నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, May 25, 2010

అమ్మ చెప్పిన కథల కోసం అన్వేషణ!


అమ్మ చేతి గోరుముద్దలు తినని వారు, అమ్మ చేత కథ చెప్పించుకొని వినని వారు బహుశా భూప్రపంచం లో ఎవరూ వుండరేమో! అమ్మ చెప్పిన అచ్చమైన తెలుగు కథ ఎలా వుంటుందో , తీపిదనం రుచి మళ్ళీ చూపించారు రవికిరణ్ తమ్మిరెడ్డి మధ్య నాకు మైల్ లో . అమ్మ చెప్పిన అసలు సిసలు తెలుగు కథలు మళ్ళీ చెప్పించుకోవాలని, చదువుకోవాలని, మన పిల్లలకు మళ్ళీ కథలు చెప్పాలన్న కోరిక లేనిదేవరికి? అందుకే అమ్మ చెప్పిన తెలుగు కథలు ( కేవలం తెలుగు కథలే సుమండీ!) సేకరించాలని ఒక చిరు ప్రయత్నం శీర్షిక. మీకు మీ అమ్మ చెప్పిన కథ గుర్తుంటే రాసి పంపండి. మీ బ్లాగ్ లోనే ప్రచురిస్తే ఇక్కడ లింక్ ఇవ్వండి. ఏదైనా సరే, మళ్ళీ చిన్న పిల్లలై అమ్మ వొడిని, గోరుముద్దల్ని, వెండి గిన్నెలో పెరుగన్నాన్ని, ఆకాశాన చందమామని, ఆరు బయట నులకమంచం మీద పడుకొని ఆకాశం లో నక్షత్రాల్ని లెక్కపెట్టుకున్న తీపి జ్నాపకాన్ని, మనం ఎటు నడిస్తే అటు నడిచి వచ్చి చందమామయ్య మనల్ని అబ్బురపరిచిన వైనాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుందాము.

ఒక అద్భుతమైన తెలుగు కథ కోసం, లోకం మర్చిపోతున్న మంచి రచయితల కోసం చూస్తున్నానని చెపితే, మీరు అద్భుతమైన కథ కోసం చూస్తుంటే , నేను సామాన్యమైన తెలుగు కథ కోసం చూస్తున్నానని చెప్పి ఈ కథ పంపించిన రవికిరణ్ కి ధన్యవాదాలు.

ఈ శీర్షిక లో మొదట గా రవికిరణ్ తమ్మిరెడ్డి కి వాళ్ళ అమ్మ చెప్పిన అచ్చమైన తెలుగు కథ పేను కథ ని చదవండి. ఈ కథలతో అమ్మలందరికీ జేజేలు.
పేను కథ చెప్తున్నది రవికిరణ్ తమ్మిరెడ్డి
మా అమ్మ నా చిన్నప్పుడు నాకు చాలా కథలే చెప్పింది. కథలన్నీ నేను నా కూతురుకి చెప్పేను. అన్ని కథల్లోనూ ఒక్క పేను కథ మాత్రవే అథంటిక్ తెలుగు కథ. మిగిలినవన్నీ మాయమ్మ తను చదివిన ఆంగ్ల పాఠాల్ని తెలుగు చేసి మాకు చెప్పింది. నా కూతురురికి ఇప్పుడు పదిహేనేళ్ళు, నేనాపిల్లకి ఇవి ఆంగ్ల కథలు, ఇవి తెలుగు కథలు అని చెప్ప లేదు. మా అమ్మ చెప్పిన కథలన్నీ పిల్లకి చెప్పేను. తెలుగు, ఆంగ్లం కలగలిపి. కానీ ఇప్పుడు పిల్లకి పదిహేనేల్లోచ్చినా, నువ్వది రైటంటే అది రాంగనే టీనేజి వయసొచ్చినా, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నానా పేను కథ చెప్పవా అని అడుగుతుంది. అదీ, అచ్చ తెలుగు కథ కున్న బలం.


ఒక
పేను, చక్కగా పెసర చేను వేస్తుంది. చేను ఎదిగిన తర్వాత, పెసలన్నీ ఊర్స్చి, వాటిల్తో పెసరట్లేస్తుంది. సరే పెసరట్లేసేం కదా అని, దేశపు రాజుకి కూడా ఇస్తావని కొన్ని పెసరట్లని బాక్సులో పెట్టుకుని బయలుదేరుతుంది. పేను అలా రాజు గారి దగ్గరకు పోతావుంటే, మొదట ఒక తేలొస్తుంది, పేను, పేను నాకొక పెస్రట్టియ్యవా, నేను కూదా నీకుతోడుగా రాజు గారి దగ్గరకు వస్తా అంటుంది. సరే అని అని పేను తేలుకొక పెసరట్టిస్తుంది. తర్వాత ఒక పులి, ఒకబండ రాయి, ఒక పావు అలాగే అడిగి పేనుతోపాటు రాజుగారి దగ్గరకు పోతాయి. రాజు గారి దగ్గరకి పోయిన తర్వాత, ఆయన భవనం ముందు నిలబడి పేను సేవకుడి ద్వారా రాజు గారికి తనోచ్చిన విషయం తెలుపుతుంది. కానీ రాజుగారు, అహే, పేను చేసిన పెసరట్లని, రాజుని నేను తీసుకోవడవేంది అని, అవమానంగా తలచి, ఛీ అంటాడు. పాపం పేనుచాలా అవమానం ఫీల్లవుతుంది. ఒరే రాజు నేను పేనుని, చిన్న ప్రాణిని అనేగదా నువ్వు నన్నిలా అవమానించావు, సరేనీ సంగతి చూస్తా అనుకుంటది. ఒసే తేలు నువ్వు పొయ్యి రాజు దువ్వెన పెట్టుకునే గూట్లో వుండు. పావు నువ్వు భవనం వెనక ద్వారం దగ్గర వుండు. పులి నువ్వు ముందర ద్వారం దగ్గర వుండు. బండ రాయి నువ్వు భవనంప్రక్క ద్వారం ముందున్న పందిరి మీద వుండు అని చెప్తుంది. చెప్పి సక్కా పొయ్యి రాజు గారి తల్లో చేరి కుట్టటం మొదలుపెడ్తుంది. అబ్బా జిలగా వుందని రాజు గారు దువ్వుకోడానికి దువ్వెనకోసం గూట్లో చెయ్యి పెడ్తే తేలు చటుక్కున కుడ్తుంది. అబ్బా తేలు కుట్టింది అని ముందర ద్వారం ద్వారా రాబోతే పులి అంటుంది, వెనక ద్వారం ద్వారా రాబోతే, పావుకాటేస్తానంటుంది, సరే అని ప్రక్క ద్వారం ద్వారా రాబోతే, బండరాయి నెత్తిన పడుతుంది. అప్పుడు రాజుకి విషయంతెలుస్తుంది. పేనుకు క్షమాపనలు చెప్పి, సన్మానాలు చేసి పంపిస్తాడు. ఇదీ కథ. అమ్మ చెప్పిన, అచ్చ తెలుగు కథ. దీంట్లో ఏవుంది, వుందో నాకు తెలీదు. నా మధ్య వయస్సులో నా చిన్నప్పుడు మాయమ్మ చెప్పిన కథ నాకింకాగుర్తుంది. టీనేజొచ్చిన నా కూతురు ఇంకా అప్పుడప్పుడూ ఎప్పుడన్నా నానా నాకు పేను కథ చెప్పవా అనిఅడుగుతుంది.

26 వ్యాఖ్యలు:

కొత్త పాళీ said...

మంచి ప్రయత్నం. బోలెడు కథలొస్తాయని ఆశిద్దాం

lalithag said...

అమ్మమ్మ చెప్పిన కథ పరవాలేదంటే ఇక్కడ "పుటుక్కు జర జర" కోసం చూడగలరు.
http://telugu4kids.com/stories.aspx

రవికిరణ్ తమ్మిరెడ్డి గారు చెప్పిన కథని ఈ నాటి పిల్లలు చెప్పడం ఇక్కడ:
http://kottapalli.in/2010/03/%E0%B0%AA%E0%B1%87%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B8%E0%B0%B0_%E0%B0%9A%E0%B1%87%E0%B0%A8%E0%B1%81

మధురవాణి said...

కల్పనా గారూ,
మీ ఇరువురి ఆలోచన చాలా బాగుంది. నేనో పోస్టు రాశాను నా బ్లాగులో. ఓసారి చూడండి.
http://madhuravaani.blogspot.com/2010/05/blog-post.html

@ రవికిరణ్ గారూ,
ఈ పేను కథ నాక్కూడా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందండీ!

రవి said...

బావుంది. మంచి ప్రయత్నం.

సుభద్ర said...

chalaa chaala manchi alochana..nenu rasi pamputaanu..

AMMA ODI said...

బోల్డు బొచ్చెడు బాగుంది. మరిన్ని కథలొస్తే ఇంకా బాగుంటుంది.

జ్యోతి said...

కల్పన..

ఈ టపాను చదివి మా నాన్నమ్మ చెప్పిన కధ రాసాను. ఇదొక్కటే నాకు గుర్తుంది మరి..

వేణూ శ్రీకాంత్ said...

బాగుంది.. మరిన్ని కథలకోసం ఎదురుచూస్తూ :-)

వేణూ శ్రీకాంత్ said...

బాగుంది.. మరిన్ని కథలకోసం ఎదురుచూస్తూ :-)

Kalpana Rentala said...

నోట్: చాలా మంది మైల్స్ ఇస్తున్నారు అమ్మ చెప్పిన కథలు అంటే కేవలం అమ్మ మాత్రమే చెప్పి వుండాలా? నాన్న చెప్పిన కథలు ఇందులో రావా? లేదా అమ్మమ్మ , తాతయ్య లు చెప్పిన కథలు ఈ సిరీస్ లో రావా? అని.
పిల్లలు మొదట తల్లి దగ్గర కథలు చెప్పించుకుంటారు అన్నది జనసామాన్యం. కనీసం తల్లి దగ్గర ఒకటి, రెండు కథలైనా చెప్పించుకొని వుంటాము. ఆ ఉద్దేశం తోనే అమ్మ చెప్పిన కథలు అని పెట్టాను. అయితే ప్రధానం గా ఈ శీర్షిక ఉద్దేశం మనం చిన్నప్పుడు, మనలో ఇంకా పసితనపు అమాయకత్వం వదిలిపోనప్పుడు , విన్న ప్రతి కథా నిజంగా జరిగుతోందనో, జరుగుతుందనో బలంగా నమ్మిన రోజుల్లో విన్న కథల్ని పదిలం గా మళ్ళీ గుర్తు చేసుకొని మరో తరానికి అందించే ప్రయత్నం. మొదట అమ్మ నోటి వెంట విన్న కథ లేమైనా వుంటే గుర్తు చేసుకుందాము. మీకు నాన్న చెప్పిన కథ గుర్తుంటే అది, నాన్నమ్మ, తాతయ్యలు మాలిమి చేసి మరీ అన్నం తినిపిస్తూ చెప్పిన కథలు గుర్తుంటే అవీ, మామయ్యలో, అత్తయ్యలో, స్కూల్లో మాస్టర్ గారు క్లాస్ లో చెప్పిన కథ గుర్తుంటే అవి కూడా రాయండి . అవన్నీ బాల్యం కథలు. మనకు కథ చెప్పిన ప్రతివారిలో మన పసితనాన్ని ప్రేమించే ఒక మాతృత్వం వుంటుంది. మనకు లోకపు ద్వారాలు తెరిచి చూపించే ఒక ఆత్మీయత వుంటుంది. పిల్లల్ని ఎదగనిచ్చే క్రమంలో మనకు కలలు కనటాన్నీ నేర్పిస్తూ మన బాల్యాన్ని ఒక మధుర జ్నాపకం గా మిగిల్చే ఒక ఆకాంక్ష వుంది.
ఆ కథల్ని గుర్తుచేసుకోవటం, అందరమూ కలిసి పంచుకోవటం వల్ల మళ్ళీ మనం ఒక బంగారు బాల్యాన్ని సృష్టించుకుందాము.
@కొత్తపాళీ,మధురవాణి,లలిత, సుభద్ర,జ్యోతి, వేణూశ్రీకాంత్, రవి,అమ్మవొడి అందరికీ ధన్యవాదాలు.

lalithag said...

కల్పన గారూ, నేను మీ టపాకు వ్యాఖ్య రాసాక మొదలైన జ్ఞాపకాల పరంపర ఈ టపా రాసే దాకా నన్ను ఊరుకోనివ్వలేదు.
http://balasahityam.blogspot.com/2010/05/blog-post_26.html

జయ said...

కల్పన గారు, నేను కూడా మా అమ్మ చెప్పిన కథ, నా కెంతో నచ్చిన కథ రాసాను. చూడండి మరి.

Kalpana Rentala said...

గుర్తు తెచ్చుకొని చిన్నప్పుదు విన్న కథలురాస్తున్న వారందరికీ క్రుతజ్ఞతలు. దయచెసి మీరు మీ బ్లొగ్ లొ రాసె కథల లింక్ ఇక్కద ఇవ్వదం మాత్రం మర్చిపొవద్దు. ఈ అమ్మ చెపిన కథలన్నింతినీ ఒక చొత సంకలనం చెయాలని ఆలొచన.

హారం ప్రచారకులు said...

Kalpana Rentala గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

శ్రీలలిత said...

కల్పనగారూ,
నమస్కారం. చిన్నప్పుడు విన్న కథల గురించి మళ్ళీ గుర్తు చేసుకోవడం ఆనందంగా వుంది. నాకు గుర్తున్న కథల్లో ఒకటి పంపుతున్నాను. పరిశీలించగలరు..
శ్రీలలిత.

మధురవాణి said...

కల్పనా గారూ,
నేను ఇంకో కథ కూడా రాశాను నా బ్లాగ్లో. మిరపకాయ్ పొట్టోడి కథ..చూడండి ఓ సారి.
http://madhuravaani.blogspot.com/2010/05/blog-post_7927.html

మాలా కుమార్ said...

నేనూ ఓ బుజ్జి కథ రాసానండి . మళ్ళీ ఇంకొన్ని రాసేందుకు ప్రయత్నం చేస్తాను .

http://sahiti-mala.blogspot.com/2010/05/blog-post_30.html

మాలా కుమార్ said...

కల్పన గారు ,
ఇందాక నేనిచ్చిన లింక్ కాస్త మారిందండి . ఇది కొత్త లింక్ అండి .
http://sahiti-mala.blogspot.com/2010/05/blog-post_7966.html

మాలా కుమార్ said...

కల్పన గారు ,
ఇది గోనండి ముచ్చటగా మూడు కథలు రాసానండి . ఇలా నాతో కథలు చెప్పించుకుంటునందుకు బోలెడు థాంకూ లండి .
http://sahiti-mala.blogspot.com/2010/06/blog-post_05.html

మందాకిని said...

మధురవాణి గారు చెప్పిన మిరపకాయ్ పొట్టోడు కథ నాకు తెలిసి ఇలా ఉందంటే మీ బ్లాగులో లింక్ ఇవ్వమంది తను. మీకు ధన్యవాదాలు. తృష్ణ గారు చెప్పిన ఈగ కథ గురించి నేను పోయినేడు ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. ఇక్కడ చదివేసరికి సంతోషం వేసింది. మాలా కుమార్ గారు చెప్పినట్టు ఈ కాలం పిల్లలు భలే తెలివైన వాళ్ళండోయ్. సూది కథ చెప్పినపుడు మా బాబు తడుముకోకుండా కొత్త సూది కొంటే సరి అనేసి నాకు షాకిచ్చేవాడు.
http://paarijatam.blogspot.com/2010/06/blog-post.html
ఇదీ నా బ్లాగు లింక్.

సుభద్ర said...

కల్పనగారు,
నేను ఎన్నో కధలు గుర్తు చేసుకున్నాను..మీ పోస్ట్ చదవగానే నాకు అక్షర౦ పొల్లుపోకు౦డా చప్పున గుర్తు వచ్చిన కధ నా బ్లాగ్ లో రాశాను..లి౦క్ ఇక్కడ ఇస్తూన్నాను..
http://vaalukobbarichettu9.blogspot.com

sowmya said...

కల్పనగారూ నా వంతుగా రాసిన చిన్నప్పటి కథలు....చూడండి.

http://vivaha-bhojanambu.blogspot.com/2010/06/blog-post_09.html

మందాకిని said...

మా అమ్మ కథలు కబుర్లు పేరుతో శ్రీ గారు చెప్పే కథలు ఇక్కడ..
http://sreesai24.blogspot.com/2009_06_09_archive.html

సుభగ said...

కల్పనా గారూ,

మీ ఆలోచన చాలా చాలా బాగుందండి.
నా వంతుగా ఒక కథను రాసాను నా బ్లాగులో.
http://idhiadhi.blogspot.com/2010/07/1.html

Kalpana Rentala said...

సుభగ, తప్పక చూస్తాను.

మందాకిని గారు, మీరు చెప్పిన పోస్ట్ చూసాను. కొంచెం వీలు చిక్కగానే మీరంతా మీ బ్లాగ్స్ లో పెట్టినవి మీ అనుమతి తో తీసుకొచ్చి ఇక్కడ కూడా పెడతాను. అన్నీ ఒక చోట చేర్చాలని నా ప్రయత్నం. దానికి మీరంతా ఇస్తున్న సహకారానికి చాలా చాలా ధన్యవాదాలు.

సుభగ said...

కల్పనా గారూ,

మరో కథ!

http://idhiadhi.blogspot.com/2010/07/2.html

 
Real Time Web Analytics