నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, February 15, 2010

అఫ్సర్ కవిత్వ పుస్తకం “ ఊరి చివర “ పై ఈనాడు లో సమీక్ష





స్మృతులు...వేదనలు!

అఫ్సర్‌ కవితలతో మన జ్ఞాపకాల్ని మనమే తవ్వుకున్నట్టు, మన ఎదలోతుల్ని మనమే తడుముకున్నట్టు... అదో ప్రపంచంలోకి వెళ్లిపోతాం. బలమైన వూహాశీలత, సృజనాత్మక ఉద్విగ్నతలు అనుక్షణం వెంటాడతాయి. 'గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు/గుక్కెడు నీళ్లే జాతీయగీతం మాకు' అన్న 'ఎడారి నుంచి కాస్త తడి'లో కనిపించేది కంటతడే. 'ముక్కలయిన పగుళ్ల కొసల్లోంచి/వొలికి వొలకని రక్త చారికనై రాలిపోతానింక'... గుండె చెదిరే 'బాడీ లాంగ్వేజ్‌' దృశ్యం! 'ఒక సూఫీ సాయంత్రం'లో 'ఎవరూ కనిపించడంలేదు/కత్తులు తప్ప/ఏమీ వినిపించడం లేదు/కొస ప్రాణం అరుపులు తప్ప'. 'నాదో/ప్రాణాంతక జననయుద్ధం/వాయిదా వెయ్యలేను/ఇలాగేలే అనీ ఉండలేను' అంటాయి 'రెండంటే రెండు మాటలు'. 'నాదంతా నెత్తుటి తలబోత/అప్పుడప్పుడూ ఈ నెమలీకల్ని మరిచిపోతే బాగుణ్ణు'... అంతరంగాలను తడిమిన 'నెత్తుటి నెమలీక'. 'ఇప్పుడు మనం తిరుగుతోంది/కేవలం గులకరాళ్ల మధ్యనే!'...నిజం చెప్పేసిన 'వొకానొక అసందర్భం'. గతం, వర్తమానం అటుఇటుగా తూగేవేళ కదలాడే స్మృతులే జీవితమైతే... అదే అఫ్సర్‌ కవిత్వమనిపిస్తోంది.






వూరి చివర (కవితాసంకలనం); రచన: అఫ్సర్‌; సంపాదకుడు: గుడిపాటి పేజీలు: 142; వెల: రూ.60/-; ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌ 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్‌ మలక్‌పేట, హైదరాబాద్‌-36.
ఫోన్ నెంబర్ 9848787284



- జి.వి.ఎన్‌.మూర్తి

9 వ్యాఖ్యలు:

కెక్యూబ్ వర్మ said...

మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.

Crazyfinger said...

Congratulations Afsar...!

CF

నిషిగంధ said...

అఫ్సర్ గారికి అభినందనలు :-)

Malakpet Rowdy said...

Congrats Afsar

Anwartheartist said...

లొపలి కవిత్వం గురించి తెలియదు కాని,లక్ష్మన్ గారి బొమ్మ మహాధ్భుతం , ఇంత గొప్పబొమ్మను కవర్ పేజి పొందిన అప్సర్ గారు నిజంగా ధన్యులు. జయ్ హొ లక్ష్మన్.

అక్షర మోహనం said...

chadivaanu..konni tadi chesaayi.
konni chadi chesaayi. 'oori chivara' undanivvaledu

కొండముది సాయికిరణ్ కుమార్ said...

ఎందుకో మూర్తిగారు మనసు పెట్టి సమీక్షించలేదనిపిస్తుంది.
Congrats Afsar gaaru.

భావన said...

బాగుంది. Congratulations Afsar garu. You Deserve it.

ANANTH said...

మీ బ్లాగు చాలా చాల బాగుంది.....చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ......కవితలు చాలా చాలా భగున్నాయ్

 
Real Time Web Analytics