నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, February 28, 2010

నవ భావ శిల్పం 'ద్రౌపది' --- బేతవోలు రామబ్రహ్మం

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ద్రౌపదీ నవలను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ కు ఎంపిక చేసిన ముగ్గురు న్యాయనిర్ణేతలల్లో ఒకరు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం .ఇన్నాళ్ళుగా ఆ పుస్తకం పై సాగుతున్న వాద వివాదాలు, రచ్చలు, రగడలు చూస్తూ పెదవి విప్పకుండా మౌనం గా ఉన్న న్యాయ నిర్ణేతల్లో ఒకరైన రామబ్రహ్మం గారు ఇప్పుడు ద్రౌపదీ గురించి ఈ వ్యాసం రాశారు. మార్చ్ 1, సోమవారం ఆంధ్రజ్యోతి వివిధ లో ప్రచురితమైన ఈ వ్యాసం ఇక్కడ చదవండి.

తెలంగాణా లో ఇటీవల సంభవించిన మరణాలపై అఫ్సర్ కవితా “ కొన్ని మరణాలు “ ఇక్కడ చదవండి.

విశిష్ట జానపద సాహిత్య పరిశోధకుడు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ఇటీవల మృతి చెందారు. ఆయనకు నివాళీ ఆర్పీస్తూ వరవరరావు గారి నివాళి ఇక్కడ, ఆవుల మంజులత గత వారం రాసిన వ్యాసం ఇక్కడా చదవండి.
‘ కనక ప్రవాసి’ గా తెలుగు సాహిత్య లోకంలో సుపరిచితులైన చామర్తి కనకయ్య గారు మరణించినట్లు సాక్షి లో రాపాకా ఏకాంబరాచర్ర్యులు రాసిన చిన్న నివాళి వ్యాసం వల్ల తెలిసి బాధ కలిగింది.

కనక ప్రవాసి మృతి కి నివాళి

‘ కనక ప్రవాసి’ గా తెలుగు సాహిత్య లోకంలో సుపరిచితులైన చామర్తి కనకయ్య గారు మరణించినట్లు సాక్షి లో రాపాకా ఏకాంబరాచర్ర్యులు రాసిన చిన్న నివాళి వ్యాసం వల్ల తెలిసి బాధ కలిగింది.

కనక ప్రవాసి కథా రచయత. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పట్టభద్రులు. ఆయన కథానికల పుస్తకం “ అద్దానికి అటూ ఇటూ” , అనువాద కథల పుస్తకం “ ఒప్పందం” కి మంచి పేరు వచ్చింది. అయితే కనక ప్రవాసి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆయన కథల కంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మీద ఆయన చేసిన పరిశోధన. ఈ పరిశోధన ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆయన రీసెర్చ్ అంశం “ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథల సమగ్ర సమీక్ష “ 1986 లో ప్రచురితమై విమర్శకుల ప్రశంసలనందుకున్నది.

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు లో అక్టోబర్ 24,1933 న జన్మించిన కనకయ్య తెలుగు లెక్చరర్ గా, ప్రిన్స్ పాల్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఫిబ్రవరి 21 న కాకినాడ లో కనకప్రవాసి మరణించారు.

6 వ్యాఖ్యలు:

అగంతకుడు said...

చాలా మంది ఇవరణ ఆశించారు. ఇప్పుడొకటొచ్చింది. దీన్నీ ఎలా ఇభేధిస్తారో చూద్దాం!

Kalpana Rentala said...

ఎవరు ఏం గొడవ చేసినా యార్లగడ్డ గారు అవార్డ్ కూడా తీసేకున్నారు. కాబట్టి ఇప్పుడు వాగ్యుద్ధాలు తప్ప చేయటానికి ఏమీ లేదు. మిగతా న్యానిర్ణేతలు కూడా నెమ్మదిగా నోరు విప్పి ఏదైనా విషయం ( ఇప్పటి దాకా బయటకు రాని, బయటకు చెప్పని ) చెప్తారేమోనని ఎదురుచూద్దాము.

రవి said...

కృతజ్ఞతలు.

బేతవోలు వారి వివరణ యార్లగడ్డ వారిని పూర్తీగా సమర్థిస్తున్నట్టు లేదు. అలాగని విభేదిస్తున్నట్టూ లేదు.

"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్" - ఇది భారతం మీద ఉటంకింపబడ్డ వ్యాఖ్యా? దండి దశకుమారచరితం మీద చెప్పినదా అని ఓ చిన్న అనుమానం. పండితులకే తెలియాలి.

కొత్త పాళీ said...

హమ్మ్. ఆ తరం అంతా అతివేగంగా నిష్క్రమిస్తోంది.
కనకయ్యగారి పరిశోధన చదవలేదు గానీ, మరుగున పడిపోయిన శ్రీపాద వారి ఎన్నోకథలని వ్యయప్రయాసల కోర్చి సేకరించి వెలుగు చూపించారని చదివానెక్కడో. ఆ లెక్కన తెలుగుజాతి ఆయనకి చాలా ఋణపడి ఉంది.

మనోజ్ఞ said...

బేతవోలుగారు రాసింది చదవాను కానీ నాకు సమగ్రంగా అనిపించలేదు. బేతవోలు దగ్గర నేను ఎంఫిల్ చేశాను. అయితే ఆయన యార్లగడ్డ ద్రౌపది గురించికంటే భారతం గురింిచ ఎక్కువ వివరణ ఇచ్చారనపించింది. మీరేమంటారు. నాకు ఒక బ్లాగు ఉంది.manognaseema.blogspot.com మీకు వీలయితే ఒకసారి చూడండి

Kalpana Rentala said...

కొత్తపాళీ,
అవును. కనకప్రవాసి అనగానే శ్రీపాద వారి కథల మీద ఆయన నిరంతర పరిశోధన గుర్తుకు వస్తుంది. మనం మంచి రచయితలనీ, పరిశోధకుల్ని క్రమేణా కోల్పోతున్నాము.
మను,
బేతవోలు గారి రచనలు , ఆయన వ్యాస గౌతమి ( పేరు అదే అనుకుంటాను) లాంటివి నాకిష్టం కానీ , ఇది ఆయన తన పాండిత్యాన్ని ప్రదర్శించేందుకు రాసినట్లు అనిపించింది.

 
Real Time Web Analytics