కవిత్వం ఒక ప్రదర్శనా కళ ( performing art)అనుకుంటాను నేను. అందమైన కవితల్ని ( ఇక్కడ అందం అంటే ఆకాశం, పూలు లాంటి ప్రకృతి సౌందర్యం కాదు—శబ్ద, లయ సౌందర్యం ) మౌనం గా లోపల్లోపల చదవటం కన్నా పైకి చదవటం వల్ల, పైకి చదివినది శ్రధ్ధగా వినటం వల్ల మరింత ఎక్కువగా మనసుకి హత్తుకొని దగ్గరవుతుందనిపిస్తుంది. రచనా లాగే సంభాషణ కూడా ఒక ప్రవృత్తి నాకు. చిన్నప్పుడు రేడియో లో పిల్లల నాటకాలు వేయటం దగ్గర నుంచి ఆకాశవాణి లో ప్రాంతీయ వార్తలు, వార్తా కథనాలు చదవటాన్ని కూడా అందుకనే నేను బాగా ఎంజాయ్ చేయగలిగాను. నా పేరు చెప్పకముందే నా గొంతు వినగానే మీరు ఫలానా కదా అని గుర్తు పట్టి అందరూ అడుగుతుంటే అప్పట్లో అదో రకమైన సంతోషం. ఇప్పుడదంతా గత వైభవమే అనుకోండి. ఆ మధ్య ఎప్పుడో నా పేరు చూసి నెమలికన్ను మురళి మీరు వార్తలు చదివే వారు కదా అంటే ఓహ్! ఇంకా కొంతమంది గుర్తుపెట్టుకున్నారనుకొని పొంగిపోయాను. నాకున్న ఈ రెండు ప్రవృత్తుల్ని కలిపి నా కవితల్ని ఆడియో గా అందించాలని ఎప్పటినుంచో ప్రయత్నం. చాలా సార్లు అనుకోవటం, మళ్ళీ ఇప్పుడు కాదులే , తర్వాత అని వాయిదా వేయటం జరిగింది . మొన్న మాలతి గారు, నేను కలిసి మళ్ళీ ఈ ఆడియో బ్లాగింగ్ కి శ్రీకారం చుట్టాలనుకున్నాము. మాలతి గారు తన కథలు , నేను నా కవితల్ని చదివి ఆడియో గా అందించాలని నిర్ణయించాము. ఈ ప్రయత్నం లో తొలి అడుగు గా ఇవాల్టీ ఆడియో టపా లో నేను రెండు కవితలు చదివాను. వీటిపై మీ అభిప్రాయం తెలియచేయగలరు. మాలతి గారి కథ ఆడియో లో ఇక్కడ వినండి.
మంచి కంఠము, ఉచ్ఛారణతో చాలా బాగా చదివారు. కవితలను, కథలను ఇలా చదవడం వల్ల పాఠకులకు కవిత వ్రాసిన వారి అనుభూతి స్పష్టంగా తెలిసి రచయిత చెప్పాలనుకుంది సులభంగా పాఠకునుకి చేరుతుందనుకుంటాను.
కొత్తపాళీ గారు, మీ బొకే ని అందుకున్నాను. చాలా థాంక్స్. మిమ్మల్ని ఇంతకుముందు చాలా సార్లు ఈ ఆడియో గురించి అడిగాను కదా. ఎట్టకేలకు, ఇది సాధించాను. ఐ ఫోన్ తో చేశాను. మరి క్వాలిటీ ఎలా వుందో చెప్పాలి?
పోస్ట్ పెట్టిన వెంటనే వినే సాహసం చేసి వెంటనే కామెంట్ కూడా పెట్టిన భా.రా.రే కి, తెలుగు యాంకి కి, భాను కి, తెరెసా కి ధన్యవాదాలు.
చదువరి గారు, తప్పులు సరి చేసుకుంటాను. నేను అసలు పని చేస్తుందా, లేదా అని టెస్టింగ్ కోసం చేసింది. అటెన్షన్ పే చేయలేదు. ఈ సారి సరిగ్గా చదివి అప్లోడ్ చేస్తాను. తప్పుల ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ ఐఎంఈ లో కొంపోసింగ్ లో చాలా వత్తులు కంపోసింగ్ లో రావడం లేదు. తెలిసి తెలిసి తప్పౌలతో పోస్ట్ చేయాల్సి వస్తోంది. ఎవరి దగ్గరైనా దీనికి సంబంధించిన సమాచారం వుంటే చెప్పగలరు. స్వేచ్ఛా, అర్ధం లాంటి పదాలు, జ్నానమ్ లాంటివి ఇక చెప్పనే అక్కరలేదు.
కొత్తపాళీ గారు , మీ సూచన బావుంది. ఒక్కో కవితా ఒక ఫైల్ .
తంహాయి మొత్తం ఆడియో బుక్ చేయాలని ఒక ఆలోచన. అది ఎలా వర్క్ ఔట్ అవుతుందో కానీ.....
"ఈ ఐఎంఈ లో కొంపోసింగ్ లో చాలా వత్తులు కంపోసింగ్ లో రావడం లేదు. తెలిసి తెలిసి తప్పౌలతో పోస్ట్ చేయాల్సి వస్తోంది." - కల్పన గారూ, తప్పు మీ కంప్యూటరుదైనా కావచ్చునండి. నేను స్వయంగా ఈ తేడాను గమనించి ఉన్నాను. మాఇంట్లోని ఒక కంప్యూటరులో బానే కనబడుతుంది, మరో దానిలో వత్తులు కనబడవు. తప్పు రాసానేమోనని నేనూ అనుకునేవాణ్ణి. ఈ వత్తులు కనబడకపోవడమనేది, ఒకే అక్షరానికి రెండు వత్తులు వచ్చిన సందర్భాల్లో గమనించానండి. ఉదాహరణకు, "సందర్భం"లో ’బ’కు ఉన్న వత్తు కనబడదు - "సందర్బం"లాగా కనబడేది. మీరు వేరే కంప్యూటరులో ఓ సారి చూడండి. ఎందుకూ.. నేను రాసిన పై వాక్యంలోని రెండు సందర్భంలు కూడా ఒకేలా కనబడితే తప్పు మీ కంప్యూటరుదన్నట్టే!
నా కంప్యూటరు కీజబ్బు మొదట్లో ఉండేది కాదు, ఈ మధ్యే వచ్చింది. ఏం కెలికానో గుర్తుకు రావడంలా!
అవును.ఇప్పుడు మీరు పంపిన రెండు సందర్భాలు నా దాంట్లో ఒకేలా కనిపిస్తున్నాయి. ఏది కంటి దోషమో, ఏది కంప్యూటర్ దోషమో కనిపెట్టలేకున్నాను. ఇంకో కంప్యూటర్ లేదండి. ఈ ఒక్కటే వేస్ట్ అనుకుంటాను. రెండు కంప్యూటర్ లు వుంటే రెండు చేతులతో బ్లాగింగ్ చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతి పదం లేఖిని కి వెళ్ళి కంపోజ్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసే వోపిక లేక తోశేస్తున్నాను. ఒక్కోసారి నాకే చదవటానికి చికాకుగా వుంటుంది. అక్షరదోషాలు, ఉచ్చారణ దోషాలు ఎంత చికాకు పెడటాయో మీకు తెలుసు కాబట్టే ఆ వత్తులు సరిగా రాలేదని చెప్పారు. అందుకే మిమ్మల్నే ఈ సందేహం కూడా అడిగాను...
కొత్తప్రయోగం బావుంది. ఎప్పటినుండో అనుకుంటూ ఇప్పటికి కుదిరిందన్నమాట. కంటిన్యూ కల్పనగారు. మీ కధలు,కవితలు. రాతలతో పాటు మాటలు కూడా అందిస్తే మహదానందం. మావూరొచ్చినప్పుడు స్వీటు పెడతాలెండి...
చదువరిగారు రాసిన రెండు సందర్భాలు నాకు వేర్వేరుగానే కనిపిస్తున్నాయే. ఇది టైపింగ్ లోపమేమో..
ఇక బరహాలో అక్షరాలు,వత్తుల గురించి ఇక్కడ చూడండి పనికొస్తుందేమో..
నాకు ఏ రేడియో అనుభవం లేదు కానీ కంప్యూటర్ లోకి ఆడియో రికార్డ్ చేసినప్పుడు వాయిస్ మారిపోతుంది. http://media.praveencommunications.firm.inలో ఉన్న వాయిస్ నాదే కానీ నా ఒరిజినల్ వాయిస్ కి, ఆ వాయిస్ కి తేడా ఉంది. ఆడియో బ్లాగింగ్ బాగానే ఉంటుంది. కౌముదిలో గొల్లపూడి గారి వాయిస్ వింటుంటాను కదా. మీ వాయిస్ కూడా బాగుంది. మీ వాయిస్ విన్న తరువాత నేను రికార్డ్ చెయ్యడానికి వాడే డివైసెస్ లో వాయిస్ సెట్టింగ్స్ మార్చాలనిపించింది.
కల్పన గారూ మీ గొంతు, గొంతులో పలికిన భావం మరియు కవిత చాలా బాగున్నాయి. ఇదివరకు చదివినప్పుడు కన్నా ఇప్పుడు ఫీలింగ్ ఇంకా బాగుంది. మీగొంతు వింటే ఎప్పుడో విన్నట్టు, బాగా తెలిసినట్టు ఉంది, కాని పేర్లతో గొంతును పోల్చుకునేతంత రేడియో పరిజ్ఞానం లేదు. నా రేడియో అనుభవాలు ఎక్కువగా విశాఖపట్నం స్టేషన్ సైనిక మాధురి విజయవాడ వివిధభారతి కే పరిమితం. :-)) ఇంకా ముందు ముందు మరిన్ని ఆడియో ల కోసం ఎదురు చూస్తూ... పద్మవల్లి
ఇంతమంది మీకు అభినందనలు తెలిపితే ఎంతో ఉత్సహం తో మీ ఆడియో విన్నాను. మంచి కంఠము, ఉచ్ఛారణతో చాలా బాగా చదివారు. మీకు గొంతు చాలా బాగా ఉంది. కాని బాగా లేనిదొక్కటే స్రీ, మనువు, మోసం చేశారు, తొక్కేసారు లాంటి కాన్సెప్ట్ నా చిన్నప్పటి నుంచి విని విని విసుగెత్తు తున్నాది. మీరు అమేరికా కు వెళ్ళినా వీటిని మరచి పోలెదు. అసలికి ఇండియా లో ఇప్పటి ఆడవారు ఎంతో అభివృద్ది చెందారు. కావాలంటె మా ఆఫిసులో సిగెరెట్టు, మందూ తాగూ వారు తీసుకున్న పోటోలు పంప మంటే మీకు పంపుతాను. స్రీ ఒకప్పుడు అనుభవించిరాను కొంట్టున్న బాధ, మీ అస్తిత్వం లో ఒక భాగమైంది. మీకు మగ వారి మీద పడి ఘొల్లు మని ఎడవటం కరుణానిధి జీవితం లో నల్లకళ్ళద్దాల ఒక భాగమైంది. ----------------------------- కవిత్వం, రచనల పేరు తో ఖయ్ య్ య్ య్ అని మగవారి మీద పడి రక్కటం ఆపండి. చూడబోతే మీది ప్రేమ పెళ్ళి లా ఉందీ, కలసి బాగానే ఉంట్టున్నారు కదా ! మొగుడు మొద్దులు లేని వారు గోల చేస్తే అర్థం చేసుకోవచ్చు. అన్ని ఉండి మీరు ఇలా తయారైతే ఎలా? ఇంకా మీలాంటి వారు కూడా మగ వారిని పీడీంచే బృందం లో చేరి గోలచేస్తే ఎలా? మీగొంతు ఎంత బాగుందో, చదివిన టాపిక్ అంత చెత్త గా ఉంది. మిమ్మల్ని బాదించాలని ఉద్దేశం నాకు లేదు కాని మీరే నన్ను చాలా బాధ పెట్టారు. మగ వారు ఎంతో మంచి వారు, అమాయకులు.
ముఖపుస్తకంలో పునఃప్రవేశం
-
ఫేస్బుక్ లో అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయవ్యవహారాలు పరికించడానికి
తెరిచిన నాపేజీ చూడండి మీకు ఆవిషయాలు మీరు అనుసరిస్తుంటేనే.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
-
భార్య.. భర్త
తల్లితండ్రులు.. పిల్లలు
కొడుకులు.. కోడళ్లు
కూతుళ్లు… అల్లుళ్లూ
అత్తలు.. మామలు
పిన్ని.. బాబాయ్
ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు… అందరి మధ్...
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
-
*--సిరాశ్రీ*
కవిత్వం అంటే ఇది అని ఒక్క ముక్కలో నిర్వచనం చెప్పడం కష్టం. అలా నిర్వచనం అనే
చట్రంలో ఇరికిస్తే కవిత్వం కొత్త పుంతలు తొక్కదు. ఎవరు వ్రాసినా ఆ చట...
Ashray
-
Ashray Dravidian
A name to remember
And a name to look out for
A day will come when we will say with pride - We knew him since he was just
this high :-)
Th...
కవిత్వ ప్రపంచం
-
*దిగంబర కవిత్వం - గురించి *
జీవితం ,ప్రేమ ,కవిత్వం ఎప్పుడూ స్తబ్ధు గా ఉండవు . చలనం వాటి లక్షణం .
ఎప్పుడైనా స్తబ్దత అలుముకుంటున్నది అనుకున్నప్పుడు ఎదో ఒక స...
కొత్త బంగారు లోకానికి శ్రీకారం .... ‘ధన త్రయోదశి’
-
అమ్మ వారికి సంబంధించిన పవిత్రమైన ఆశ్వయుజ మాసానికీ, పండుగలకీ అవినాభావ
సంబంధం. ఆశ్వయుజ మాసం మొదలవగానే సమస్త కార్యాలకూ, సకల శుభాలకూ శ్రీకారం చుట్టే
మంచి రోజు...
ఇటీవలి ముందు మాటలు -4
-
విలోమవ్యవస్థ: అనులోమ కథ
"..ఒకప్పుడు వునికిలో వుండిన నిజాన్ని యిప్పుడు అబద్ధంగా ప్రచారం చెయ్యగలం.
ప్రజల మనస్సుల్లోంచి నిజాన్ని తుడిచెయ్యగలం. అంతే కాదు. ఆ...
27 వ్యాఖ్యలు:
మంచి కంఠము, ఉచ్ఛారణతో చాలా బాగా చదివారు. కవితలను, కథలను ఇలా చదవడం వల్ల పాఠకులకు కవిత వ్రాసిన వారి అనుభూతి స్పష్టంగా తెలిసి రచయిత చెప్పాలనుకుంది సులభంగా పాఠకునుకి చేరుతుందనుకుంటాను.
భాస్కర రామిరెడ్డిగారితో నేను కూడా ఏకీభవిస్తాను.
కవిత్వాన్ని శబ్ద రూపంలో అందించాలన్న మీ అలోచన మరియు ఈ ప్రయత్నం బాగుంది
Brilliant idea kalpana!
Please do continue.
BRAVO!
మీరు ఒక గొప్ప ప్రసిద్ధ ఆడిటోరియంలో స్టేజిమీద ఇది చదివారనుకుందాం.
మేం ఆడియెన్సులోంచి ఓ పెద్ద బుఖే యిసిరేశామనుకుందాం!
కొత్తపాళీ గారు, మీ బొకే ని అందుకున్నాను. చాలా థాంక్స్. మిమ్మల్ని ఇంతకుముందు చాలా సార్లు ఈ ఆడియో గురించి అడిగాను కదా. ఎట్టకేలకు, ఇది సాధించాను. ఐ ఫోన్ తో చేశాను. మరి క్వాలిటీ ఎలా వుందో చెప్పాలి?
పోస్ట్ పెట్టిన వెంటనే వినే సాహసం చేసి వెంటనే కామెంట్ కూడా పెట్టిన భా.రా.రే కి, తెలుగు యాంకి కి, భాను కి, తెరెసా కి ధన్యవాదాలు.
Good one, Nicely done. I was chatting with Raghu about Audio blogs yesterday - coincidence indeed
కవితాగానం చక్కగా ఉంది. భీతహరిణేక్షణ, అభిజ్ఞానము, భర్తృక,దుఖఃభాగినులే వంటి కొన్నిచోట్ల బ వత్తులు మరింత స్ఫుటంగా ఉంటే బాగుండేదనిపించింది.
బాగుంది. ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు.ఆభినందనలు.
చాలా బావుందండీ, మీరు రాసిన ఈ ఎవ్వతెవీవు కవిత నాకు చాలా ఇష్టం. మీ గొంతులో అది ఇంకా హృద్యంగా ఉంది.
మీగొంతు రేడియో లో విన్న గుర్తు వస్తున్నాది నాకిప్పుడిప్పుడే :)
రికార్డింగ్ క్వాలిటీ బాగుంది.
బ వత్తుల విషయంలో చదువరి గారితో ఏకీభవిస్తున్నా.
ఒక సూచన - వేర్వేరు కవితల్ని వేర్వేరు ఫైళ్ళుగా పెడితే మంచిదేమో
@మలక్, మహేశ్, సౌమ్య, చదువరి గారు ధన్యవాదాలు.
చదువరి గారు, తప్పులు సరి చేసుకుంటాను. నేను అసలు పని చేస్తుందా, లేదా అని టెస్టింగ్ కోసం చేసింది. అటెన్షన్ పే చేయలేదు. ఈ సారి సరిగ్గా చదివి అప్లోడ్ చేస్తాను. తప్పుల ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ ఐఎంఈ లో కొంపోసింగ్ లో చాలా వత్తులు కంపోసింగ్ లో రావడం లేదు. తెలిసి తెలిసి తప్పౌలతో పోస్ట్ చేయాల్సి వస్తోంది. ఎవరి దగ్గరైనా దీనికి సంబంధించిన సమాచారం వుంటే చెప్పగలరు. స్వేచ్ఛా, అర్ధం లాంటి పదాలు, జ్నానమ్ లాంటివి ఇక చెప్పనే అక్కరలేదు.
కొత్తపాళీ గారు , మీ సూచన బావుంది. ఒక్కో కవితా ఒక ఫైల్ .
తంహాయి మొత్తం ఆడియో బుక్ చేయాలని ఒక ఆలోచన. అది ఎలా వర్క్ ఔట్ అవుతుందో కానీ.....
"ఈ ఐఎంఈ లో కొంపోసింగ్ లో చాలా వత్తులు కంపోసింగ్ లో రావడం లేదు. తెలిసి తెలిసి తప్పౌలతో పోస్ట్ చేయాల్సి వస్తోంది." - కల్పన గారూ, తప్పు మీ కంప్యూటరుదైనా కావచ్చునండి. నేను స్వయంగా ఈ తేడాను గమనించి ఉన్నాను. మాఇంట్లోని ఒక కంప్యూటరులో బానే కనబడుతుంది, మరో దానిలో వత్తులు కనబడవు. తప్పు రాసానేమోనని నేనూ అనుకునేవాణ్ణి. ఈ వత్తులు కనబడకపోవడమనేది, ఒకే అక్షరానికి రెండు వత్తులు వచ్చిన సందర్భాల్లో గమనించానండి. ఉదాహరణకు, "సందర్భం"లో ’బ’కు ఉన్న వత్తు కనబడదు - "సందర్బం"లాగా కనబడేది. మీరు వేరే కంప్యూటరులో ఓ సారి చూడండి. ఎందుకూ.. నేను రాసిన పై వాక్యంలోని రెండు సందర్భంలు కూడా ఒకేలా కనబడితే తప్పు మీ కంప్యూటరుదన్నట్టే!
నా కంప్యూటరు కీజబ్బు మొదట్లో ఉండేది కాదు, ఈ మధ్యే వచ్చింది. ఏం కెలికానో గుర్తుకు రావడంలా!
చదువరి గారు,
అవును.ఇప్పుడు మీరు పంపిన రెండు సందర్భాలు నా దాంట్లో ఒకేలా కనిపిస్తున్నాయి. ఏది కంటి దోషమో, ఏది కంప్యూటర్ దోషమో కనిపెట్టలేకున్నాను. ఇంకో కంప్యూటర్ లేదండి. ఈ ఒక్కటే వేస్ట్ అనుకుంటాను. రెండు కంప్యూటర్ లు వుంటే రెండు చేతులతో బ్లాగింగ్ చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతి పదం లేఖిని కి వెళ్ళి కంపోజ్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసే వోపిక లేక తోశేస్తున్నాను. ఒక్కోసారి నాకే చదవటానికి చికాకుగా వుంటుంది. అక్షరదోషాలు, ఉచ్చారణ దోషాలు ఎంత చికాకు పెడటాయో మీకు తెలుసు కాబట్టే ఆ వత్తులు సరిగా రాలేదని చెప్పారు. అందుకే మిమ్మల్నే ఈ సందేహం కూడా అడిగాను...
కొత్తప్రయోగం బావుంది. ఎప్పటినుండో అనుకుంటూ ఇప్పటికి కుదిరిందన్నమాట. కంటిన్యూ కల్పనగారు. మీ కధలు,కవితలు. రాతలతో పాటు మాటలు కూడా అందిస్తే మహదానందం. మావూరొచ్చినప్పుడు స్వీటు పెడతాలెండి...
చదువరిగారు రాసిన రెండు సందర్భాలు నాకు వేర్వేరుగానే కనిపిస్తున్నాయే. ఇది టైపింగ్ లోపమేమో..
ఇక బరహాలో అక్షరాలు,వత్తుల గురించి ఇక్కడ చూడండి పనికొస్తుందేమో..
జ్యోతి,
నేను వాడుతోంది బారహా కాదు ఐఎంఈ. రెండూ ఒకటేనంతారా కొంపతీసి..ఏమిటో ...మీరు చెప్పిన వత్తులు, ఐఎం ఈ లో కూడా పనిచేస్తే పర్వాలేదు.
మాతలంటే ...అసలు ఈ కామెంట్లు కంపోజ్ చేయకుందా ఒక మైక్ పెట్టుకొని మాట్లాడితే పోతుంది.
ఈ వ్యాఖ్య టపాకి సంబంధించినది కాదు
తెలుగు టైపింగు కోసం PramukhIME tool
(ఇది వరకు ప్రయత్నించి ఉండకుంటే) ఒకసారి
ఉపయోగించి చూడగలరు
http://www.vishalon.net/Download.aspx
_________________________
డెమో:
http://telugu.shoutem.com
http://teluguthesis.com
థాంక్స్ రంజని గరూ
కల్పన,
అది బరహానే. నేను ఇచ్చిన లింకు చూడండి. పనికొస్తుంది. అలాగే బరహా లేటెస్ట్ వెర్షన్ ఉన్నట్టుంది. ప్రయత్నించి చూడండి..
కల్పనగారూ,
మీకు రేడియో అనుభవం బాగా ఉపకరించిందనుకుంటాను. భావాన్ని బాగా పలికించారు. మీ ఆడియో ప్రయోగం విజయవంతమయింది. అభినందనలు.
నాకు ఏ రేడియో అనుభవం లేదు కానీ కంప్యూటర్ లోకి ఆడియో రికార్డ్ చేసినప్పుడు వాయిస్ మారిపోతుంది. http://media.praveencommunications.firm.inలో ఉన్న వాయిస్ నాదే కానీ నా ఒరిజినల్ వాయిస్ కి, ఆ వాయిస్ కి తేడా ఉంది. ఆడియో బ్లాగింగ్ బాగానే ఉంటుంది. కౌముదిలో గొల్లపూడి గారి వాయిస్ వింటుంటాను కదా. మీ వాయిస్ కూడా బాగుంది. మీ వాయిస్ విన్న తరువాత నేను రికార్డ్ చెయ్యడానికి వాడే డివైసెస్ లో వాయిస్ సెట్టింగ్స్ మార్చాలనిపించింది.
శ్రీలలిత, ప్రవీణ్ ధన్యవాదాలు
ఈరోజే విన్నాను. ఫ్రయోగ0 బావుంది. కొంచెం హోంవర్క్ చేస్తే ఇంకా బావు0టు0ది కదా..?
Hello Kalpana garu,
naaku tanhayi anni episodes kanipinchatam ledu.nenu sariga vetaka leka potunnana? first nundi 27 episode varaku varusaga ekkada choodavachhu?
మీ గొంతు చాలా బాగుంది!
కల్పన గారూ
మీ గొంతు, గొంతులో పలికిన భావం మరియు కవిత చాలా బాగున్నాయి. ఇదివరకు చదివినప్పుడు కన్నా ఇప్పుడు ఫీలింగ్ ఇంకా బాగుంది.
మీగొంతు వింటే ఎప్పుడో విన్నట్టు, బాగా తెలిసినట్టు ఉంది, కాని పేర్లతో గొంతును పోల్చుకునేతంత రేడియో పరిజ్ఞానం లేదు. నా రేడియో అనుభవాలు ఎక్కువగా విశాఖపట్నం స్టేషన్ సైనిక మాధురి విజయవాడ వివిధభారతి కే పరిమితం. :-))
ఇంకా ముందు ముందు మరిన్ని ఆడియో ల కోసం ఎదురు చూస్తూ...
పద్మవల్లి
ఇంతమంది మీకు అభినందనలు తెలిపితే ఎంతో ఉత్సహం తో మీ ఆడియో విన్నాను. మంచి కంఠము, ఉచ్ఛారణతో చాలా బాగా చదివారు. మీకు గొంతు చాలా బాగా ఉంది. కాని బాగా లేనిదొక్కటే స్రీ, మనువు, మోసం చేశారు, తొక్కేసారు లాంటి కాన్సెప్ట్ నా చిన్నప్పటి నుంచి విని విని విసుగెత్తు తున్నాది. మీరు అమేరికా కు వెళ్ళినా వీటిని మరచి పోలెదు. అసలికి ఇండియా లో ఇప్పటి ఆడవారు ఎంతో అభివృద్ది చెందారు. కావాలంటె మా ఆఫిసులో సిగెరెట్టు, మందూ తాగూ వారు తీసుకున్న పోటోలు పంప మంటే మీకు పంపుతాను. స్రీ ఒకప్పుడు అనుభవించిరాను కొంట్టున్న బాధ, మీ అస్తిత్వం లో ఒక భాగమైంది. మీకు మగ వారి మీద పడి ఘొల్లు మని ఎడవటం కరుణానిధి జీవితం లో నల్లకళ్ళద్దాల ఒక భాగమైంది.
-----------------------------
కవిత్వం, రచనల పేరు తో ఖయ్ య్ య్ య్ అని మగవారి మీద పడి రక్కటం ఆపండి. చూడబోతే మీది ప్రేమ పెళ్ళి లా ఉందీ, కలసి బాగానే ఉంట్టున్నారు కదా ! మొగుడు మొద్దులు లేని వారు గోల చేస్తే అర్థం చేసుకోవచ్చు. అన్ని ఉండి మీరు ఇలా తయారైతే ఎలా? ఇంకా మీలాంటి వారు కూడా మగ వారిని పీడీంచే బృందం లో చేరి గోలచేస్తే ఎలా? మీగొంతు ఎంత బాగుందో, చదివిన టాపిక్ అంత చెత్త గా ఉంది. మిమ్మల్ని బాదించాలని ఉద్దేశం నాకు లేదు కాని మీరే నన్ను చాలా బాధ పెట్టారు. మగ వారు ఎంతో మంచి వారు, అమాయకులు.
ఉష
Post a Comment