తెలుగు సాహిత్యం లో మీకు తెలిసిన రచయిత్రులు ఎవరైనా సైన్స్ ఫిక్షన్ కథ రాశారా? నాకైతే తెలియదు, ఒక్క సుస్మిత తప్ప.
కొత్తావకాయ పేరుతో సుపరిచితురాలైన సుస్మిత 2021 జనవరి లో రాసిన Hireath కథ తెలుగు కథ వస్తువు విస్తృతి కి, శిల్పానికి, అందమైన ఊహకు ఓ సరి కొత్త జోడింపు .
ఆ కథ గురించి కథకుడు, విమర్శకుడు ఉమా మహేశ్వర రావు సారంగ వెబ్ మాగజైన్ లో తన కాలమ్ కథా సమయం లో రాసినది ఇక్కడ చదవండి.
ఎవరైనా రచయిత్రులు తెలుగు సాహిత్యం లో సైన్స్ ఫిక్షన్ కథలు రాసి ఉంటే, కామెంట్ రూపం లో వివరాలు తెలియచేయండి.
సుస్మిత గారు ఇలాంటి మంచి కథలు మరెన్నో రాయాలని, కథల పుస్తకం కూడా వెలువరించాలని ఆత్మీయ విన్నపం.
Hireath కథను సుస్మిత గారి కొత్తావకాయ లో చదవండి.
0 వ్యాఖ్యలు:
Post a Comment