నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Wednesday, February 24, 2010

కురిసి మెరిసిన మంచు స్నేహితుడికి....


ఆత్మీయ స్నేహితుడా!

ఎన్నాళ్లయింది నిన్ను చూసి. నిన్ను సుతి మెత్తగా కౌగిలించుకొని. సుతారంగా ముద్దాడి. అప్పుడెప్పుడో మాడిసన్ లో వున్నపుడు ఆత్మీయం గా, ఆప్యాయం గా ఏటికేడాది మరింత సంతోషంగా వచ్చి మా ముంగిట ముగ్గులు పెట్టి వెళ్ళేవాడివి. నిన్ను వదిలేసి ఆస్టిన్ వచ్చామని అలిగావా? పోనీ లే ఇప్పటికైనా పాత స్నేహితుల్ని గుర్తు పెట్టుకొని మాకోసం ఇంత దూరం వచ్చావు. చూడు, నీ రాక ఇక్కదెంత మందిని ఆనందింపచేసిందో. మరి ఇలాగే వీలు కుదిరినప్పుడలా వచ్చి వెళుతూవుండు. నువ్వేప్పుడూ మాకు చిరకాల స్నేహితుడివే. మేమెప్పుడూ నీ ఆత్మీయులమే. మేము నిన్ను మర్చిపోలేదు.నువ్వు కూడా మమ్మల్ని మర్చిపోకూ. ఇలాగే అనుకోని అతిథి లా వచ్చి మమ్మల్ని పలకరించి వెళుతూ వుండూ.

మా వూర్లో కురిసి మెరిసిన మంచు స్నేహితుడికి....

3 వ్యాఖ్యలు:

శరత్ 'కాలమ్' said...

ఆస్టిన్ లో మంచు పడుతోందని వార్తల్లో విని ఆశ్చర్యపోయాను.

భావన said...

అంత మిస్ అవుతున్నారా ఆత్మీయుడిని మీరు మరీ అంత బాధ పడుతున్నారని మీ కోసం పంపించేము. ;-) మాకేమో వద్దంటే వస్తాడు కదా ఆత్మీయుడూ, వుండరా నాయనా అంటే వుండడు.

కొత్త పాళీ said...

మా వూర్రండి :)

భావనగారూ .. అందుకే మంచు స్త్రీలింగం :)

 
Real Time Web Analytics