నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, April 26, 2011

అప్పుడు బాత్ రూమ్ గోడలు...ఇప్పుడు ఫేస్ బుక్ వాల్ !




సంచలనం
సృష్టించినఏషియన్స్ ఇన్ ది లైబ్రరీవీడియో


అప్పుడు బాత్ రూమ్ గోడలు...ఇప్పుడు ఫేస్ బుక్ వాల్ పోస్టులు, ట్వీట్ లు , యూ ట్యూబ్ వీడియోలు.
ఇప్పుడున్నది ఫేస్ బుక్ తరం. 4 జి ఫోన్ల తరం, ట్వీట్ లు చేయకపోతే బతకలేని తరం, యూట్యూబ్ లో ఏదైనా వీడియో పోస్ట్ చేయకపోతే వాళ్ళు కూల్ గైస్ కాదనుకునే తరం, దీనికి దేశాలు, ఖండాలు ఏమీ తేడా లేదు. ఎక్కడైనా ఎవరికైనా పక్కవారిని ఏడిపించటం, వాళ్ళ మీద వీలైతే నాలుగు పుకార్లు ప్రచారం చేయటం, లేదా వాళ్ళ మీద ద్వేషం కురిపించటం ఇవన్నీ మన లోపల మనకే తెలియకుండా ఉండే లక్షణాలు.
ప్రపంచమంతటా ఇప్పుడు ఆన్ లైన్ బుల్లియింగ్ సీజన్ నడుస్తోంది. ఇందుకోసం నవతరం కున్న తాజా సాధానాలు ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్.
ఒకప్పుడు స్కూల్లోనో, కాలేజీలోనో చదువుకునేటప్పుడు మన స్నేహితుల్లోనో, తోటి విద్యార్థుల్లోనో ఎవరి మీదైనా కోపం వస్తే, ఎవరి గురించైనా ఒక పుకారు లేవదీయాలనుకుంటే, మనల్ని రాగింగ్ చేసి ఏడిపించేవాళ్లను ఎదురుగా నిలబడి ఏమీ చేయలేక దొంగ చాటుగా నైనా ఏదో ఒకటి చేసి తీరాలని ఉక్రోషంతో, ఆవేశంతో నే ఏదైనా రాయలనుకుంటే, బాత్ రూమ్ గోడలు పనికివచ్చేవి. ఫలానా వారు అంటూ వాళ్ళ గురించి ఏదో ఒకటి చివర టకారం చేర్చేసి ప్రచారం చేసెసేవాళ్ళు.
ఒక తరం లో బాత్ రూమ్ గోడల నీలి రాతలు ఎవరైనా తుడిపెసే అవకాశం కొంతైనా ఉంది. రాతలు, మాటలు ఒక స్కూల్ కొ, ఒక వూరికో, ఒక ప్రాంతానికో, ఒక వార్తా పత్రికకొ , ఒక టీవీ చానల్ కొ పరిమితమయ్యేవి. ఆన్ లైన్ సాధనాలతో అది కుదరదు. ఒక సారి నెట్ లో ఏదైనా పోస్ట్ చేస్తే, ఏదైనా రాస్తే, అది ఇక శాశ్వతం, ఎవరైనా దాన్ని స్క్రీన్ షాట్ కింద సేవ్ చేసుకొని ప్రచారం చేయవచ్చు. దాన్ని వెంటనే డౌన్ లోడ్ చేసి మళ్ళీ అప్ లోడ్ చేయవచ్చు. ఆంతర్జాల మాయాజాల ప్రపంచంలో సాలీడులా ఇరుక్కుపోయిన యువతరం తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన అంశాలు ఇంకాఅనేకం ఉన్నాయి.
బుల్లియింగ్ స్వరూప స్వభావాలు ఇప్పుడు ఏమీ మారలేదు కానీ వాటిని అమలు చేసే విధానం, బుల్లియింగ్ ని ఎదుర్కొనే విధానం రెండూ మారాయి.
ఎక్కడో మన ఫేస్ బుక్ వాల్ మీద మనం రాసే కామెంట్లు, రాతలు, కూల్ గా ఉంటుందనో, మన అభిప్రాయాలూ, మన మాటలు, మన చేతలు మనిష్టం , అది నా ప్రాధమిక హక్కు అనుకొని వెబ్ కామ్ ముందు కూర్చొని ఏవేవో మాట్లాడి వీడియో తీస్తే అది మీ జీవితానికే ముప్పు తీసుకురావచ్చు. తాను యూట్యూబ్ లో పెట్టిన మూడు నిమిషాల వీడియో, అందులో వెలిబుచ్చిన అభిప్రాయాలూ అమెరికాలోని ఒక విద్యార్థి జీవితాన్ని సమూలంగా మార్చేసింది. “ వీడియో తీసినప్పుడు నాలో ఏదో దెయ్యం ప్రవేశించి ఉంటుంది, కాలాన్ని వెనక్కు తిప్పగలిగే శక్తి లేదా అవకాశం ఉంటే నేను చేసిన పని ని తుడిపేస్తాను అంటుంది అలెక్జాండ్రా వాలెస్. ఇంతకూ వాలెస్ చేసిన తప్పెమిటంటే తనతో పాటు కాలేజీ లో చదువుకుంటున్న ఏసియన్ విద్యార్థుల గురించి తన అభిప్రాయాలను, అభ్యంతరాలను వెబ్ కామ్ ద్వారా వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయటం. “ ఏషియన్స్ ఇన్ ది లైబ్రరీపేరిట వాలెస్ పెట్టిన ఆసియా వ్యతిరేక వీడియో కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచమంతటా సంచలనం రేపింది.
లాస్ యాంజలెస్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ( UCLA) లో పోలిటికల్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్న అలెక్జాండ్ర వాలెస్ తన కాలేజీ లైబ్రరీ లో తోటి ఏసియన్ విద్యార్థుల మాట తీరుని, ఉచ్ఛారణ ని , వారి జీవిత విధాన్నాన్ని వెక్కిరిస్తూ ఒక మూడు నిముషాల వీడియా ని యూట్యూబ్ లో పెట్టింది. వాలెస్ వీడియో లో మాట్లాడింది మూడు నిముషాలే కానీ అందులో ఆమె చేసిన వ్యాఖ్యానాలు చాలానే వున్నాయి. యూసీఎల్ లాంటి యూనివర్సిటీ లో చదువుకోవటానికివచ్చే వాళ్ళు అమెరికన్ మేనర్స్ నేర్చుకోవాలన్నది ప్రధాన మైన వ్యాఖ్య. అది కాకుండా ఏషియన్స్ తమ పిల్లలు సొంత కాళ్ళ మీద నిలబదనీయకుండా వారాంతాల్లో వారి అపార్ట్మెంట్లకు వచ్చి బట్టలు ఉతకటం, వారాని కి సరిపోయే ఆహారాన్ని వండి పెట్టడం లాంటివి చేస్తారన్న రేసిస్ట్ వెక్కిరింపులు ఏషియన్ కమ్యునిటీ మనోభావాలను ఎంతగానో దెబ్బతీసాయి. వీడియో నెట్ లో విపరీతంగా ప్రచారమైంది. ఎంత గా ప్రచారమయిందంటే న్యూయార్క్ టైమ్స్ పేజీల్లోకి కూడా ఎక్కేంతగా.
జరిగినదేమిటంటే ఇటీవల జపాన్ లో సునామీ, భూకంపం సంభవించినప్పుడు జపాన్ లో తమ బంధువులు, స్నేహితుల వివరాలు తెలుసుకోవాలనుకునే అనేకమంది ఏషియన్ విద్యార్థులు కాలేజీ లైబ్రరీలో నుంచే సెల్ ఫోన్ లో మాట్లాడారు. పరీక్షలు జరుగుతున్నందున లైబ్రరీ లో చదువుకుంటున్న వాలెస్ కి అది ఇబ్బందికరంగా అనిపించింది.వెంటనే ఏషియన్ ప్రవర్తన గురించి తన అభిప్రాయాలను వీడియో ద్వారా తెలిపింది. వీడియో పెట్టగానే వచ్చిన నెగెటివ్ ప్రతిస్పందన చూడగానే వెంటనే ఆమె వీడియో ని తీసెసింది. కానీ అప్పటికే వీడియోని అనేకమంది డౌన్లోడ్ చేసుకొని ఉందటం వల్ల తిరిగి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.
వీడియో ని ఇక్కడ చూడండి.
ఇక వాలెస్ ఆసియా ప్రజల (జపనీస్) గురించి చేసిన అభ్యంతరకరమైన కామెంట్ల కి , సైబర్ బుల్లియింగ్ వీడియో కి స్పందనగా అనేక మంది వీడియో లు చేసి యూ ట్యూబ్ లో పెట్టారు. అయితే అన్నింటి కన్నా వర్థమాన గాయకుడు జిమ్మీ వాంగ్ ఎంతో సరదాగా, నమ్రతగా వాలెస్ చేసిన రేసిస్ట్ కామెంట్లకు సమాధానంగా నాలుగు నిముషాల ఒక పాట ద్వారా తన నిరసన ని తెలియచేసాడు. దాని పేరుచింగ్ చాంగ్ ఏషియన్స్ ఇన్ ది లైబ్రరీ సాంగ్” . వీడియో కి బహుళ ప్రచారం లభించింది . దాదాపు ఎనిమిది లక్షల మంది ఇప్పటి వరకూ వీడియో ని చూశారు. పాటను ట్యూన్స్ లో అమ్మకానికి కూడా పెట్టారు. జిమ్మీ వాంగ్ వీడియో ని ఇక్కడ చూడొచ్చ్చు.

వాలెస్ చేసిన సైబర్ బుల్లియింగ్ కి సమాధానం చెప్పటంతో కథ ఆగిపోలేదు. ఆమెకు , ఆమె కుటుంబానికి చంపేస్తామన్న బెదిరింపులు వచ్చాయి. కాలేజీ నుంచి ఆమె ను తొలగించకపోయినా, కాలేజీ కి వెళ్ళి పరీక్షలు రాసే వీలు లేక వాలెస్ ప్రస్తుతానికి కాలేజీ మానేసింది. వూరు కూడా వదిలి వెళ్ళే పరిస్థితులు వున్నాయి. కానీ ఎక్కడికెళ్లినాఅదుగో, ఆమె రేసిస్ట్ వాలెస్అనే ముద్ర పడిపోయింది. ఆమె జీవితం ఇదివరకటి లాగా ఇక ఎప్పటికీ వుండబోదు.
ఇవాల్టి ప్రపంచంలో పేరు చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎంత తొందరగా అంటే మనం వూహించలేనంత. అయితే అది మంచి పేరు కావచ్చు. చెడ్డపెరు కావచ్చు. వాలెస్ కథ ఒక హెచ్చరిక. ఆన్ లైన్ లో పబ్లిక్ లైఫ్ వున్న వారందరికీ వాలెస్ కథ ఒక కనువిప్పు కాగలదని ఆశిద్దాం.

( ఈ వ్యాసం ఏప్రిల్ 24 సాక్షి ఆదివారం అనుబంధం ఫన్ డే “ లో ప్రచురితం)

7 వ్యాఖ్యలు:

Anonymous said...

Thanks for the post.

శరత్ కాలమ్ said...

పర్సనల్ లైఫుకీ, పబ్లిక్ లైఫుకీ మధ్యలో వున్న సంధి యుగం ఇది కాబట్టి ఇలాంటి కొన్ని ఉలికిపాట్లు సహజం. ముందు ముందు మనదంతా లేకపోతే ముందు తరాల దంతా పబ్లిక్ లైఫే అవచ్చు. పర్సనల్ లైఫ్ కొరేవారిని చాదస్తులనవచ్చు.

Kalpana Rentala said...

శరత్,

నేను మాత్రం ఇంకా చాదస్తురాలినే:-))

కల్పన

Anonymous said...

<>
ఇదెలా ? వాళ్ళు వాళ్లకి తెలిసింది లేదా అనిపించినది పేస్ బుక్ వాల్ మీద పెడితే , మీకు అనిపించినది ఇక్కడ మీ బ్లాగులో పోస్టు చేసి ఆ రాతలని పర్మనెంట్ చేసినట్లున్నారు .

basically I didn't find any difference between these two .

శరత్ చంద్ర said...

కల్పన, ఔను, ఈ కాలం లో మనమేంటో బయటికి తెలియచెప్పటం చాలా తేలికైపోయింది. కాని గమనిస్తే ఈ సోషల్ నెట్‌వర్క్ సమాహారంలో (బ్లాగులు కలుపుకుని) ఎథీసమ్, థీజమ్, రేసిజమ్, ఫండమెంటలిజమ్ ‌బాధితులే చాలా మంది ఉంటారు. వీళ్లకి వీరి నమ్మకాలని బలపరిచే ఒక వాలిడేషన్ పాయింట్ కావాలి. ఏదో మంచి తనం ముసుగులో గుట్టుగా కొందరు వాళ్ల అభిప్రాయలని బయటపెడితే, అప్పుడప్పుడు వాలస్, JOEL STEIN లాంటి వాళ్ళు అనుకోకుండా అల్లరైపోతున్నారు.

Sujata M said...

కల్పన గారు

చాలా బాగా చెప్పారు. మంచి వ్యాసం. అభినందనలు.

శ్రీలలిత said...

బాగా చెప్పారండీ.
ఇది చదివైనా అలా చేయకూడదని కొంతమందైనా పాఠాలు నేర్చుకుంటే బాగుండును..

 
Real Time Web Analytics