అఫ్సర్ గారి ఏ కవిత చోరీ కి గురైంది అన్న విషయం తెలుసుకోవాలని, ఆ కవిత చదవాలని కొందరు ఆసక్తి చూపిస్తున్న కారణం గా ఆ కవిత ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ కవిత " ఊరి చివర" కవిత్వ సంకలనం లో వుంది. మొదటి సారి ఈ కవిత ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురితమైంది. కాపీ కి గురైన తర్వాత కూడా అదే టైటిల్ తో కవి పేరు మార్పు తో మళ్ళీ ఆంధ్రజ్యోతి లోనే ప్రచురితమైంది. ఈ కవిత ని అఫ్సర్ కవిత గా గుర్తించిన కవి నందిని సిధారెడ్డి.
సగమే గుర్తు
1.
వానది వొక్కటే భాష ఎప్పుడయినా ఎక్కడయినా.
దేహం పిచ్చుక సందేహ స్నానాల కింద తడుస్తూ.
వాన
లోపల్నించి కురుస్తుందా?
బయట్నించా?
నీకు గుర్తుండకపోవచ్చు
బహుశా నిన్న కురిసి వెళ్ళిపోయిన బచ్ పన్.
నీ వంటిని
ఇంటి ముంగిటి నీళ్ళల్లో
విడిచి వెళ్ళిపోయిన కత్తి పడవల్లో ఏముందో!
ఇప్పుడింక కురవడం మానేశాయేమో గాని
కాళ్ళ కింద తడి, బురదా అల్లాగే అంటుకునున్నాయి.
2.
లాగూ చొక్కా ఇంకా అట్లా జ్నాపకానికి వేలాడుతున్నాయి
మరీ చిన్నప్పటి వాసనేస్తున్నానా?
నిజమే!
మరపు తెరలు మరీ పల్చగా, మసగ్గా.
కనీ కనిపించని దూరపు మంచు మబ్బుల పరుగులు.
3.
మృగశిర ని మింగలేక
బయటికి కక్కలేక
కడుపులో పగుల్తున్న దుంప నేల
నీటి చినుకు పడంగానే ముందు పొగలు చిమ్ముతుంది
తరవాత
మళ్ళీ గతాన్ని తవ్వి తోడేసే పచ్చి వగరు వాసనవుతుంది.
4.
ఎన్ని వానలు చూళ్ళేదని?
మళ్ళీ
ప్రతి వానా అదేదో కొత్త వాసనేస్తుంది.
5.
అన్నీ గుర్తుండాలనేం లేదులే!
కొంత గుర్తూ, కొంత మరపూ
కొంత శబ్దం, కొంత నిశ్శబ్దమూ,
వొకటి లేనప్పుడు ఇంకోటి
ఇంకోటి లేనప్పుడు వొకటి
6.
వాన
ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు
జొన్నరొట్టే కాలుతోంది
వొంటి సెగల మీద
అఫ్సర్
1.
వానది వొక్కటే భాష ఎప్పుడయినా ఎక్కడయినా.
దేహం పిచ్చుక సందేహ స్నానాల కింద తడుస్తూ.
వాన
లోపల్నించి కురుస్తుందా?
బయట్నించా?
నీకు గుర్తుండకపోవచ్చు
బహుశా నిన్న కురిసి వెళ్ళిపోయిన బచ్ పన్.
నీ వంటిని
ఇంటి ముంగిటి నీళ్ళల్లో
విడిచి వెళ్ళిపోయిన కత్తి పడవల్లో ఏముందో!
ఇప్పుడింక కురవడం మానేశాయేమో గాని
కాళ్ళ కింద తడి, బురదా అల్లాగే అంటుకునున్నాయి.
2.
లాగూ చొక్కా ఇంకా అట్లా జ్నాపకానికి వేలాడుతున్నాయి
మరీ చిన్నప్పటి వాసనేస్తున్నానా?
నిజమే!
మరపు తెరలు మరీ పల్చగా, మసగ్గా.
కనీ కనిపించని దూరపు మంచు మబ్బుల పరుగులు.
3.
మృగశిర ని మింగలేక
బయటికి కక్కలేక
కడుపులో పగుల్తున్న దుంప నేల
నీటి చినుకు పడంగానే ముందు పొగలు చిమ్ముతుంది
తరవాత
మళ్ళీ గతాన్ని తవ్వి తోడేసే పచ్చి వగరు వాసనవుతుంది.
4.
ఎన్ని వానలు చూళ్ళేదని?
మళ్ళీ
ప్రతి వానా అదేదో కొత్త వాసనేస్తుంది.
5.
అన్నీ గుర్తుండాలనేం లేదులే!
కొంత గుర్తూ, కొంత మరపూ
కొంత శబ్దం, కొంత నిశ్శబ్దమూ,
వొకటి లేనప్పుడు ఇంకోటి
ఇంకోటి లేనప్పుడు వొకటి
6.
వాన
ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు
జొన్నరొట్టే కాలుతోంది
వొంటి సెగల మీద
అఫ్సర్
8 వ్యాఖ్యలు:
ఏ కవి పేరుతో మరల అచ్చయిందో రాస్తే బాగుణ్ణు మేడం..
అవును కల్పన గారు. ఆయన / ఆవిడ పేరు చెబితే బాగుంటుంది.
===
కెక్యూబ్, సాయికిరణ్:
ఆ పేరు కూడా 'సగమే గుర్తు" నారాయణ లాంటి పేరు. కానీ ఆ పేరు మీద నాకు ఆసక్తి లేదు. ఆ సంఘటన మీద కూడా నాకు ఆసక్తి లేదు, అంతకంటే పెద్ద "పెన్ను"పోట్లే భరించాను కనుక!
ఆ గొడవకేం గానీ, నేను రాసిన వాటిల్లో నాకు బాగా నచ్చిన కవిత ఇది. మీకూ నచ్చితే సంతసిస్తా..
చోరీకే పీఛే కౌన్ హై?
అఫ్సర్ గారు - ఈ కవిత బాగుందండి. నిజానికి నాకు వాన కవితలంటే చాలా ఇష్టం. నేను వ్రాసిన కవితల్లో నాకు నచ్చినవన్నీ వాన కవితలే :))
ఈ కవిత చదువుతుంటే, నేను వ్రాసిన ఈ కవిత గుర్తుకొచ్చింది.
=====
తడి
వాకిట్లో
వర్షం చొరబడితే
ఇల్లంతా వాకిలి చేస్తూ
నిన్నటి చినుకుల్లో
నిలువెల్లా తడిసింది
నాలాంటి పాపే!
అర్ధంతరంగా
ఆగిన వర్షాన్ని
కాగితం పడవలతో
పిలుస్తూ
మళ్ళీ ఈరోజు..
అఫ్సర్ గారు
మీ వాన కవిత్వం చాలా చాలా బాగుంది. చిన్నప్పుడు వానలో తడిసిన జ్ఞ్యాపకాలు. కత్తి పడవలు, కాళ్ళ కింద తడి,బురద,
ఎన్ని వానలు చూళ్ళేదని?
మళ్ళీ
ప్రతి వానా అదేదో కొత్త వాసనేస్తుంది.
నిజమే తొలకరి పడ్డప్పుడు, పుడమి తడిసిన వాసన ఎప్పుడు కొత్తగా పీల్చ్జిన ఫీలింగ్,
రియల్లీ ఎంజాయిడ్ , మీ కవిత్వాన్ని.
అఫ్సర్ గారూ, చాలా చాలా హాయిగొలిపే కవితండీ.
దశాబ్దాలుగా వానని చూస్తున్నా ప్రతిసారీ కొత్తగానే ఉంటుంది.
వానొక అర్ధంకాని అద్భుతం.
చాలా మంచి కవిత. ఈ సంవత్సరం కురుస్తున్న వానల్ని చూడటానికి రెండూ కళ్ళూ సరిపోవడం లేదు. మీ కవిత మళ్ళీ వానలో తడిసినంత హాయిగా ఉంది. :-)
ఎవరు చోరీ చేసేరో తెలియకపోతే మజా ఏవుందండీ. చోర్ పేరు తెలిస్తే అదో "తుప్తీ."
-ravikiran timmireddy
Post a Comment