వంశీ మొహంలో అర్థం కాని ఆశ్చర్యంనీడ
లాగా పాకింది.‘‘ఆర్ యు షూర్?’’‘‘నూటికి నూరు శాతం..’’ అరక్షణం ఆగి ఆలోచనలో పడింది చిత్ర, తన నిర్ణయం గురించి మరోసారి ఆలోచిస్తూ. మనసులోని బాధను ఓ కంపార్ట్‌మెంట్‌లోకి
తోసింది. కన్నీళ్లకు ఆనకట్ట కట్టింది. గుండె బద్దలై పోయేలా, కళ్లు ఇంకిపోయేలా ఏడవాలని మరో పక్క మనసు కోరుకుంటోంది.
తల్లి చనిపోతే ఏడవని కూతురు ఎవరైనా
ఉంటారా ఈ భూమ్మీద!?వంశీలో రకరకాల ఆలోచనలు.చిత్ర
పక్కనొచ్చి కూర్చున్నాడు. భుజం మీద చేయి వేసి నెమ్మదిగా వెన్ను మీదకు తెసుకెళ్ళి
నిమురుతూ ఉన్నాడు. ఏమైనా చెప్తుందేమో, తనివి తీరేలా ఏడుస్తుందేమో అన్నట్లు ఆమె మొహం వంక చూస్తున్నాడు.
చావుకి, ఏడుపునకి పెద్ద లంకె. అదెప్పుడు
బయటకు వస్తుందో అన్నట్లు పదే పదే ఆమె మొహం వైపు చూస్తున్నాడు.ఊహూఁ .. చిత్ర కళ్లల్లో
నుంచి ఒక్క చుక్క రాలేదు. ఆమె లోపలి ఆలోచనలు మొత్తం మొహం మీద పర్చుకొని ఆ మొహం
కొంచెం విషాదంగా, కొంత కోపంగా, మరికొంత అపనమ్మకంగా అతనెలా అనుకుంటే అలా కనిపిస్తోంది.చిత్ర
ఏడిస్తే ఓదార్చాలనుకున్నాడు.చిత్ర డీలా పడిపోతే ధైర్యం చెప్పాలనుకున్నాడు.చిత్ర
నిస్సత్తువుగా అయిపోతే లేచి కూర్చో బెట్టి నమ్మకాన్ని అందివ్వాలని
అనుకున్నాడు.ఏడిస్తే అవసరమని టిష్యూ బాక్స్ తీసుకొచ్చి పక్కన పెట్టాడు.
దాని అవసరమే రాలేదు.బలవంతానైనా చిత్ర
చేత కాఫీ అయినా తాగించాలనుకొని కాఫీ చేసి తెచ్చిచ్చాడు. మారు మాట్లాడకుండా చిత్ర
కాఫీ తీసుకొని తాగటం మొదలు పెట్టింది.చిత్ర ప్రవర్తన అతడిని కొంత నిరాశ పర్చింది.
తాననుకున్నవేమీ చేయలేక పోయాడు. మంచి భర్తలాగా ప్రవర్తించే అవకాశం అతనికి
రాలేదు.‘‘కొత్త వేరియంట్ గురించి భయపడుతున్నావా? అందుకనే ఇండియా వెళ్ళటం లేదా?’’ కారణం కనుక్కున్నానన్నట్లు మొహం పెట్టాడు వంశీ.అడ్డంగా తల ఊపింది.
అతనిలో స్పష్టంగా నిరాశతో వచ్చిన చిరుకోపం.‘‘కాసేపు పడుకుంటా’’ బెడ్రూమ్‌లోకి
వెళ్తున్న చిత్రను చూస్తూ ‘హమ్మయ్య’ అనుకున్నాడువంశీ.‘ఇప్పటికి మామూలు మనిషిలా
ప్రవరిస్తోంది. తల్లి చనిపోయిందన్న వార్త విన్న కూతురు ఎలా ఉండాలో అలా ఉంటుంది
కాబోలు. బహుశా మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమ్మ లేదన్న నిజం
అర్థమై, చివరి చూపు కోసం ఇండియా
బయలుదేర్తుంది’ వెళ్ళనని చెప్పినా సరే, లాప్టాప్‌లో ఇండియా టికెట్స్ చూడటం మొదలుపెట్టాడు.
వంశీకి స్పష్టంగా ఇండియా వెళ్లనని
చెప్పింది కానీ ఎందుకన్నది చెప్పలేదు. అతని మొహంలోని ఆశ్చర్యం గమనించకపోలేదు
చిత్ర. ఎవరితోనూ మాట్లాడాలని లేదు. వివరణ ఇవ్వాలనిపించలేదు. కళ్ళు మూసుకుంటే, చివరిసారి ఇండియా వెళ్లొచ్చిన రోజులు గుర్తుకొచ్చాయి.
*************
కొవిడ్‌తో ఇండియా ప్రయాణం
ఆగిపోయింది. వాక్సిన్ తీసుకోగానే చిత్ర వెంటనే ఇండియా బయలుదేరి
వెళ్ళింది.అయిదేళ్ళ తరవాత ఇంటికి వచ్చిన కూతుర్ని గుమ్మంలోనే కౌగిలించుకుంది
రుక్మిణమ్మ. ఆమె కళ్ళల్లో నీళ్ళు. అయిదు యుగాల ఎడబాటు. ఒకరినొకరు అంటి పెట్టుకునే
లోపలకు వచ్చారు. పక్కన కొడుకు, కోడలు, మనవరాళ్ళు అందరూ గలగలా ఒకేసారి పలకరిస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. కూతుర్ని కౌగిలించు కున్నప్పుడు ఇందుకు అని
తెలియకుండా ఇది చివరి కలయిక అన్న బాధ ఏదో ఆమెను ముంచెత్తింది. మాట్లాడుతూనే
కూతుర్ని పైనుంచి కింద దాకా ప్రతి అణువు పరీక్షించి చూసేసింది. కొంచెం ఒళ్ళు చేసి
మంచి రంగుతో మిసమిసలాడుతున్న కూతుర్ని రెండు కళ్ల నిండా నింపుకుంది.‘‘అమ్మాయ్
సుధా, కాసింత దిష్టి తీసేయ్ తల్లీ’’ అంటూ చిత్ర వైపు చూపించింది.
అర్థమైందన్నట్లు సుధ తలూపింది.తల్లి మాటలకు నవ్వేసింది, సుధకేసి చూసి అవేమీ వద్దన్నట్లు. మళ్ళీ తల్లి వంక చూసింది. సంతోషం, బాధ మిళితమైన చూపులో తల్లి మనసు అర్థం చేసుకుంది. వదినతో పాటు
వంటింటిలోకి వెళ్ళి దిష్టి తీయించుకొనివచ్చింది.తల్లిను ఆనుకొని కూర్చొని కాఫీ
తాగుతూ ఒక చేత్తో వడలిపోయిన తల్లి దేహాన్ని నిమురుతోంది. చేతుల దగ్గర వదులై
జారిపోయి వేలాడుతున్న చర్మాన్ని గోవును నిమిరినట్లు నిమిరింది. అప్పుడెప్పుడో
తాకిన ఆవు శరీరం గుర్తొచ్చింది. కూతురు అలా నిమురుతుంటే, అదో రకమైన ఆనందం అనుభవించింది ఆ తల్లి.‘‘ఏమైనా విశేషమా?’’ఇంకెవ్వరు వినీవిననట్లు అడుగుతున్న తల్లి మాటలకు, లేదన్నట్లు తలూపింది చిత్ర.‘‘సంతోషంగా ఉండు, అది చాలు. వాళ్ళే వస్తారు, టైమ్ వచ్చినప్పుడు.’’ఇల్లంతా కలియతిరిగింది. నెలన్నర రోజులు ప్రతి
పనికి తల్లిని వెంట బెట్టుకొని తిరిగింది చిత్ర.కూతురు మనసు అర్థమైనట్లు
రుక్మిణమ్మ కూడా వెనకెనుకే తిరిగింది. ఇద్దరిలోనూ అంతర్లీనంగా ఒకటే ఆలోచన, ఒకటే బాధ.
‘ఏమో, ఇది చివరి చూపేమో?’తన చిన్ననాటి సంగతులు తల్లి పదే పదే మాట్లాడుతుంటే ఒక్కో మాటను
మనసులో రికార్డ్ చేసుకుంది చిత్ర. అడిగి అడిగి తల్లి చేత ఆమె చిన్నప్పటి విషయాలు
చెప్పించుకుంది. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నట్లు ప్రవర్తించారు తల్లీ
కూతుళ్ళు. ‘స్త్రీలకు ఓ రహస్య భాష’ ఉంటుందని బాగా చదువుకున్న ఓ పెద్దాయన చెప్పిన
మాట అక్షరసత్యంలా ప్రవర్తించారు ఆ ఇద్దరూ.వీసా స్టాంపింగ్ పని కొంచెం
ఆలస్యమవుతుంటే, లోపల్లోపల ఇద్దరూ సంతోషించారు.
ఇంకొంచెం కాలంగడపవచ్చని.కూతురు తిరిగి వెళ్లిపోతుందని తెలుసు రుక్మిణమ్మకు.మళ్ళీ
తల్లిని చూసేవరకు నమ్మకం తక్కువే అని చిత్రకు కూడా తెలుసు.అయినా చిత్ర
వెళ్లిపోవాలి.రుక్మిణమ్మ కూడా వెళ్లిపోవాలి - ఒక రోజు!మరో వారంలో చిత్ర అమెరికా
బయలుదేరుతుందనగా కూతుర్ని, కోడల్ని దిల్‌సుఖ్‌నగర్ బాబా గుడికి
బయలు దేరదీసింది రుక్మిణమ్మ. బాబా దర్శనం, హారతి ముగిసి ప్రసాదం తీసుకున్నాక గుడి ఆవరణలోనే కూర్చోబెట్టింది.
తల్లి ఏదో చెప్ప బోతున్నట్లు అర్థమైంది చిత్రకు. సుధ కూడా ఊహించగలిగింది అత్తగారి
మనస్సులో ఏదో ఉందని.కొబ్బరి చెక్కను కొట్టి కళ్ళకద్దుకొని బాబాను స్మరించుకొని
కోడలుకి, కూతురుకి చెరో ముక్కా ఇచ్చి తనో
ముక్క తీసుకుంది. ప్రసాదం తినే వరకు ఏమీ మాట్లాడలేదు, ఆలోచనలకు మాటల్ని పొదుగుతున్నట్లు.
*************
తల్లిని చుట్టుకొని వదలకుండా ఏడుస్తున్న పదేళ్ళ రుక్మిణిని బలవంతాన
విడదీశారు బంధువులు.ఒకొక్క కార్యక్రమం మొదలైంది.ఆమెను కూర్చోబెట్టి స్నానం
చేయించారు. మంత్రాలు చదువుతూ కుండలతో నీళ్ళు పోస్తున్నారు.అమ్మకు చన్నీళ్ళు పడవంటూ
రుక్మిణి పెద్దగా ఏడుస్తుంటే మేనత్త ఏడుస్తూ ఆ పిల్లను దగ్గరకు తీసుకొని
సముదాయించింది.ఆ తర్వాత ఆమె మొహాన అర చేయంత పసుపు ముద్ద పులిమారు. పెద్ద
బొట్టుపెట్టారు. తల కొంచెం ముందుకు వంచి నీళ్ళుకారుతున్న ఆ జుట్టులో ఓ మల్లెపూల
దండ తురిమారు.తడిసిన చీరను విప్పి మరో కొత్త చీరను చుట్టబెట్టారు. ఆమె వేరొకరిలా
కనిపిస్తోంది.అదంతా చూడకుండా పిల్లదాన్ని పక్కకు తీసుకెళ్ళే ప్రయత్నం మేనత్త
చేసింది కానీ రుక్మిణి హఠం చేసి అక్కడే ఉండి ఆ కార్యక్రమం మొత్తం చూసింది.
రుక్మిణికి తాను చూస్తోంది అమ్మ అనిపించలేదు. మరేదో రూపం ఎత్తినట్లు అనిపించింది.
‘‘అది మా అమ్మ కాదు. అలా చేయొద్దు, అవన్నీ తీసెయ్యండి’’ అంటూ అరిచి అరిచి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది
రుక్మిణి. ఆ తర్వాత మూసిన కన్ను మరో పది రోజుల వరకూ తెరవలేదు.ఆ తర్వాత తల్లి
ఎప్పుడు గుర్తొచ్చినా అమ్మ వారిని చూసినట్లు భయపడేది. జ్వరం వచ్చేది.
*************
ఏం చెపుతుందో అన్నట్లు రుక్మిణమ్మ
వంకే చూస్తున్నారు చిత్ర, సుధ.చేతికున్న గాజులు తీసి ఒక చేతి
గాజులు సుధకు, మరో చేతి గాజులు చిత్రకు ఇచ్చింది.
చెవికున్న వజ్రపు దుద్దులు తీసి సుధ చేతిలో పెట్టింది. ముక్కున మెరిసే మూడు రాళ్ళ
వజ్రపు ముక్కు పుడక తీసి చిత్ర చేతిలో పెట్టింది. మెడలో గొలుసు తీసి చిత్ర
కిచ్చింది. సుధ వైపు తిరిగి ‘‘ఇంటి దగ్గరున్న గొలుసు నీకు’’ అన్నది.చిత్ర కళ్లల్లో
నీళ్ళు. తల్లి ఏం చేస్తోందో, ఎందుకు చేస్తోందో
అర్థమై, పట్టుకొని ఏడ్చేసింది. సుధ మాత్రం
కొంచెం ఆశ్చర్యంగా, ‘‘ఏమిటత్తయ్యా.. మీరు మరీనూ.
ఇప్పుడెందుకివన్నీ? చిత్రకు ఇస్తే అర్థముంది కానీ
నాకెందుకు? మీ వొంటి మీదనే ఉంచుకోండి సంతోషంగా’’
తనకిచ్చిన వాటిని తిరిగి ఇచ్చేయబోయింది.ఇద్దరినీ వారించింది రుక్మిణమ్మ.‘‘ఈ కొవిడ్
వచ్చి తగ్గాక ఏ రోజెలా ఉంటుందో ఊహించలేం. నాకేం దిగులు, భయం, బాధ లేదు. ఇది నా బాధ్యత. ఇవి కేవలం
బంగారు నగలో, నా ఆస్తి మాత్రమో కాదు. ఒక్కో నగకు
ఒక్కో కథ. కొన్ని జ్ఞాపకాలు. కొన్ని మీకు తెలుసు, కొన్ని నాకు మాత్రమే తెలుసు. అవన్నీ చెప్పే సమయం ఇక్కడ కాదు.
అవకాశం వస్తే ఆ కథలు నా మనవరాళ్లకు చెప్తా.నేనిప్పుడు చెప్పాలనుకున్నది నా
భవిష్యత్తు గురించి. నా జీవితం గురించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఎప్పుడూ రాలేదు. కానీ ఇవాళ నేనొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా. అందుకు మీ ఇద్దరి
సహకారం కావాలి.’’ఆమె మనసులో ఏముందో ఊహించే ప్రయత్నం చేశారు చిత్ర, సుధ.ఇవాళో, రేపో నేనెళ్ళిపోయే రోజు ఒకటొస్తుంది.
నా వీడ్కోలు గురించి నాదొక చిన్న కోర్కె. ఈ జీవితంలో ఎన్నో చావులు చూశా. చావు
తెచ్చిన బాధ కన్నా, నన్ను బాధ పెట్టిందేమిటో తెలుసా? చనిపోయిన వాళ్ళను మళ్ళీ మళ్ళీ చంపేసే కొన్ని క్రతువులు. మతం పట్ల
నాకు సంపూర్ణ నమ్మకం. కానీ కొన్ని పద్ధతులు అర్థం లేనివిగా అనిపిస్తాయి.
మా అమ్మ చనిపోయినప్పుడు నాకు పదేళ్ళు. అమ్మ పోయిందన్న బాధ కన్నా, ఆమె మృత దేహానికి జరిగిన
చివరి స్నానాలు, తాళ్లతో
ఆ పాడెకు కట్టేయడం అవన్నీ నేనప్పటికీ మర్చిపోలేకపోయా. ఆ తర్వాత అమ్మను ఎప్పుడు
తల్చుకున్నా, ఆ
చివరి మొహమే గుర్తొచ్చేది. అది మరింత బాధపెట్టేది. భయపెట్టేది. ఆ దృశ్యం చూడటం
ఇష్టంలేక కొన్నాళ్ళకు అమ్మను జ్ఞాపకం చేసుకోవటం మానేశా. అమ్మ బతికున్నప్పటి
జ్ఞాపకాలను బలవంతంగా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యా. నా దృష్టిలో
విస్మృతే అసలైన మరణం. నా దగ్గరి వాళ్ళ చావులన్నీ అలా బాధ పెట్టే జ్ఞాపకాలే.మీకలా
జరగటం నాకిష్టం లేదు. మీ జ్ఞాపకాల్లో నేను సంతోషంగా తిరుగుతూ ఉన్నంత కాలం నేను
జీవించినట్లే. ఆ రకమైన కర్మకాండ వద్దంటోంది పూర్తిగా వ్యక్తిగత అయిష్టతతోనే.
అర్థం చేసుకోండి.నన్ను సంతోషంగా సాగనంపండి. ఏడుపులొద్దు. నాకిష్టమైన చీర కట్టండి. వేరే అలంకరణలు వద్దు. నా పేరిట ఓ పది మంది బీదలకు అన్నం పెట్టండి. నాకు కర్మకాండలు చేసే బదులు, కుదిరితే అనాథ శవాలకు శాస్త్రోక్తంగా దహనక్రియలు చేయండి. సుధా, అబ్బాయికి నువ్వే నచ్చచెప్పాలి.చిత్రా.. అంత దూరం నుంచి కేవలం నా శవాన్ని చూడటానికి రావాలని ప్రయత్నించకు. బాబా చెప్పినట్లు, నేనంటే కేవలం ఈ దేహం కాదు. నీ మనసులో నేనెప్పుడూ ఉంటానని తెలుసు. ఆ స్మృతుల్లో నేనెప్పుడు లేకుండా పోతానో అదే నా మరణం’’ రుక్మిణమ్మ గొంతు కొంచెం రుద్ధమైంది.‘‘నాకోసం ఇది చేయగలరా?’’ చిత్ర, సుధల వైపు ఆమె చేతులు చాపింది. ఇద్దరూ ఆమె చేతుల్లో చేయి వేశారు.చిత్ర మనసు దిగులు మేఘమైంది. తల్లిని హత్తుకుపోయింది, కళ్ళల్లో నీళ్ళతో. తల్లి కూతుళ్ళిద్దరూ అలా ఒకరినొకరు హత్తుకు పోయి కొద్దిసేపు ఉండిపోయారు.ఏం మాట్లాడాలో సుధకు తెలియలేదు. ‘అత్తమ్మ కోరుకున్నట్లు ఆమెను పంపించటం ధర్మం. కానీ భర్త ఏమంటాడో?’‘‘మీరు కోరుకున్నట్లు జరుగుతుంది అత్తమ్మ. ఎక్కువ ఆలోచించవద్దు’’ హామీ ఇచ్చింది సుధ.రుక్మిణమ్మ మొహంలో ఓ నిశ్చింత. ఓ ప్రశాంతత.
తన స్నేహితురాలు రూత్ వాళ్ళ అమ్మ డెబ్బీ చనిపోయినప్పుడు
జరిగిన ఫ్యూనరల్ సర్వీస్ కళ్ల ముందు కదలాడింది చిత్రకు.అప్పటికి డెబ్బీ చనిపోయి
వారం. వాళ్ళ మతాచారం ప్రకారం చర్చిలో కానీ, క్రెమటేరియంలో
కానీ సర్వీస్ జరుగుతుంది. చర్చిలో జరిగిన లిమిటెడ్ సర్వీస్‌కి వెళ్ళింది చిత్ర, నల్ల
డ్రెస్ ధరించి,
చేతిలో బొకేతో.దుఃఖానికి, వీడ్కోలుకు
సంకేతంగా అందరూ నల్ల డ్రెస్సుల్లో.రూత్, ఇతర
కుటుంబ సభ్యులు మౌనం గానే అతిథులను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్ళు బుగ్గ మీద ఓ
చిన్న స్పర్శతో,
కరచాలనంతో పలకరించి ‘‘టౌటటడ జౌట డౌఠట జూౌటట’’ అంటూ
ముందుకు సాగుతున్నారు. ఒకరికొకరికి ఆరడుగుల దూరం. మొహానికి మాస్క్‌లు.తెరిచి ఉన్న
కాస్కేట్‌లో నుంచి డెబ్బీని చూసి వచ్చి కుర్చీల్లో కూర్చుంటున్నారు. చిత్ర కూడా
కాస్కెట్ దగ్గరకు వెళ్ళింది. డెబ్బీ మొహంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు. ఆమె మొహం
మీది ముడుతలు నిద్రలోని సుదీర్ఘ స్మృతుల్లా.
పింక్ డ్రెస్ మీద ఆకు పచ్చ పూలు,లతలతో
ఆమె ఏదో తోటలో పడుకొని ఉన్నట్లుంది. చక్కటి అలంకరణ, చెవి
రింగులు,
మెడలో ముత్యాల దండ, చేతిలో
పూలగుత్తితో ఆమె చిన్న కునుకు తీస్తున్న పెళ్లి కూతురులాగా ఉంది. నిండైన జీవితం
గడిపిన ఆమెకు సంతోషపు వీడ్కోలు. అలా ఆమెను చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉంది.
డెబ్బీ రూపాన్ని అలాగే మనసులో నింపుకొని వచ్చి మూడో వరుస లో ఓ కుర్చీలో కూర్చుంది
చిత్ర. అవసరం మేరకు గుస గుసలుగా మాట్లాడుకుంటున్నారు. ఏదో మ్యూజిక్ కాన్సర్ట్‌కి
వెళ్ళినట్లు ఉంది చిత్రకు.‘‘ఐ్‌ఝ ్టజ్ఛి ట్ఛటఠటట్ఛఛ్టిజీౌుఽ ్చుఽఛీ ్టజ్ఛి
జూజీజ్ఛ’’ అంటూ ప్రీస్ట్ తమ మతగ్రంథం నుంచి ఉటంకిస్తూ సర్వీస్‌ని ప్రారంభించారు.
ఆ తర్వాత డెబ్బీ జీవితం గురించి నాలుగు మాటలు మాట్లాడారు. ‘‘ఖీజ్ఛి ఔౌటఛీ జీట ఝడ
ఖిజ్ఛిఞజ్ఛిటఛీ ’’ వెర్సెస్ కొన్ని చదివారు. రూత్ తన తల్లి జీవితం గురించి
మాట్లాడితే,
ఆమె అన్నయ్య ఒక కవిత చదివాడు. ఒకరిద్దరు ఆప్త
మిత్రులు డెబ్బీతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
తన స్నేహితురాలు రూత్ వాళ్ళ అమ్మ డెబ్బీ చనిపోయినప్పుడు
జరిగిన ఫ్యూనరల్ సర్వీస్ కళ్ల ముందు కదలాడింది చిత్రకు.అప్పటికి డెబ్బీ చనిపోయి
వారం. వాళ్ళ మతాచారం ప్రకారం చర్చిలో కానీ, క్రెమటేరియంలో
కానీ సర్వీస్ జరుగుతుంది. చర్చిలో జరిగిన లిమిటెడ్ సర్వీస్‌కి వెళ్ళింది చిత్ర, నల్ల
డ్రెస్ ధరించి,
చేతిలో బొకేతో.దుఃఖానికి, వీడ్కోలుకు
సంకేతంగా అందరూ నల్ల డ్రెస్సుల్లో.రూత్, ఇతర
కుటుంబ సభ్యులు మౌనం గానే అతిథులను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్ళు బుగ్గ మీద ఓ
చిన్న స్పర్శతో,
కరచాలనంతో పలకరించి ‘sorry for your loss’’ అంటూ
ముందుకు సాగుతున్నారు. ఒకరికొకరికి ఆరడుగుల దూరం. మొహానికి మాస్క్‌లు.తెరిచి ఉన్న
కాస్కేట్‌లో నుంచి డెబ్బీని చూసి వచ్చి కుర్చీల్లో కూర్చుంటున్నారు. చిత్ర కూడా
కాస్కెట్ దగ్గరకు వెళ్ళింది. డెబ్బీ మొహంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు. ఆమె మొహం
మీది ముడుతలు నిద్రలోని సుదీర్ఘ స్మృతుల్లా.
పింక్ డ్రెస్ మీద ఆకు పచ్చ పూలు,లతలతో
ఆమె ఏదో తోటలో పడుకొని ఉన్నట్లుంది. చక్కటి అలంకరణ, చెవి
రింగులు,
మెడలో ముత్యాల దండ, చేతిలో
పూలగుత్తితో ఆమె చిన్న కునుకు తీస్తున్న పెళ్లి కూతురులాగా ఉంది. నిండైన జీవితం
గడిపిన ఆమెకు సంతోషపు వీడ్కోలు. అలా ఆమెను చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉంది.
డెబ్బీ రూపాన్ని అలాగే మనసులో నింపుకొని వచ్చి మూడో వరుస లో ఓ కుర్చీలో కూర్చుంది
చిత్ర. అవసరం మేరకు గుస గుసలుగా మాట్లాడుకుంటున్నారు. ఏదో మ్యూజిక్ కాన్సర్ట్‌కి
వెళ్ళినట్లు ఉంది చిత్రకు.‘‘I’m the resurrection and the life’’ అంటూ ప్రీస్ట్ తమ మతగ్రంథం నుంచి ఉటంకిస్తూ సర్వీస్‌ని ప్రారంభించారు.
ఆ తర్వాత డెబ్బీ జీవితం గురించి నాలుగు మాటలు మాట్లాడారు. ‘‘The Lord is my Shepherd ’’ వెర్సెస్ కొన్ని చదివారు. రూత్ తన తల్లి జీవితం గురించి
మాట్లాడితే,
ఆమె అన్నయ్య ఒక కవిత చదివాడు. ఒకరిద్దరు ఆప్త
మిత్రులు డెబ్బీతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
ప్రార్థన ముగిశాక ఓ నిముషం మౌనం. ఆ మౌనక్షణంలోనే డెబ్బీకి
వీడ్కోలు పలికారు. ఆలోచనకు సంకేతం ఆ మౌన క్షణం. డెబ్బీతో అనుబంధం గురించి మౌనంగా
ఆలోచించుకో గలగాలి. ఆ క్షణం మరెన్నో క్షణాలఆలోచనలకు ప్రారంభం. ఆ ఆలోచన ఆ రోజు
అక్కడితో ఆగిపోదు. ఆ తర్వాత ఛిౌఝఝజ్ట్ట్చీజూ కార్యక్రమం. అంటే మృతదేహాన్ని పూడ్చి
పెట్టే కార్యక్రమం. అప్పుడు చెప్పే మాటలు హిందూ ధర్మంలో చెప్పే పాంచ భౌతిక శరీరం
అన్నదానికి సరిగ్గా సరిపోయేలా ఉండటం చూసి చిత్ర ఆశ్చర్యపోయింది.చిన్న ప్రార్థనతో ఆ
కార్యక్రమం ముగిసింది.ఆ తర్వాత అందరూ చర్చికి అనుబంధంగా ఉన్న మరో పెద్ద హాలులో
లంచ్, సోషల్
గేదరింగ్‌కి కలిశారు. రూత్‌తోను, మిగతా స్నేహితులతోనూ కొద్దిసేపు గడిపి ఇంటికొచ్చేసింది. ఆ
రోజంతా చిత్రకు ఎంత ఆలోచించవద్దనుకున్నా హిందూ కర్మకాండ ప్రతి క్షణం గుర్తుకు
వచ్చింది. కర్మకాండలోని ప్రతి తంతుకి ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. ఏ తంతు
ఎందుకు చేస్తారో తెలియకపోయినా వాటి పట్ల గౌరవం ఉండేది చిత్రకు. కానీ అమ్మ చివరి
కోర్కె విన్నాక, ఆమె
వ్యక్తిగత ఇష్టాన్ని మన్నించటం మర్యాదని చిత్రకు అర్థమైంది.
*************
అమ్మ
ఇక లేదన్న దిగులు చిత్ర లోపల సుళ్ళు తిరుగుతోంది. కానీ అమ్మకిచ్చిన మాట ప్రకారం
ఏడవదల్చుకోలేదు. అమ్మ జ్ఞాపకాలు దిగుడు బావి లోంచి పైకొస్తున్నాయి. అక్కడ జరిగే
అమ్మ వీడ్కోలుని ఓ అందమైన దృశ్యంగా ఊహించుకుంటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది చిత్ర.
కల్పనారెంటాల
5 వ్యాఖ్యలు:
చిత్రకు ఎంత ఆలోచించవద్దనుకున్నా హిందూ కర్మకాండ ప్రతి క్షణం గుర్తుకు వచ్చింది. కర్మకాండలోని ప్రతి తంతుకి ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. ఏ తంతు ఎందుకు చేస్తారో తెలియకపోయినా వాటి పట్ల గౌరవం ఉండేది చిత్రకు. కానీ అమ్మ చివరి కోర్కె విన్నాక, ఆమె వ్యక్తిగత ఇష్టాన్ని మన్నించటం మర్యాదని చిత్రకు అర్థమైంది.
Soul of the story 👍
హైందవసంప్రదాయం ప్రకారం జరిగే అంత్యక్రియల కన్నా క్రైస్తవసంప్రదాయం ప్రకారం జరిగే అంత్యక్రియాకలాపం మరింత హుందాగా మరింత మానవీయంగా ఉంటుందని సూచించటమే ఈరచన యొక్క ముఖ్యోద్దేశం అనిపిస్తుంది. హైందవసంప్రదాయం ప్రకారం జరిగే అంత్యక్రియలలో ప్రతి తంతుకి ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుందీ, వాటి పట్ల గౌరవం ఉండేదీ అని చెప్పటం కేవలం విమర్శలనుండి తప్పించుకుందుకు వేసిన ఒక చిన్న తెలివైన ఎత్తుగడ మాత్రమే. ఇకపోతే ఒక మాట చూడండి "దిగులు లోపల సుళ్ళు తిరుగుతోంది. కానీ అమ్మకిచ్చిన మాట ప్రకారం ఏడవదల్చుకోలేదు" అని. ఒక బలవంతపునటనలా ఆమె ప్రవర్తనను తేల్చి చెప్పటం వలన ఆపాత్రపట్ల సానుభూతి కలగకుండా పోతుంది చివరకు - ఇది చాలా పెద్దలోపం కథలో. ఈకథను చదివి ఎవరన్నా ఇలా కూడా మతప్రచారం చేస్తారా అని ఆశ్చర్యపోయే అవకాశం మెండుగా ఉంది.
చిన్న వయసులో అలాంటి కార్యక్రమాలు చూసి భయపడడం సహజం. అందుకే వాళ్ళని దూరంగా ఉంచుతారు. అయినా ఇప్పుడు అంత ఛాందసంగా చేస్తున్నారనుకోను.
ఇలా పోల్చడం సరికాదని అనుకుంటున్నాను.
శ్యామలీయం గారు,
మీరు చెప్పింది ఆలోచనాత్మకమైనా ఇపుడు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అని భావిస్తున్నపుడు సాంఘికమైన సంప్రదాయాలను పాటించరు కదండీ. హైందవ సంప్రదాయం పల్లెల్లోనే కనుమరుగవుతున్న వేళ ఎవరికి నచ్చింది వారు చేసుకోవడమే ఉత్తమం కదా!
ఎలక్ట్రిక్ క్రిమేషన్లు వచ్చిన తరువాత ఏ మతమూ ఏమీ చేయలేదు.
మీరు గమనించవలసింది ఏమిటంటే తన వ్యక్తిగత సంతోషం కోసం సంప్రదాయాన్ని పాటించదలుచుకోలేదు అంటే తల్లి, కూతురు కూడా అసలు ఏ క్రతువు ఎందుకు చేస్తారో తెలియదని ఒప్పుకున్నారు కదా ?
ఇంకెక్కడి హైందవం ?
11:28 PM, December 26, 2021
శ్యామలీయం said.... ఈకథను చదివి ఎవరన్నా ఇలా కూడా మతప్రచారం చేస్తారా అని ఆశ్చర్యపోయే అవకాశం మెండుగా ఉంది.
hari.S.babu
నిజమే!ఎక్కడా క్రిస్టియన్ ఇవాంజలిస్టు ఎజెండా కనిపించని తెలివైన క్రైస్తవ మత ప్రచారపు కధ.హిందువుల చేతనే హిందూమతాన్ని అసహ్యించుకునేలా చెయ్యడం గొప్ప ఎత్తుగడ - ఈ కధా రచయితకి కూడా సెయింట్ హోదా ఇవ్వాలి.ఇస్తారు,పరమ కిరాతకురాలైన నిర్మల హృదయ్ ధెరీసాకి కూడా ఇచ్చారు కదా.
Post a Comment