నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Monday, June 25, 2012

వచ్చే వారం " వందేళ్ళ కథ కు వందనాలు" లో నా కథ మీద చర్చ

చాలా రోజులు..కాదు ...చాలా నెలల తర్వాత మళ్ళీ నా బ్లాగు లోకి వచ్చాను.

ప్రముఖరచయిత, నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి ఆధ్వర్యం లో హెచ్ ఏం టీవీ లో ప్రసారమవుతున్న ప్రసిద్ధ సాహిత్య సంచికా కార్యక్రమం  " వందేళ్ల కథకు వందనాలు" లో నా కథ ప్రసారం కానున్నది. నేను రాసిన కథల్లోంచి ఏ కథ మీద చర్చా కార్యక్రమం ప్రసారం చేయబోతున్నారు అన్న దాని మీద వీక్షకులు ఎస్.ఏం.ఎస్. పంపించవచ్చు. లక్కీ డిప్ లో ఒకరిని ఎంపిక చేసి హెచ్ ఏం టీ వీ వాళ్ళు బహుమతి ని అందచేస్తారు.
ఎస్.ఏం.ఎస్ ఎలా పంపించాలంటే KATHA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కథ పేరు టైప్ చేసి 5499936 అనే నెంబర్ కి పంపించాలి. ఉత్తరాలు రాయదల్చుకున్నవారు
వందేళ్ల కథ కు వందనాలు
కేరాఫ్ హెచ్.ఏం.టీ.వీ.
ప్లాట్ నెంబర్ 6
అణుపురం కాలనీ
డా. ఏ.ఎస్.రావు నగర్,
హైదారాబాద్ -500062 కు పోస్ట్ చేయాలి.

గత ఆదివారం నాకు ప్రముఖరచయిత ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి " ఆరో నెంబర్ గది" మీద చర్చా కార్యక్రమం ప్రసారమమయింది. ఇందులో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ప్రసంగించారు. ఆ లింక్ ఇక్కడ చూడవచ్చు.
http://www.hmtvlive.com/web/guest-public/videos?p_p_id=VediosList_WAR_VideoSection_INSTANCE_qiu7&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_VediosList_WAR_VideoSection_INSTANCE_qiu7_catId=11#1 వ్యాఖ్యలు:

Praveen Mandangi said...

మీ బ్లాగ్ ఓపెన్ చేస్తోంటే http://tracking.sitemeter.com నుంచి పాప్‌అప్ వస్తోంది. ఇది టెంప్లేట్ సమస్య ఏమో.

 
Real Time Web Analytics