" రంగుటద్దాలకిటికీ" కథా సంపుటి రచయిత, చిరకాల స్నేహితుడు శంకగిరి నారాయణస్వామి ( బ్లాగు లోకం లో కొత్త పాళీ గా సుపరిచితులు) సమన్వయ కర్త గా నవంబర్ 20, శనివారం సాయంత్రం 6.30 కి ( ఇండియా టైమ్ లో ) ప్రసారమైన చర్చా కార్యక్రమం ఇక్కడ వీక్షించండి. ఈ కార్యక్రమం లో విశిష్ట అతిధి గా పాల్గొన్న ఆచార్య సి. మృణాళిని " అయిదో గోడ " కథల గురించి లోతైన విశ్లేషణ చేశారు. కథల్లోని వస్తువు, శిల్పాల మీద తనదైన చూపు తో ఆమె చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తి గా సాగింది. చర్చ లో కవి, రచయిత శ్రీనివాస్ వాసుదేవ్, ఆలమూరు సౌమ్య, రహ్మానుద్దీన్ షేక్ ముగ్గురు కూడా విలక్షణం గా ఒకొక్కరు తమకు నచ్చిన రెండు మూడు కథల గురించి వివరమైన విమర్శ తో ప్రసంగించారు. ముఖ్యంగా చివర లో రచయిత్రి ని సూటిగా అడిగిన ప్రశ్నలు , సమాధానాలు చర్చ కు ఒక ఆసక్తికరమైన ముగింపునిచ్చాయి.
యూ ట్యూబ్ లైవ్ లో ప్రసారమైన ఈ కార్యక్రమం లో సాంకేతిక కారణాల వల్ల మొదట్లో కొంత ఇబ్బంది కలిగినా దాదాపు 200 మందికి పైగా లైవ్ ని వీక్షించి తమ స్పందన ను తెలియచేసారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment