నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, February 18, 2010

ఆస్టిన్ లో ఏడంతుస్తుల భవనాన్ని ఢీ కొన్న విమానం

ఈ బ్లాగ్ పోస్ట్ రాసే సమయానికి ( ఫిబ్రవరి 18, గురువారం మధ్యాహ్నానికి .) మా వూరు ఆస్టిన్ ( టెక్సాస్ ) వైపు ప్రపంచం అంతా చూస్తోంది. మా ఇంటి కి రెండున్నర మైళ్ళ దూరం లో జరిగిన విమాన ప్రమాదం తో ఒక్కసారి ఆస్టిన్ నగరం ఉలిక్కిపడింది. 2001 తర్వాత ఏ విమాన ప్రమాదమైనా అందరి అనుమానం ఒక్కటే. తీవ్రవాదమే అందరి మదిలో మెదులుతుంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం అది తీవ్రవాద చర్య కాదు కానీ ఇదొక “ గృహ తీవ్రవాద “ సమస్య. అదొక్కటే కాకుండా నిందితుడికి ప్రభుత్వ రెవెన్యూ విభాగం IRS పని తీరు పట్ల వున్న తీవ్ర కోపం కూడా విమాన, భవన ప్రమాదానికి దారితీసింది.

రోజూ లాగానే ఆస్టిన్ హైవే హడావిడిగా కార్లతో కళకళలాడుతూ వున్నప్పుడు ఉదయం దాదాపు 10 గంటలప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన జోసెఫ్ స్టాక్ స్థానిక పైలట్. గత రాత్రి ఇంట్లో భార్య తో స్టాక్ గొడవపడ్డాదని తెలుస్తోంది. స్టాక్ భార్య, సవతి కూతురు ఇద్దరూ రాత్రి ఇంటి నుంచి హోటల్ కి వెళ్ళిపోయి పొద్దుటే వచ్చారని తెలుస్తోంది.స్టాక్ ఇంట్లో సమస్యలోక్కటేఈ ప్రమాదానికి కారణం కాదు. అతనికి ఎంతో కాలంగా ప్రభుత్వ పని తీరు పట్ల, ముఖ్యం గా ఐ ఆర్ ఎస్ పని తీరు పట్ల తీవ్రమైన అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది.

భార్య తో గొడవపడ్డ స్టాక్ 9-15 నిముషాలకు తన సొంత ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించేలా చేసి నార్త్ ఆస్టిన్ కి 20 మైళ్ళ దూరం లో వున్న జార్జి టౌన్ విమానాశ్రయం నుంచి ఒక చిన్న డబల్ సీటర్ చెరోకీ పైపర్ విమానం తీసుకొని వాళ్ళ ఇంటికి దగ్గరగా వున్న ఏడంతస్తుల బిల్డింగ్ ని ఢీ కొట్టాడు. ఈ భవనం లోనే ఐ ఆర్ ఎస్, ఇంకా కొన్ని ప్రభుత్వ ఆఫీసులున్నాయి.
53 ఏళ్ళ స్టాక్ సొంత సాఫ్ట్ వేఱ్ కంపెనీ వుంది. తన సొంత వెబ్ సైట్ లో ప్రభుత్వ వ్యతిరేక వ్యాసాలతో పాటు అతని ఆత్మహత్య నోట్ కూడా వుంది. ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రకటించటానికి ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తా సంస్థల కథనాలు. “ హింస ఒక్కటే సమాధానం “ అని స్టాక్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడని కూడా తెలుస్తోంది.
ఈ అగ్ని ప్రమాదం లో గాయపడ్డ వారి వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
అమెరికా ఆర్ధిక వ్యవస్థ లో వచ్చిన పెను మార్పులు కొందరి ప్రజల్లో ఎంత అసమ్ప్తృప్తి ని రగిలిస్తున్నాయో ఈ సంఘటన ద్వారా అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి దుందుడుకు చర్య చేసేలా ప్రేరేపించింది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తో పాటు,కుటుంబ సమస్యలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏదైనా, ఒక వ్యక్తి కున్న తీవ్ర కోపం ఎంత విద్వాంసానికి, ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసిందో కదా.

(ఈ స్పందన కేవలం ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసి రాసినదే.)

కల్పనా రెంటాల

6 వ్యాఖ్యలు:

Malakpet Rowdy said...

Shucks! What building is this?

Malakpet Rowdy said...

Just read the news ... looks like its the Echelon building on the 183 and Capitol of Texas highway intersection

Kalpana Rentala said...

భరద్వాజ, మన ఇళ్ళకు దగ్గరలోనే.. మాప్ ఇస్తున్నాను చూడండి.

Kalpana Rentala said...

Yep. That's right. nenu imkaa map pampistunnaanu meeku.

సుజాత వేల్పూరి said...

ప్రపంచం ఎలా తయారైందంటే ఎవరికి ఎవరి మీద కోపం వస్తే ఏం చేస్తారో తెలీకుండా ఉంది.

భావన said...

తెలియకుండా ఎక్కడ వుందిలే సుజాత, ఎవరికి ఎవరి మీద కోపం వచ్చినా అందరికి చెడు మాత్రం ఖచ్చితం గా చేస్తున్నారు, అంత వరకు తెలుస్తోంది కదా. (ఏమి చేస్తాము చెప్పండి ఇలా అనుకుని ఏడ్వలేక నవ్వటం తప్ప) :-(

 
Real Time Web Analytics