడలూరు వెళ్ళాలి లొని కథావస్తువు మన మనస్సు ని తాకే అంశం. మీతింగ్ జరగలేదు కథలో అది అసలు అర్ధం అవుతోందా, లేదా అనే దాని దగ్గరే ఆగిపోయింది. ఒక కథకు ముందు ప్రాణం వస్తువు, తర్వాతే కథనం. కడలూరు వెళ్ళాలి లో కథావస్తువు బావుంది. అందుకనే కథనం కొంత గందరగోళం గా వున్న చాలా మంది దృష్టిలో అది మంచి కథ అయింది అని నా అభిప్రాయం. అదే ప్రస్తుతం మనం మాట్లాడుతున్న ఆ మీటింగ్ జరగలేదు కథలో కథనం సంగతి దేవుడెరుగు, అసలు కథావస్తువు ఇది అని కూడా చెప్పలేకపోవటంతో అసలు ఈ కథ దేనికి సంబంధించినది అన్న ప్రశ్న తలెత్తుతోంది అని నేననుకుంటున్నాను.
హ్మ్
ఈ టెక్నిక్/పద్దతి కధలకూ వ్యాపించిందా. హతవిధీ
కడలూర్ కధకు నేనో పెద్ద అభిమానిని. అది వేరే విషయం అనుకోండి.
బొల్లోజు బాబా
చదివాను. మీ అందరిలాటి 'ఇంటలెక్చువల్' ని కాను. ఈ కథ 'బయటి దేశాల్లో' ఉండే 'గే కల్చర్' మన దేశంలో కూడా ఎంత ప్రాచుర్యం పొందిందో అనే అంశం మీదా అని నాకు అనిపించింది. ఇదంతా ఎదో ' పేజ్ 3 ' వాళ్ళ డిస్కషన్ లాగ ఉంది. నేను ఇంగ్లీషులో నాకు జరిగిన ఒక అనుభవం గురించి వ్రాశాను-- http://bpb-phani.blogspot.com/2007/04/encounter-with-gay.html. అది ఇక్కడ రిలవెంటు కాకపోవచ్చు. కానీ నాకు
తెలిసినదేదో వ్రాశాను.
అబ్బా..అర్ధం చేసుకోరు...(స్వర్ణ కమలం లో భానుప్రియ ని ఇక్కడ గుర్తు చేసుకోవాలని మనవి)
-- హీహీహీ, స్వర్ణకమలం తెలీదు గానీ ఈడైలాగు నాచిన్నప్పట్నుండీ తెలుగుసినిమాల్లో (నాకు నాగేశ్వరరావు మొహం కనిపిస్తోంది, అర్థం చేసుకోవూ సుశీ అంటూ), వున్నదే కనక అర్థం చేసుకోగలను.
ఒకమంచికథమీద నావ్యాసం పుస్తకం.నెట్లో చూడవలెను.
బాబా గారు, తెలుగు కథల్లో అయోమయం, గందరగోళం, ‘ మాజిక్’ రియలిజం మంత్రతంత్రాలు వచ్చి చాలా కాలమైంది కదా!
హరేఫలే గారు, ఇక్కడ ఎవరం ‘ మేధావులం’ కామండి. మామూలు పాఠకులమే. ఏదో అర్ధం కావాల్సింది వుందేమో, అదేమిటో తెలుసుకోవాలని ప్రయత్నం. అంతే. ఇక ‘ గే ‘ కల్చర్ గురించి మాత్రం ఒక మాట. మీ అనుభవం చదివాను. అది కేవలం బయటి దేశాల్లోని సంస్కృతి మాత్రమే కాదు. మన దగ్గర ఎన్నో తరాలుగా వుంది కానీ ఇప్పుడే, అగ్రరాజ్యాల వల్ల మన దగ్గర కొత్తగా వచ్చిన విష సంస్కృతి గా దీన్ని మనం భ్రమిస్తున్నాము. మీరు మీ అనుభవాన్ని బయటకు వెల్లడి చేసి మంచి పని చేశారు.
మాలతి గారు, మీ వ్యాసం పుస్తకం లో చదివాను. ఎప్పటిలాగానే మంచి విశ్లేషణ.
కల్పనగారూ దండాలండీ!
చోరగుడిగారి కథపై మీరు రాసిన కామెంట్, ఆ కామెంట్‌పై వచ్చిన కామెంట్లు, వారి కామెంట్లపై మళ్లీ మీ కామెంట్లు ... మీ కామెంట్లపై మళ్లీ వాళ్ల కామెంట్లూ ... అన్నీ చదివి జీర్ణించుకున్నాను. అదన్నమాట విషయం... ఆంధ్రజ్యోతిలో 'గే'లపై కవర్‌స్టోరీ పెడితే నాకు ఫోన్ చేసి అలా వాళ్లపై కవర్‌స్టోరీ రాయాల్సిన అవసరం ఉందా? అని అసహనం చూపారు ఒకసారి. బహుశా... దానికి విరుగుడుగా ఈ కథని రాశారనిపిస్తోంది. మీ వాగ్వివాదాల ద్వారా ఆ కథ గేలకు సంబంధించినదని తేటతెల్లమైనది. ధన్యవాదములు.
ఈ సందర్భంలో 'గే' లపై తెలుగులో వచ్చిన కథలు ఉటంకిస్తున్నాను. ఇస్మత్ చుగ్తాయ్ 'కంబలి' (స్మైల్‌గారి అనువాదం), విశ్వనాథ సత్యనారాయణగారి 'మరియొక విధంబు' ....
(చుగ్తాయ్‌గారి కథ ఇద్దరు స్త్రీల శరీరాలతో ముడిపడితే, విశ్వనాధగారి కథ ఇద్దరు పురుషుల ప్రేమతో ముడిపడింది - 80 ఏళ్ల కిందటే రంజైన గేస్టోరీకి స్వీకారం చుట్టిన విశ్వనాథగారి కథని 2ఏళ్ల క్రితం విపులలో మంజుశ్రీగారు పరిచయం చేశారు)
మీరడిగిన మేరకు నా దగ్గరున్న జాన్సన్‌గారి సమాచారం ఇస్తున్నాను.
వారి ఫోన్ నెం:
99493 51559
వారి విలాసం:
4-24, సుందర్‌నగర్
ఓల్డ్ డైరీ ఫామ్ పోస్టు
విశాఖపట్నం - 530 040
వారి ఇ-మెయిల్:
johnson_choragudi@yahoo.co.in
గొరుసు జగదీశ్వర రెడ్డి గారు,
తిరిగి దండాలండీ. మీలాంటి కథారచయత, జర్నలిస్ట్ నా బ్లాగ్ లోకి అడుగిడి కామెంటడం మా అదృష్టం సారూ.
చూశారా? మీరు వచ్చి ఆ విషయం చెప్పబట్టే కదా మాకు తెలిసింది ఈ కథ రాయడం వెనక బహుశా ఆయన వుద్దేశం అయితే ఆయన గే సంస్కృతి ని వ్యతిరేకిస్తున్నారన్నమాట. ఇప్పుడు మళ్ళీ కథ చదివితే ఏమైనా అర్ధం అవుతుందేమో...హరేఫలే గారి అనుభవం ఆయన ఇక్కడ కామెంట్ లో లింక్ ఇచ్చారు. మనం వ్యతిరేకిస్తామా, సపోర్ట్ చేస్తామా అని కాదు. అది మన సమాజం లో ఒక భాగం గా వున్నప్పుడు తప్పనిసరిగా దాని గురించి మాట్లాడుకోవాల్సిందే. ఆంధ్రజ్యోతి సండే చేసే కవర్ స్టోరీలు, కథల మీద నాకు కాస్త high opinions నే వున్నాయి. (కొన్ని మినహాయింపులు కొన్ని సార్లు వున్నాయనుకోండి.)
ఇక జాన్సన్ గారి సమాచారానికి థాంక్స్. నేను ఇప్పటికీ ఆయన ఫోన్ నెంబర్ సంపాదించి ఆయనతో మొన్ననే ఫోన్ లో మాట్లాడాను. నేను కథ గురించి అడిగాను. ఆయన నవ్వి మీటింగ్ జరగలేదు కాబట్టి ఏం జరిగిందో తెలియదు. మీటింగ్ జరిగివుంటే తెలిసివుండేది అన్నారు.. నేను మళ్ళీ ప్రశ్నించాను . అసలు కథ దేని గురించి అని, ఆయన అర్ధం కాలేదా అని ఒకింత ఆశ్చర్యపోయారు. తప్పకుండా బ్లాగ్ చూసి తన వివరణ ఇస్తానని చెప్పారు కానీ మరి ఇవ్వలేదు. బహుశా బిజీ గా వున్నారేమో...
ఇక మీరు అందచేసిన కథలకు తోడు నా దగ్గర మల్లాది వారి ఇంకో కథ కూడా వుంది. కథావస్తువుల్లో వస్తున్న మార్పులు, సమాజం లో వస్తున్న మార్పులు రెండూ కలిపి మీరోక కవర్ స్టోరీ చేయవచ్చు.
ఈ కథ మీద మామూలు పాఠకులతో పాటు, రచయతలు ఏమనుకుంటున్నారో అని నాకు చాలా క్యూరియస్ గా వుంది. మీరోచ్చి మాట్లాడటం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ కథాచర్చల వల్ల ఏమైనా వుపయోగం వుంటుందో లేదో నాకు తెలియదు కానీ తప్పనిసరిగా ఒక అవసరం అని అనుకుంటాను.
\
ఇక్కడ కడలూరు కథ గురించి గుర్తు చేసుకున్న వాళ్ళంతా ఆ కథని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడ్డం నాక్కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అందుకని వెనక్కి తిరిగి చూసుకున్నా. పొద్దులో అప్పుడెప్పుడో రాసిన ఈ సమీక్ష కనబడింది.
పదమూడు కథల్లో నాలుగింటిని గురించి విపులంగానూ, ఇంకో మూడింటిని గురించి ఒక్కో వాక్యంలోనూ సమీక్షించాను. ఇవికూడా ఈ సంకలనంలో ఉన్నాయి అని ప్రస్తావించిన మిగతా ఆరు కథల్లో ఈ కడలూరు కథ కూడా ఉంది. మంచి కథే, కానీ గొప్ప కథ అని మాత్రం అనిపించలా అప్పుడూ ఇప్పుడూ.
ఈ కథ గొప్ప కథ ఎందుకైందో .. లేదా మనం మెచ్చాల్సిన కథ ఎందుకైందో ఎవరన్నా వివరంగా ఒక టపా రాస్తే ఆసక్తికరంగా ఉంటుంది
కొత్తపాళి, కడలూరు వెళ్ళాలి ఒక మంచి కథ అనడానికి ఎవరికి వారికి వారి కారణాలు వుండవచ్చు. ఆ మాటకొస్తే ఏ కథ అయినే నచ్చటం, నచ్చకపోవటం అనేది అనేక అంశాల మీద ఆధారపడి వుంటుంది. నేను మంచి కథ అన్నాను. గొప్ప కథ అనలేదు. మంచి కథ కి, గొప్ప కథ కి వున్న తేడా, అసలు కథ ని ఎలా చూడాలి, ఎలా చూస్తున్నాము అనే విషయాల మీద చర్చ జరిగితే బావుంటుంది. మీరు చెప్పినట్లు నాకు అర్ధమైన పరిధిలో, నాకు ఎందుకు నచ్చిందో నేను కడలూరు కథ గురించి టపా రాయవచ్చు (మీరెవరైనా కడలూరు కథ మీ దగ్గర వుంటే స్కాన్ చేసి పెడితే...) నేను కూడా ఆ కథ కోసం వెతుకుతాను.
@కొత్తపాళీ
చూసే కళ్ళబట్టి 'అందం 'వున్నట్లు స్పందించే మనసుని బట్టి వుంటుంది నచ్చడం 'నచ్చక ;పోవడం -:)
@ చిన్ని రైట్ నా స్పందించే మనసుని తెలంగాణాలో తాకట్టు పెట్టొచ్చాను.
@కొత్తపాళీ
సారి అండీ ..మీరేదో నొచ్చుకున్నట్లున్నారు.నేను సరదాగా అన్నాను .అయిన మేం ఒప్పుకోం మీ మనస్సు తెలంగాణా కి తాకట్టుపెట్టడం ...అదేదో ఇక్కడే వదిలేసి పోవచ్చుగా -:)
@కల్పనరెంటాల
ఏమి అనుకోకండీ మీ బ్లాగ్ ని వేదిక చేసి గొడవపెట్టుకున్నానని...:)
చిన్నీ, కొత్తపాళి గారు కూడా సరదాగానే అన్నట్లున్నారు. ఇవేవో గొడవ అని నేను అనుకోవటం లేదు. మీరు గోరుసు జగదీశ్వర రెడ్డి గారి కామెంట్ చూశారా? ఆయన ఫోన్ నెంబర్ , ఇంటి అడ్రెస్ కూడా ఇచ్చారు. నేను ఇప్పటికే చొరగుడి గారితో మాట్లాడాను. ఆయన వచ్చి తన వివరణ ఇస్తానని చెప్పారు .చూద్దాము .వచ్చి మాట్లాడతారేమో? ఇక కడలూర్ వెళ్లాలి కథగురించి తప్పని సరిగా మాట్లాడుకోవాలి.ఆ ఒక్క కథే కాదు ఈ మధ్య వస్తున్న అనేక కొత్త కథల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడాల్సిన అవసరముందని నేను అనుకుంటున్నాను. కొత్తపాళీ గారి ఉద్దేశం కూడా అదే. మీలాంటి మంచి పాఠకులు కూడా ఈ చర్చలో పాల్గొనటం కంటే మా అందరికీ కావాల్సింది ఏముంది? ఏమంటారు?
థాంక్స్ కల్పనగారు ,తప్పకుండ చర్చలో పాల్గొంటాము .చదవక క్రితం ఫోన్ నంబర్ ఇవ్వాలా అని అడిగి కామెంట్ తేసేసాను ,నేను మాట్లాడతాను వారితో రేపెప్పుడైనా .
నా వరకు ఇది మంచి ఇది గొప్ప అన్న బేధబావాలు లేవు కథల విషయంలో. చివరి వరకు పట్టి చదివించే యే కదైనా ఇష్టమే. ఈ మధ్యనే ఒక ప్రముఖ రచయిత నవలలోని పాత్ర చేత చెప్పించిన అభిప్రాయం నాకు బాగా నచ్చింది. రచనలు నాలుగు వర్గాలు [ట].
.. ఎక్కువ మంది ఎక్కువ కాలం గుర్తువుంచుకునేవి
.. ఎక్కువ మంది తక్కువ కాలం గుర్తువుంచుకునేవి
.. తక్కువ మంది ఎక్కువ కాలం గుర్తువుంచుకునేవి
.. తక్కువ మంది తక్కువ కాలం గుర్తువుంచుకునేవి
నాకు ఈ తేలిక విభజన భలే నచ్చింది. నాకలా గుర్తున్న కథలు చాలానే. ఆంధ్రజ్యోతి ఆదివారం వచ్చిన కథల్లో, వార్తలో ఇలా చాలానే. అంతా వ్రాస్తున్నారు కనుక నేను ఆ అంశాలు వదిలేసాను.
కల్పనా,
జరగలెదు కథ చదివాను.గే ల గురించి అని కాస్త అర్ధం అయింది. ఒక సంఘతన లొంచి కథ ప్రారంభం కావడము మంచి ప్రారంభమే మిత్ర ప్రసన్న ల సంభాషణ కథ మొత్తానికి లీద్ లాగా వుండాలి. గే ల గురించిన జాన్సన్ అభిప్రాయలు, అవి గే ల కి అనుకూలమా కాదా అన్న విషయాలను పక్కన పెట్టెస్తె అనుక్షనికం నవల పాకీజా సినీమా లో మీనాకుమరి వుదంతం అన్నీ కథ కి ఒక లోతు , లయ కల్పించి కథ కి ఒక స్థాయి కల్పించదానికి రచయిత చెసిన అనవసర ప్రయత్నం.కథ కంటె ఈ రెండు సంఘటనలె
కథ కి ఈస్థటిచ్ అందం కలిగించాయి. అభిప్రాయాలు, అందము వేటికి అవే విది విది గా వుండి కథ వుడకని వుప్మా ల తయారు అయింది.
వంశీ
కథారచయత ఆరి సీతారామయ్య గారు ఈ అభిప్రాయాన్ని ఈమైల్ ద్వారా పంపారు. అది ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను.మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
నాక్కూడా జాన్సన్ చోరగుడి గారి "కడలూర్ వెళ్ళాలి నీలిమ కోసం" నచ్చింది, మొదటి భాగం. అలాగే ఈ మధ్య వచ్చిన మరో కథ "దీనికి పాత సాఫ్ట్ వేరే పనిచేస్తుంది" కూడా నచ్చింది, మొదటి భాగం. వీరి కథలు పూర్తిగా నచ్చకపోవటానికి కారణాలు - కథను ఎక్కడ ముగించాలో అక్కడ ముగించకపోవటం, ఏదో విధంగా కథలకు ఆదర్శాలను అతికించటం, పాత్రల చేత పేజీలు పేజీలు ఉపన్యాసాలిప్పించటం.
ఊరికే కథలు రాస్తే సరిపోదు, సమాజాన్ని ఉద్ధరించాలి, కథల్లో సమస్యలకు పరిష్కారాలు చూపించాలి అని నమ్మే వారిలో ఒకరు చోరగుడి గారు. "దీనికి పాత సాఫ్ట్ వేరే పనిచేస్తుంది" కథలో ఒక పాత్ర చేత చెప్పిస్తారు – పిల్లలకు పుస్తకాలు చదవటం అలవాటు చేస్తే పెద్దయింతర్వాత సమస్యలకు పరిష్కారాలు …సమకాలీన రచయితల రచనలనుంచే వెతుక్కుంటారు - అని. మరి రచయితగా సమస్యలకు పరిష్కారాలు కథల్లో చూపించాలిగదా? ఈ నేపధ్యంలో మళ్ళా చోరగుడిగారి కథలు చదివితే గంగరగోళం ఏమీ ఉండదు. "కడలూరు వెళ్ళాలి నీలిమ కోసం" పేరుకీ కథకీ ఏమిటీ సంబంధం అనే ప్రశ్న రాదు. ఈ పేరు కథకు సంబంధించింది కాదు, చివరి పేజీలో ప్రతిపాదించే ఆదర్శం గురించి. అలాగే "దీనికి పాత సాఫ్ట్ వేరే పని చేస్తుంది" పేరుక్కూడా కథతో ఏమీ సంబంధం లేదు. అది చివర్లో ఒక పాత్ర చేత ఇప్పించిన మూడుపేజీల ఉపన్యాసానికి శీర్షిక మాత్రమే.
సమాజోద్ధరణ వదిలేసి కథను ఎక్కడ ముగించాలో ఆలోచిస్తే చోరగుడి గారు మంచి కథలు రాయగలరు. పాత్రలచేత పేజీలు పేజీలు అసందర్భంగా మాట్లాడించకుండా ఉంటే ఇంకా మంచి కథలు రాయగలరు. "దీనికి పాత సాఫ్ట్ వేరే పనిచేస్తుంది" కథలో "పరిధులుదాటి పెరుగుతున్న జిం కల్చర్ లో క్రమంగా మనయువకుల దేహదారుఢ్యం పెరుగుతూ ఉంటే, మనో వైశాల్యం తగ్గుతూ వస్తుంది. ఆపైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ నెట్వర్క్, వారి మనిష్కాలమీద పెరుగుతున్న వత్తిడి వారు దానికి తట్టుకోగలిగే స్థాయిలను దాటి మించిపోతూ ఉంది." అని రాశారు చివరి ఉపన్యాసంలో. ఈ వ్యాఖ్యానాలకూ కథకూ ఎలాంటి సంబంధమూ లేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మనో వైశాల్యం తగ్గుతుందని చెప్పిన కథా నాయకుడు, " మనకంటే మన తర్వాతి తరంలో నిజాయితీ ఎక్కువ," అంటాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మనోవైశాల్యం తగ్గుతుందనటానికి నిదర్శనం ఏంటో, మనో వైశాల్యం తగ్గటానికీ నిజాయితీ పెరగటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, అసలు వీటికీ కథకూ సంబంధం ఏమిటో నాకైతే అర్ధం కాలేదు.
అసలు ఇలాంటి అసందర్భ ప్రసంగాలు మానేసి కొంచెం నిగ్రహం పాటించి కథను సరయిన చోట ముగిస్తే చోరగుడి గారు ఇంకా మంచి కథలు రాయగలరని నా అభిప్రాయం.
వంశీ,
మీ అభిప్రాయం చదివాను. మిత్రా, ప్రసన్న ల సంభాషణ కథ కు లీడ్ అయితే ఇంత గొడవే వుండకపోను. అనుక్షణికం, పాకీజా ల ప్రస్తావన కూడా కథకు అతకకపోవటం మరింత చికాకు తెప్పించింది.
జాన్సన్ చోరగుడి కధ ‘ ఆ మీటింగ్ జరగలేదు ‘ పై Crazyfinger పంపిన ప్రతిస్పందన ఇక్కడ చదవండి. కథ ని చదివి ఇంత వోపికగా తన అభిప్రాయాన్ని తెలియ చేసిన Crazyfinger కి ధన్యవాదాలు. ఈ కామెంట్ కొంచెం పెద్దది అవటం వల్ల రెండు భాగాలు గా పెట్టాల్సి వస్తోంది. గమనించండి.
I've been reading your post on the Johnson Choragudi story on Sakshi. First of all, let me say that the manner of your moderation of the comments and the discussion is very encouraging. By that I mean that you do a very good job of keeping the discussion on point and discouraging the trolls. Often I experienced in the past that the trolls and "off-topic" and ad-hominem attacks etc., have a way of hijacking the discussion - just as a squeaky wheel gets all the grease - but I haven't yet seen that on your blog. Encouraging.
With that minor point out of the way, I wanted to share my thoughts about this post. Still not sure if I can really write an intelligent piece in Telugu so I am sending you this in English instead of posting it on your blog. Someday I'll spend enough time re-practicing my written Telugu and then watch out...! :- )
Actually I thought the story could have gotten better with some more editing. I got terribly confused at first but tried to figure out why I was confused. Here is what I think is going wrong with the story.
1) The confusion starts with the very first sentence. The Prasanna character says something about someone and there it ends abruptly without any follow up. From experience I know that we as readers are like little chicks; whatever we read in the very first sentence, or first paragraph, is what we tend to follow throughout the story in our minds. It was only after half-way through I realized the first sentence serves no purpose other than starting the scene.
2) By saying "avatala phonlo Prasanna..." and "ivatala Mitra..." the reader is shown that the viewpoint is from Mitra. At least I construed the viewpoint as Mitra, since she is the near-most character. But at the end of the dialog the viewpoint changes to Prasanna. This is when the sentence goes, "avatala phonlo...Mitra..." Changing the viewpoints is not an issue, but if the reader is plunged in confusion as a result of it, then it is not done properly because it didn't carry the reader with it. Also I don't see a reason why viewpoint should be changed. There is no compelling reason for it in this scene.
3) The next paragraph with background information adds more confusion. When Mitra says to Prasanna about the cell phone bill, I had to go back and read again, thinking they are both in different cities. But there is no indication they are. It is Chinnoo who is in Bangalore. In fact we don't know at this stage if Mitra and Prasanna are in same city or not. But one will assume that since Mitra is talking about ten thousand rupees cell phone bill they are in different cities. If they are in same city, the local calls wouldn't be costing so much money, right? Even I know that...! :- )
4) Moreover, later after a few lines the author shows Prasanna works for an NGO. Then what does Mitra mean about "company" when she was talking about cell phone bill? The sensibility of the character Mitra is not believable. People do not simply consider NGO to be "companies," let alone companies to which you can submit a bill of thousands of rupees for cell phone calls. May be I am nitpicking here.
5) Next I assume it is Mitra speaking about Prasanna, talking about Nizam college etc.
(కంటిన్యూడ్.....)
6) In any case, other than these editing "fixes," if the author had inserted an element or two about why this conversation is important to the later 3pm meeting scenes, it would've been more illuminating.
7) The descriptions and stuff about a presumed gay person Prasanna sees during her morning walk are quite offensive and stereotypes. I don't believe the author has a humanistic understanding of what it means to be a gay. All that stuff about Vandana's feet, or Meenakumari's feet...comes across as nothing more than an abstract view of a woman who is there only to satisfy this man's romantic desires. I am so often reminded of this following phrase I read long long time ago: "He looked at her with ardent eyes, stepped closer, embraced her with passion and whispered, "how beautiful I am.""
This story could've turned into an interesting one if the author had manipulated the 3pm meeting discussion to show how arbitrary these notions of conventional morality are. But I think the author himself is probably behind his times.
8) Another minor editing snafu: when Harsha comes in, the author already flagged that he brought rain with him, but the next line repeats it.
9) The talk about formative age. If this story is about gay people, then the author seems to insinuate that being gay is something that you can wean people away from during their formative ages. I am not sure if people agree with this.
10) What was that about "feminism"? High-heels, feminism...how are they really related anyway? I don't get it. And what's that about body language of girls?
11) The last bit about Jehova in the garden of Eden. There was no Jehova in the Genesis which is in the Old Testament. Jehova is in New Testament. This may be a minor error, but one ought to get facts right, otherwise one loses credibility. But could it be that in India Jehova is used synonymously with God in Genesis?
Crazyfinger
Crazyfinger బ్లాగ్ ఇది . http://www.pavada.in/
Post a Comment