అసలు అపరక్రియలే తగ్గిపోతున్న ఈరోజులలో అందులో ఒకభాగమైన సంచయనంగురించి ఇంత వివరంగా ఆవిష్కరించినకథ ఇదొక్కటేనేమో. అమ్మకో ఉత్తరం. తల్లి అమెరికా రావడానికి ఏర్పాట్లు చేస్తానంటూనే అమెరికాసౌకర్యాలు వర్ణించడంలో రచయిత్రి ప్రతిభ కనిపిస్తుంది. ఇందులో చక్కని వ్యంగ్యం ఉంది. ఏకథ తీసుకున్నా కథాంశాలలో ఆమె తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది.
తెలుగుభాషమీద
మంచిపట్టు గల కల్పన తెలుగుసంస్కృతికి సంబంధించిన ఇతివృత్తాలతో జానుతెలుగులో ఇంకా
ఇంకా మంచికథలు రాయగలరనీ ఆశిస్తూ, శుభాకాంక్షలతో
- నిడదవోలు మాలతి
ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు
0 వ్యాఖ్యలు:
Post a Comment