ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అభిమానించి ఆదరించేవారందరిని ఇవాళ ఈ ప్రశ్న తొలిచివేస్తోంది. కారణం యోగి వేమన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వినోదిని జూన్ 28 సోమవారం ఆంధ్రజ్యోతి వివిధ లో రాసిన వ్యాసం “ క్లాస్ రూమ్ లో కళా ‘పోర్నో’ దయమ్!-” లో అశ్లీల కావ్యాలను సిలబస్ గా పెట్టొచ్చా? అంటూ సంధించిన ప్రశ్నలు. ( మూల వ్యాసాన్ని ఇక్కడ చదవొచ్చు)."
అసలీ కథకు పాఠ్యాంశం గా వుండే అర్హత ఏమిటి? కామోద్దీపనకు తప్ప జ్నానానికి ఏ మాత్రం ఉపయోగపడని కావ్యం ఇది.స్త్రీలను కించపరిచే, స్త్రీ వ్యతిరేకమైన అంశాలు, నడవడికనిసూచించే అంశాలు, భార్యగా స్త్రీ భర్తకు దాసిలా వుండాల్సిన భార్య భర్తల సూడో సంబంధాన్ని ఈ కావ్యం ప్రబోధిస్తుంది.పెళ్ళి ని కేవలం సెక్స్ దృష్టి లొంచే ఈ కావ్యం చర్చిస్తుంది. 16 వ శతాబ్దం లో రచించిన ఈ కావ్యం లోని ఆలోచనలు భావాలు అత్యంత పురాతనమైనవి." ఇవీ కళాపూర్ణోదయం కావ్యం గురించి స్థూలంగా వ్యాస రచయిత అభిప్రాయాలు .
అసలీ కథకు పాఠ్యాంశం గా వుండే అర్హత ఏమిటి? కామోద్దీపనకు తప్ప జ్నానానికి ఏ మాత్రం ఉపయోగపడని కావ్యం ఇది.స్త్రీలను కించపరిచే, స్త్రీ వ్యతిరేకమైన అంశాలు, నడవడికనిసూచించే అంశాలు, భార్యగా స్త్రీ భర్తకు దాసిలా వుండాల్సిన భార్య భర్తల సూడో సంబంధాన్ని ఈ కావ్యం ప్రబోధిస్తుంది.పెళ్ళి ని కేవలం సెక్స్ దృష్టి లొంచే ఈ కావ్యం చర్చిస్తుంది. 16 వ శతాబ్దం లో రచించిన ఈ కావ్యం లోని ఆలోచనలు భావాలు అత్యంత పురాతనమైనవి." ఇవీ కళాపూర్ణోదయం కావ్యం గురించి స్థూలంగా వ్యాస రచయిత అభిప్రాయాలు .
ప్రాచీన తెలుగు సాహిత్యం లో అధికశాతం శృంగార మయం అయినంత మాత్రాన అవి బోధనకు పనికిరావు , అందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు అనడం సరికాదు. కళాపూర్ణోదయం మీద వినోదిని చేసిన కామెంట్లు అర్ధ రహితమైనవి. శృంగారం ఎక్కువ పాళ్ళల్లో వుందనో, స్త్రీలను, కింది కులాల వారిని కించపరిచేవిధంగా వుందనో నిషేధించుకుంటూ పోతే ఇక తెలుగు సాహిత్యం లో చదవటానికి, తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, రసాస్వాదన చేయటానికి ఏమీ మిగలదు. సెన్సారింగ్ చేయబడటం లో వున్న కష్టానష్టాలు తెలిసి కూడా, ఇన్నేళ్ళ స్త్రీవాద, దళిత స్త్రీవాద ఉద్యమాల తర్వాత కూడా వినోదిని ఆ సెన్సారింగ్ కోరుకోవడం, ఆ దిశగా అడుగులు వేయడం కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశం.
ప్రాచీన తెలుగు సాహిత్యం మనకొక సాంస్కృతిక సంపద. దాన్ని గుర్తించి గౌరవించాలి.
ఒక చరిత్ర గా దాన్ని తప్పక చదువుకోవాలి కూడా. ప్రాచీన సాహిత్యాన్ని క్లాస్ లో బోధించేటప్పుడు ఇప్పటి సమాజానికి తగిన అంశాల్ని కూడా కలుపుకుంటూ ఒక రచనగా అప్పటి సాహిత్య సామాజిక అంశాల్ని చర్చించవచ్చు.అలా కాకుండా కళా పూర్ణోదయం లోని సుగాత్రి శాలీనుల శృంగారాన్ని కేవలం ఒక adultery గా ఆమె అభిప్రాయపడటం తప్పు.
" కళాపూర్ణోదయం రచన ఉద్దేశం లోనే " బూతు" వుంది. పైగా రచన మొత్తం కూడా విశృంఖల వర్ణనలతో, విచ్చలవిడి వాక్యాలతో వుంటుంది." అన్న వినోదిని ఆరోపణ కేవలం నిరాధారం. ఆమెకున్న అవగాహనారాహిత్యమనే చెప్పుకోవాలి. మొదట వినోదిని అర్ధం చేసుకోవాల్సిన అంశం రొమాన్స్ కి adultery కి వున్న తేడా. ఆలాగే 16 వ శతాబ్దం సాహిత్య, సామాజిక విలువల్ని ఇప్పటికి అన్వయించి, అంగీకరించమని ఎవరూ అడగరు. ఒక ప్రొఫెసర్ గా ఆ పని ఆమె చేయనక్కర లేదు. కళాపూర్ణోదయం లాంటి కావ్యాల్ని క్లాస్ రూమ్ లో బోధించేటప్పుడు వుండే ఇబ్బందులు అర్ధం చేసుకోదగ్గవి.అయితే అందుకు పరిష్కారం ప్రాచీన కావ్యాల నిషేధం కాదు. శృంగారం పాఠ్యాంశానికి పనికి రాదని చెప్పటం మరీ విడ్డూరం. అసలు తెలుగు ప్రాచీన కావ్యాలు , ప్రబంధాలు చదివే వారు తరం తరానికి తగ్గిపోతున్నారు, తెలుగు వాళ్ళకు తెలుగు సాహిత్యం గురించి కంటే ప్రపంచ సాహిత్యం గురించే ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారని ఒక వర్గం వారు బాధ పడుతుంటే, ఇప్పుడు విశ్వ విద్యాలయ స్థాయిలో కూడాప్రబంధాలు టీచింగ్ కి పనికిరావని వినోదిని లాంటి వారిది కేవల అర్ధ రహిత వాదన.
అసలు వాస్తవానికి కళాపూర్ణోదయం కావ్యానికి తెలుగు సాహిత్యం లో వున్న విశిష్ట స్థానం ఏమిటి? వినోదిని లాగా తెలుగు సాహిత్యాన్ని అకడెమిక్ గా కూడా క్షుణ్ణంగా చదువుకున్న వారు భ్రమపడుతున్నట్లు అందులో వున్నది కేవలం శృంగారమేనా? లేక ఒక సాహిత్య సృష్టి గా అందులో నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా వున్నాయా?
నేను ఎంఏ తెలుగు చేసిన విద్యార్ధిని కాదు కాబట్టి ఒక కావ్యం గా కళాపూర్ణోదయం గొప్పతనాన్ని వివరించి చెప్పలేను. అయితే నాకు అర్ధమైనంత వరకూ అదొక అద్భుత కథాకథనం. కథ ఎలా చెప్పాలి, కథ ని ఎలా నడిపించాలి? కథ లో మలుపులు ఎలా తీసుకురావాలి? లాంటి టెక్నిక్కులు తెలుసుకోవాలనుకుంటే పింగళి సూరన రాసిన కళాపూర్ణోదయం కావ్యం చదివి తీరాల్సిందే.
కళా పూర్ణోదయం కావ్యం కేవలం సుగాత్రి శాలీనుల కథ మాత్రమే కాదు. అది అందులో ఒక భాగం మాత్రమే. ఆ కథ లో పాత్రలు కేవలం ఒక కాలానికి సంబంధించినవి కావు. మూడు, నాలుగు జన్మలకు సంబంధించిన కథ. పాఠ్యపుస్తకం లో ఒక భాగం పెట్టాల్సి వస్తే ఏదో ఒక భాగం ఎంచుకోవాలి కాబట్టి సులువుగా అర్ధం కావటానికి సుగాత్రి శాలీనుల కథ పెట్టి వుంటారు. ఈ ప్రత్యేక కథ లో వినోదిని చెప్పినట్లు వారిరువురి మధ్య తొలి కలయిక కి సంబంధించిన వర్ణనలుంటాయి. అసలు ఈ కావ్యం లో శృంగార రసానికి సంబంధించి ఒక విశిష్టత వుందని చెప్తారు.. కవి నాలుగు రకాల శృంగారభావానల గురించి ఇందులో వర్ణిస్తాడు. మొదట బ్రహ్మ, సరస్వతుల మధ్య దివ్య శృంగారం. కలభాషిణి, మణికందరుల మధ్య గంధర్వ శృంగారం, సుగాత్రి, శాలీనుల మధ్య ప్రజాపత్య శృంగారం, సల్యాసురుడు, అభినవ కౌముది ల మధ్య రాక్షస శృంగారం. ఈ నాలుగు రకాల శృంగార స్వభావాల్ని సూరన తన అద్భుతమైన కథాకథన చాతుర్యం తో వర్ణించాడు.
ప్రాచీన సాహిత్యం లో చంద్రకాంతి తప్ప సూర్యకాంతి లేదన్న అపప్రధకు ఎదురు నిలబెట్టాలంటే ముందు మనకున్న అచ్చ తెనుగు ప్రబంధం కళాపూర్ణోదయం. పింగళి సూరన రాసిన రాఘవ పాండవీయం ధ్వర్ధి కావ్యాన్ని పంచ మహా కావ్యాల్లో ఒకటిగా చేశారు కానీ నాకైతే కళాపూర్ణోదయానికి ఆ గౌరవం దక్కి వుండాల్సిందనిపిస్తుంది. మిగతా ప్రబంధ కవుల్లో కనిపించని ప్రతిభా, అద్భుతమైన భావనా శక్తి, పాత్రోచిత పద్య రచనా అన్నీ ఈ కావ్యం లో కనిపిస్తాయి. ఈ కావ్య రచన ఉద్దేశం వినోదిని అభిప్రాయపడినట్లు బూతు కాదు. సూరన ఈ కావ్యానికి రాసిన సంకల్పం లోనే " సకల లక్షణ లక్షితంబైన మహా ప్రబంధం " తానెందుకూ రాశాడో చెప్పాడు. మామూలుగా ప్రబంధ కావ్యాల్లో నవరసాలు అన్నింటికి సముచిత స్థానం దక్కదు. ప్రబంధం లో ఎప్పుడూ శృంగార రసానికే ప్రాధాన్యత. కానీ సూరన తన కావ్యం లో అన్నీ రసాల్ని చూపించాలన్న పట్టుదలతో రాసిన కావ్యం కళా పూర్ణోదయం. అపూర్వ కథా సంవిధానం, కథాకథన చాతుర్యం గురించి తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ మళ్ళీ కళాపూర్ణోదయం చదువుతూ వుండాల్సిందే.తెలుగు భాష వున్నంత వరకూ పింగళి సూరన కు , కళాపూర్ణోదయం కావ్యామ్ రెండూ సజీవం గా ప్రజల హృదయాల్లో సుస్థిరం గా నిలిచి వుంటాయనటం లో ఎలాంటి సందేహం లేదు.
కళా పూర్ణోదయం కావ్యాన్ని తేట తెలుగులో కె.వి. ఎస్. రామారావు గారు చేసిన అనువాదాన్ని ఇక్కడ చదవచ్చు.
18 వ్యాఖ్యలు:
mIku ceppETaMtaTi vADni kAdu kAnI...
I have a cursory reading to the article. The prof who wrote that has a valid point. While kalapUrnOdayaM is a great thing, the point she was raising was, how does one young teacher teach these to 20-25 year old students. The dharma written in 16th century does not hold for now. You know in telugu vAcakaM of high school they clip some stanzas and print only those that help kids. Likewise may be they can clip some and/or insert vacanaM of some of the poems and edit the items.
COming to the point, assuming YOU are the teacher for 20-25 year students [I assume you are in 35-45range in age :-)] how would you explain the padyam and pratipadArdhaM of these poems? Would you be able to at least explain those to your husband when you are alone with him?
It is great kaavyaM alright but what the professor was raising ruckus was how does one muster enough guts to teach this.
Regards
I agree with the above comment,I can understand how inconvenient it is for a women to teach this subject to young students, but because of the inconvinece in teaching it is not right to avoid exploring our "PRACHEENA TELUGU SAHITYAM" and ignore our telugu literature and seeing it with a blind eye.
it is kind of disrepect we are giving to our greatest telugu poets, so i feel finding alternatives to learn/teach is will keep literature ALIVE!
అంతగా సిగ్గనిపిస్తే ఆవిడ గారు పుస్తకాన్ని అనవసరంగా ఆడిపోసుకోకుండా ఉద్యోగానికి రిజైన్ చేసి చిన్నపిల్లల బడుల్లో చెప్పుకోవడం బెటర్. అక్కడ కూడా సెక్సెజుకేషన్ వుంటుందేమో మరి. ఇబ్బందే. వయోజనులు వయోజనులుగా వ్యవహరించలేనప్పుడు, వృత్తి ధర్మం పాటించలేనప్పుడు ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. వృత్తి ధర్మం పాటిస్తున్నప్పుడు ఇష్టం వున్నా వుండకపోయినా కొన్ని సార్లు నిర్వికారంగా పనిచేసుకుపోవడం తప్పదు. అలా అని మనకు ఇష్టం లేనివన్నీ నిషేధిస్తూ పోవాలనుకోవడం కన్నా ఆ వృత్తి నుండి వైదొలగడం మంచిది.
వినోదిని గారు చెప్పే విషయంతో పూర్తిగా ఏకీభవించలేకపోయినప్పటికీ, ఈ పాఠం 20-25 యేళ్ళ వయసు కుర్రాళ్ళకు బోధించడం ఇబ్బంది అన్న విషయం తోసిపుచ్చలేకుండా ఉన్నది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు. ప్రాచీన సాహిత్యాని గౌరవించాలి, రక్షించుకోవాల్సిందే. దానికి సామరస్యమైన పద్ధతి కావాలి. నిజానికి మనకున్న సాహిత్యం అపారమైనది. కళాపూర్ణోదయం లోనే ఇలాంటి ఇబ్బందికర వర్ణనలు లేని ఘట్టం పాఠ్యాంశంగా ఉంచవచ్చు, లేదా మరో గొప్ప కావ్యాన్ని ఎంచుకోవచ్చు.పదవతరగతి నుండే ప్రేమలు మొదలెట్టే ఈ రోజుల్లో, ఈ తరహా కావ్యాలు క్లాసురూములో బోధించడం ప్రాక్టికల్ గా ఇబ్బందే.
1.ప్రాచీన సాహిత్యం పేరుతో మనమిప్పుడు నెత్తికెక్కించుకుంటున్న సాహిత్యమంతా leisure సాహిత్యం. రసాస్వాదన అంటూ పేరుపెట్టి అదే దానికి సరైన ఉపయోగం అంటున్నాం. ఎనిమిదో తరగతిలో "పూర్ణకుచకుంభాల్ని" నేర్పుతూ అదే మన సంస్కృతి అంటున్నాం. అది నిజంగా నిజమా అనేది నా మొదటి సందేహం. మన శ్రమసాహిత్యం, జానపదసాహిత్యం, ప్రజాసాహిత్యం ఎక్కడికి పోయాయి? అవి మన పుస్తకాల్లో కనిపించవే?
2.Sexually active వయసులో, శరీరాలతో ప్రయోగాలు చేసే వయసులో AIDS education అవసరమని ఒక curriculum add చేస్తే "అయ్యో మన సంస్కృతు భ్రష్టుపట్టిపోతుందే" అని ఏడ్చే సాంప్రదాయవాదులకు ఈ సాహిత్యం మాత్రం శృంగారం. మిగతాదంతా బూతు. ఈ ద్వంద్వప్రమాణానికి కారణం ఏమంటారూ?
అయినా ఎవరు నిర్ణయించారు వీటిని మహాకావ్యాలని? ఎవరికోసం ఈ రచనలు? ఏ ఉద్దేశాల పూర్తికోసం ఈ వర్ణనలు? ప్రజా జీవనానికి ఏవిధమైన "ఉత్తేజాన్ని" తీసుకొస్తాయి ఈ కావ్యాలు? నిజంగా సాహిత్యం ఉద్దేశం ఈ "రసస్పందనేనా"?
ఏంటో...మీరే చెప్పాలి.
పి.జి. చదివే వారికి గూడా ప్రబంధాల చెప్పటము, వినడము ఇబ్బంది అయితే ఇంక వాటిని చదివేవారు ఎవరు? ఈ ఇబ్బంది అనే logic నాకు అర్థము కావటములేదు. చెప్పటము, చూపటము ఇబ్బందిగా ఉన్నది అంటే, వైద్యము నేర్చుకునేదెవరు, చెప్పేదెవరు? అందులో ఇంతకన్నా బూతూ ఎక్కువగానే ఉంటుందిగదా?
కళాపూర్ణోదయము తెలుగులోని నాలుగైదు గొప్ప కావ్యాలలో ఒకటని వేల్చేరు నారాయణరావుగారు చెప్పే వరకు నాకు తెలియదు. తెలిసినాక ఎమెస్కో వారిది తెప్పించాను చదవటానికి. శైలి కష్టముగా ఉండటము వలన, సమయము లేక పోవటము వలమ కుదరలేదు చదవటము. ముందు మీరిచ్చిన ఆ అచ్చ తెనుగు version చదువుతాను.ఆ పిడిఎఫ్ లింకుకు ధన్యవాదాలు.
Dear
You cannot expect a better appreciation of Kalapoornodayam any better from a professor of "Yogi Vemana" institution! Vemana wrote in his poems words like velayaali - Does that mean he is offending ladies? If I remember right, kalapoornodayam stories were published in Chandamaama long time back? Not sure. Beauty lies in the eyes of the beholder. Its also true the other way round. Porno or poornatvam lies in the eyes of the reader
cheers
zilebi.
http://www.varudhini.tk
వినోదినిగారు అటువంటి కావ్యాలని బేన్ చెయ్యాలనిగాని సెన్సార్ చెయ్యాలనిగాని అన్నట్టు నాకు అనిపించలేదు. ఆవిడ ప్రధాన ఉద్దేశం కేవలం బోధనలో సిలబస్‌లో ఉంచడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి మాత్రమే అని నేననుకుంటున్నాను. కాకపోతే మధ్యలో ఆ పాఠ్యాంశంలోని శృంగారం గురించి ఎద్దేవా చేస్తున్న ధోరణిలో వ్యాఖ్యానించడం వల్లనూ, ఈ కావ్యభాగం పాఠ్యాంశానికి ఎందుకు తగదో అని ఆవిడ పేర్చిన వాదనలోనూ, అనవసరమైన ధోరణి ప్రవేశించి, పాఠకుల్ని కొంచెం అయోమయానికి గురి చేస్తున్నది.
ఈ విషయంలో అసలు చర్చకి సంబంధం లేని ఒక మాట చెప్పుకోవాలి. వివిధ అంశాలమీద కొందరు తెలుగు ఆచార్యులు రాసిన వ్యాసాలు చదివాను ఈ మధ్యన. ఒక వ్యాసం ఎలా రాయాలి, రాస్తున్న వ్యాసం - వాదన, వివరణ, వర్ణన, సమాచారం, ఉటంకింపు - ఎలాంటి వ్యాసం రాస్తున్నాం అనే కనీస స్పృహ లేకుండా రాస్తున్నట్లు నాకనిపిస్తున్నది. చెప్పేవిషయానికి దోహదం చేస్తున్నదా లేదా అని చూసుకోక తెలిసిన సమాచారాన్నంతా గుప్పించెయ్యడం, రాస్తున్న విషయానికి సంబంధం లేని ఆవేశం హెచ్చుపాళ్ళలో కనిపిస్తున్నాయి. ఈ ఆచార్యుల వ్యాసాలకంటే హైస్కూళ్ళల్లో వ్యాసరచంపోటీలకి విద్యార్ధులు రాసే వ్యాసాలు ఎంతో మెరుగు. దురదృష్టవశాత్తూ, వినోదిని గారి వ్యాసం కూడా అదే కోవలోకి వస్తున్నది. కాకపోతే ఆవిడ చెబుతున్న ముఖ్యాంశాన్ని కాదనలేము. అంతగా సిలబసు నిర్ణయించే కవిపండితులకి సూరన అన్నా, కళాపూర్ణోదయమన్నా అంత ప్రేమ అయితే సంభోగ వర్ణన లేని ఘట్టాన్ని పాఠ్యాంశంగా ఎంచుకోవచ్చునే.
ఈ విషయం మీద తమ తమ అభిప్రాయాలు చెప్పినవాళ్ళందరికీ ధన్యవాదాలు.
అనానిమస్ గారు, నాకు చెప్పేంతవాడిని కాను అంటూనే నా వయస్సు కూడా చెప్పారు. సంతోషం.
వినోదిని ఈ వ్యాసం లో రెండు విషయాలు మాట్లాడింది. ఒకటి శృంగార కావ్యాల్ని క్లాస్ రూమ్ లో బోధించేటప్పుడు వున్న ఇబ్బందులు. రెండోది అసలు ఇలాంటి కావ్యాల వల్ల ప్రయజనం ఏమిటి? ఇవి ఎవరికోసం? ఇవి సమాజానికి ఏ రకంగా వుపయోగపడతాయి? అని.నా వ్యాసం ఆమె లేవనెత్తిన రెండో అంశానికి సంబంధించినది. ఎందుకంటే బోధనాపద్ధతుల గురించి, అందులో తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చించాల్సింది సాహిత్య పేజీల్లో కాదు. పెడగాజీ వర్క్ షాప్ ల్లో చర్చించాల్సిన విషయాలు. అయినా నేను కూడా అందులో వున్న ఇబ్బందిని వొప్పుకున్నాను. నేను అభ్యంతరం చెప్పింది. కావ్యం మీద ఆమె చేసిన కామెంట్ల మీద మాత్రమే.
అసలు తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఎలాంటి పాఠాలు వుండేవి? మనం ఎలా నేర్చుకున్నాము? మన మీద వాటి ప్రభావం ఎలా వుండేది?అన్న విషయాల మీద వీలైనప్పుడు మరో సారి ఒక పోస్ట్ రాస్తాను.
ప్రజా,జానపద, శ్రమ సాహిత్యానికి పాఠ్యపుస్తకాల్లో గుర్తింపు లేదు. వొప్పుకుంటాను. పోతన పద్యం లో కూడా శృంగారం వెతుక్కునే వాళ్ళు ఎక్కడైనా వుంటారు. వాళ్ళకు ఇలాంటి కావ్యాలు ఆటవిదిపులే. శృంగారం ( అది ఏ స్థాయిలోనైనా) బూతు అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. నంది తిమ్మన, శ్రీనాధుడు, చివరికి అన్నమయ్య కూడా పుస్తకాల్లో వుండకూడదు. ఆ రోజు కూడా ఒకటి వస్తుందేమో. ఆశ్చర్యపోనక్కరలేదు. అయినా మార్కుల కోసం సంస్కృతం నేర్చుకుంటున్న బళ్ళల్లో ఈ తెలుగు పాఠాల మీద మనం ఇంత చర్చించుకోవటం కూడా కంఠశోషేనేమో?
వినోదిని గారి లెఖతొ నేను అంగీకరిస్తున్నాను. విద్యార్థుల మధ్య ఒక లెక్చరర్ గా ఒక స్త్రీ చెప్ప గలిగిన అమ్షం కాలేదిది. పాఠ్యాన్శాలు ఎన్నుకొవలసిన వాళ్ళు జగ్రత్త చూపాల్సిన సంగతే. ఆవిడ ఈ గ్రంథం మీద కామెంట్ చెయలెదు . ఓక లెక్చరర్ గా మాత్రమే రాశారు.
ఈ అంశాన్ని పాఠ్యాంశంగా పెట్టడాన్ని వ్యతిరేకించారు వినోదినిగారు. అది సమర్ధనీయమే. ఇక కావ్యాన్ని గురించిన ఇతర అభ్యంతరాలంటారా అవి వారి వారి అభిప్రాయాలకే వదిలేయడం మంచిదేమో. పాఠ్యాంశంగా మాత్రం సమర్ధనీయం కాదు.
వినోదిని గారి వ్యాసంలో నాకెలాంటి తప్పూ కనిపించ లేదు. ఒక తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్కి మన సాహిత్యం పట్ల అలాంటి అభిప్రాయాలు ఉన్నాయంటే అది ఆవిడ తప్పు కాదు. ఆవిడ చదువుకున్న చదువు, ఉంటున్న సమాజం ఆవిడలో అలాంటి అభిప్రాయాలని పెంపొందించాయి. పరంపరగా వచ్చే ఒక ధార ఎప్పుడో ఎక్కడో తెగిపోయింది. తెంపెయ్యబడింది. తెగిన కొసలని అందుకొని ముళ్ళువేసి అతికించగలమా? అలా చెయ్యాలని కొందరికి తాపత్రయం, మరికొందరికి ఒళ్ళుమంట. బహుశా మరొక తరం, రెండు తరాలు ఈ సంఘర్షణ, అంతే.
శృంగారానికీ బూతుకీ మధ్యనుండే తేడా మనమెప్పుడో మరచిపోయాం. మనకి శృంగారమంటే సెన్సారు కట్లని తప్పించుకున్న ద్వంద్వార్థాల పాటలూ, అదోరకం హీరోయిన్ల అవయవాల కదలికలు. లేదంటే చాటుమాటు సరసాలకి పబ్బులూ, విచ్చలవిడి విహారానికి ఇంటర్నెట్టూ ఉండనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య బంధానికి శృంగారం ఇప్పుడు అవసరమే లేదు! పైన చెప్పిన శృంగారం పుష్కలంగా బయట దొరుకుతూనే ఉంది కదా. మరి వాళ్ళని దగ్గర చేసే, కలిపి ఉంచే శక్తి ఏవిటయ్యా అంటే "మానసిక బంధం". ప్లేటోనిక్ లవ్. ఇదొక గగన కుసుమం!
శృంగారం బూతైపోయాక, దాన్ని క్లాసురూములో చర్చించడానికి మన "విలువలు" అడ్డం వస్తాయి కదా మరి. దాన్ని తలుచుకుంటేనే మన బుద్ధులు వక్రించిపోతాయి. మన సంస్కారాలు అంతగా దిగజారిపోయాక గురు శిష్య సంబంధం మరుగునపడిపోయి, కేవలం "ఆడ" "మగ" సంబంధమే చెలరేగిపోతుంది కదా. కాబట్టి ఇలాంటి పాఠాలని పెట్టడం ముమ్మాటికీ తప్పే.
ఈ పాట్ట్యాంశం యెంత సమర్దించాలన్నా ఎలాగో తెలియడం లేదు.నంది తిమ్మన, శ్రీనాధుడు, చివరికి అన్నమయ్య ఎవరైతేనేం ? సమర్దనీయం కానప్పుడు సమర్దించకూడదు గదా ! ఉదాహరణకు -తల్లి వక్షోజాలు, దేవత వక్షోజాలు వర్ణించడం ఆనాటి కవిత్వానవాయితీ కావచు . ఇప్పుడూ అలాగే చేయాలనుకోటం
సమర్దనీయమా . ఇదీ ఇంతే. ఒక తెలుగు ప్రొఫెస్సర్ ఇబ్బంది పడిందీ అంటే ఆ పాట్ట్యామ్శాలు ఇబ్బంది కరమే. ప్రాచీన సాహిత్యమో, ప్రియమైన సాహిత్యమో - మహేష్ కుమార్ గారన్నట్లు "ప్రాచీన సాహిత్యం పేరుతో మనమిప్పుడు నెత్తికెక్కించుకుంటున్న సాహిత్యమంతా" ఈకాలానికి సరిపోతుందోలేదో సరిచూసుకోవాలిమారి.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్,దక్షిణాఫ్రికా
ఈ పాట్ట్యాంశం యెంత సమర్దించాలన్నా ఎలాగో తెలియడం లేదు.నంది తిమ్మన, శ్రీనాధుడు, చివరికి అన్నమయ్య ఎవరైతేనేం ? సమర్దనీయం కానప్పుడు సమర్దించకూడదు గదా ! ఉదాహరణకు -తల్లి వక్షోజాలు, దేవత వక్షోజాలు వర్ణించడం ఆనాటి కవిత్వానవాయితీ కావచు . ఇప్పుడూ అలాగే చేయాలనుకోటం
సమర్దనీయమా . ఇదీ ఇంతే. ఒక తెలుగు ప్రొఫెస్సర్ ఇబ్బంది పడిందీ అంటే ఆ పాట్ట్యామ్శాలు ఇబ్బంది కరమే. ప్రాచీన సాహిత్యమో, ప్రియమైన సాహిత్యమో - మహేష్ కుమార్ గారన్నట్లు "ప్రాచీన సాహిత్యం పేరుతో మనమిప్పుడు నెత్తికెక్కించుకుంటున్న సాహిత్యమంతా" ఈకాలానికి సరిపోతుందోలేదో సరిచూసుకోవాలిమారి.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, దక్షిణాఫ్రికా
i support you in this regard.,your absolutely absolutely right.our ancient poets never provoked but educated.
manava sambandhalanu saitham thosi rajane "porno" sahithyam kanna viluvala valuvalu kattadam nerpinche bharatheya sahithyam ardham chesukodaniki neti adhunika bharatheeyula ki emaatram "arhatha" inka raledanipisthondi,ilativi chusthe.
porno chudatam tappu kadu ani cheppe adhunika vadula ki mari ee kavyam lo boothu em kanapadindo?
oka sthree soundaryanni amenu kanna talidandrulu kanee,tobuttuvulu kanee,kanesam kattukunna bhartha kuda aaswadinchaleru okka ame kanna bidda tappa.ame bidda matrame aa soundaryanni paripoornam ga aaswadinchagaladu.aa aswadanlo kamam ane malinyam vundadu kabatti .anduke adi sankarulu "soundaryalahari " lo ammavari anga varnana chesi tana talli entho andagagaththe kabatte ,sivudu amenu cheradani cheptharu.antha matrana bidda talli tho kamam teerchukodam kosam varnichinattu anevarini manasika rogula jabitha lo cherchavacchu.
bharatheeya samajam lo prathi stree ki anati samajam lo entha swechcha nu ichchindi ,andulo nu maree vayasulo vunna sthree,purushulu mansulo ni korikanu ela prakatinche svechcha vunnado ee kavyalalo chusina ardham avuthundi.kanee neti vichalavidi srungaram chupinche cinima llo kanapadani vinapadni boothu papam avidaki kanapadaledemo, i really pity her!!!
manishi edagadam entha mukyamo manasu kuda edagali anedi kuda anthe mukyam.
chala baga raasaru,kalpana gaaru anthe kakunda telugu translation link ivvadam kooda bagundi
i fail to understand why some persons are so harsh against the prof. You have to understand the bad position she was to tell the meaning of some poems.When i was degree student in 1968,there were 15 girls and 45 boys in the class. The lesson was SUKUMAARA CHRITRA of Srinadha. In that there was one situation where the Telugu male lecturer has to explain what is PURUSHYITHA KELI.The lecturer without lifting his head looking into the book in few seconds
told some thing and skipped to another poem.
When a male lecturer was in a auckward position and hesitating,how can you ask a lady lecturer
to explain such things.Imagine your wife or sister as lecturer, will she be in a position to explain the meaning of PURUSHAYITHA KELI or can you wife tell your kids the meaning of that word.
So dear critics, please avoid criticizing the lady prof. Before doing so please ask your mother or sister the meaning of that word i mentioned and then comment.
Post a Comment