నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, June 26, 2010

అనేక వాంఛలుఒక రాత్రి
ఒక వాంఛ
ఒక దేహం

మల్లెలు మనసై
జాజులు జావళీలై
కన్నులు కనకాంబరాలై
కలువలు కలలై
కన్రేప్పల పానుపు పై
మోహ ప్రవాహ దేహమై
దుఃఖ వస్త్రాల్ని తొలగించే
స్వప్న ధూప లతికనై

నేనే ఓ రాతిరి నై
నేనే మరో రాతిరినై
నేనే ఓ వాంఛ నై
నేనే మరో వాంఛనై
నేనే ఒక దేహాన్నై
నేనే మరో దేహాన్నై
విస్మృతావస్థనై
మెలకువ లోకి వచ్చా
***
పంచభూతాలే
పంచ ప్రాణాలే
పాంఛ భౌతికమే
ఎన్ని చెలమలో
ఎన్ని వాంఛలో!

ఒక్క రాతిరికి ఎన్ని రహస్యాలో!

స్వప్నమో
రాగమో
లీనమో
మోహామో
కోరికెప్పుడూ రాలిపడే వేకువ
వాంఛ ఎప్పుడూ వినిపించని కువకువ

ఇక రాతిరి దాచుకున్న
రహస్య జ్నాపకం ఈ దేహం!

3 వ్యాఖ్యలు:

astrojoyd said...

వాంచ్చ తూరుపు ,సకల జీవులకు అవసరం కాని కాంక్ష ..[అదే మోక్ష కాంక్ష ]పడమర .ఇది మనిషికి మాత్రమే అత్యవసరం కల్పానా జీ/చల్లా..జయదేవ్-చెన్నై-౧౭ [ఎన్ని చెలమలో అన్న పదప్రయోగం ,మీ కవితకి హైలెట్ ]

కొత్త పాళీ said...

చాలా బావుంది

Kalpana Rentala said...

జయదేవ్ , కొత్తపాళీ థాంక్స్.
జయదేవ్ గారు, మీ నాన్నగారు, మీ సిస్టర్ తెలుసు. బావున్నారని తలుస్తాను.

 
Real Time Web Analytics