ఆమె రహస్యం!
“ మీ ఇల్లు చూపించు” అన్నది ఆమె
మేము ఇంటి తలుపులు తెరవగానే.
ఇప్పుడు, ఎనిమిదో రోజు
ఇల్లంతా శూన్యం
మౌనం గా, నెమ్మదిగా,
వీడ్కోలు చెప్పటానికి నిరాకరిస్తూ
అది నా ఇల్లు
ఆమె వచ్చినప్పుడు
కానీ ఆ వీడ్కోలు తో
ఆమె వదిలి వెళ్లింది మా యింటిని
ఆ ఆగమన , నిష్క్రమణ తేడాల మధ్య
ఇప్పుడు నేను
మౌనం గా, నిశ్శబ్దం గా కూర్చొని
ఆమె రహస్యాన్ని తెలుసుకుంటూ
మూలం: క్రేజీ ఫింగర్
అనువాదం: కల్పనారెంటాల
2 వ్యాఖ్యలు:
అనువాద రహస్యం తెలిసాక, మౌనం-మాట ఔతుందికదా..! ఆమె దాచుకున్న రహస్యం, శూన్యమైన
గదినిండా పరచుకొనిఉంది.
కల్పనగారు - మెనీ మెనీ థాంక్స్ ఈ నా poem ని మీరు translate చేసినందుకు. దాదాపు రెండేళ్ళు అయ్యినప్పటికి మీ translation చదువుతూ ఉంటె నేను మళ్ళీ కొత్తగా ఈరోజే రాసినట్టు ఉంది. ఇంకోమాట ఏంటంటే, మీ తెలుగు translation చదివిన తరువాత ఈ poem తెలుగులోనే బాగున్నట్టు అనిపిస్తూ ఉంది. Perhaps ఫీలింగ్స్ know their native language innately...thanks again...!
Regards - Crazyfinger
Post a Comment